Jump to content

అనాస

వికీపీడియా నుండి
(పైనాపిల్ నుండి దారిమార్పు చెందింది)

అనాస
చెట్టుపై పెరుగుతున్న పైనాపిల్
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
అ. కొమోసస్
Binomial name
అనానాస్ కొమోసస్
Synonyms

అనానాస్ సటైవస్

అనాస కాయలు

అనాస లేదా పైనాపిల్ (ఆంగ్లం: Pineapple) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిగా ఉండును. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉండును. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపం వ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్ట పడతారు. వారు దీన్ని దేవతాఫలంగా భావిస్తారు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్ను పండిస్తారు.

ప్రస్తావన

[మార్చు]

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. అనాస ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిరిగా ఉంటుంది. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉంటాయి. ఇది దక్షిణ అమెరికాలోని ఫిలిప్పైన్స్‌లో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పైనాపిల్‌ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్‌ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్టపడతారు. వారు దీన్ని దేవతా ఫలంగా భావిస్తారు. తాజా పండ్ల రూపంలోనే కాకుండా స్క్వాష్‌లు, జామ్‌లు, సిరప్‌లు, కార్డియల్స్ రూపంలో దీనిని మార్కెట్ చేస్తున్నారు. భారతదేశంలోకి ఇది 1548 సంవత్సరంలో ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయ్యింది. మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో పైనాపిల్‌ను పండిస్తారు. బహువార్షిక గుల్మము. దీని శాస్త్రీయ నామం ఎకోమోసస్‌. వృక్షశాస్త్రం ప్రకారం అనాస్‌ ఎకోమోసస్‌ అని..పిలుస్తారు. ఇది బ్రొమేలియా జాతికి చెందింది. ఇది 1 మీటరు నుండి 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది కొంచెం పరిపక్వతకు వచ్చిన తరువాత పువ్వు వస్తుంది ఈ పువ్వు సుమారుగా 15 సెం.మీ ఉంటుంది. ఈ పువ్వు 12 నుండి 20 నెలల తరువాత పూర్తి పరిపక్వానికి వచ్చి, దీనిపై కనీసం 100 కనుపులు వరకూ ఏర్పడతాయి. అనాసని 1398వ సంవత్సరంలో మెట్టమొదటగా కనుగొన్నారు. 1664 సంవత్సరంలో యూరోపియన్లు దీనిని పైన్‌ కోన్‌గా పిలిచారు. బ్రెజిల్‌లో టూపీ అని పిలుస్తారు. అద్భుతమైన పండు అని దీని అర్ధం. దీనిని ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. స్పానిష్‌లో పైన్‌ కోన్‌, అమెరికాలో అనాస్‌, మన దేశంలో అయితే ఒరియాలో సాపూరీ పనాసా, తమిళంలో అనాచీ పాజ్‌ హామ్‌, బెంగాళీ, మలయాళంలో అనారోష్‌ అని పిలు స్తారు. బ్రెజిల్‌లో పెద్ద అనాస పండును అబాకాక్సీ అని పిలుస్తారు. అయితే ఇంగ్లీష్‌లో పైన్‌యాపిల్‌, తెలుగులో అనాస అనే పేర్లతోనే అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వాడబడు తున్నాయి.ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో గిరిజనులు ఈ పంటను విస్తారంగా పండించి రాష్ట్రం నలుమూలలకు పంపిణీ చేస్తున్నారు

వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. పుల్లగా తియ్యగా ఉండే పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్‌లో 'సి' విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిలోని బ్రోమెలెయిన్‌ ఎంజైమ్‌ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇంతే కాదు చర్మ నిగారింపును పెంచే మరెన్నో ఎంజైమ్‌లు పైనాపిల్‌లో ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

పైనాపిల్, (అననాస్ కోమోసస్), బ్రోమెలియాసి కుటుంబానికి చెందిన శాశ్వత మొక్క తినే  పండు. అనాస లేదా పైనాపిల్ ఉష్ణమండల, ఉపఉష్ణమండల అమెరికాకు చెందినది. పండు అందుబాటులో ఉన్న చోట తాజాగా, ప్రపంచవ్యాప్తంగా తింటారు. యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలో దీనిని వంటలలో ఉపయోగిస్తారు.

పైనాపిల్  క్రిస్టోఫర్ కొలంబస్, గొంజాలో ఫెర్నాండెజ్ డి ఓవియెడో వై వాల్డెస్, సర్ వాల్టర్ రాలీలు పైనాపిల్ గురించి మొట్టమొదటి వ్రాతపూర్వక ప్రస్తావనలు చేశారు,[1] వారు వెస్ట్ ఇండీస్ లో అనాస లేదా పైనాపిల్ పెరుగుతున్నట్లు కనుగొన్నారు, అక్కడ దీనిని ఆహారం, వైన్ తయారీకి ఉపయోగించబడింది. అనాస లేదా పైనాపిల్ ప్రారంభము   పోర్చుగీసులో  జరిగింది. 1502 సంవత్సరంలో  ఆ ద్వీపాన్ని కనుగొన్న కొద్దిసేపటికే సెయింట్ హెలెనా ద్వీపం, ఆ తర్వాత కొద్దికాలానికే వారు దాన్ని ఆఫ్రికాకు, 1550 సంవత్సరం నాటికి భారతదేశానికి రావడం జరిగింది.16 వ శతాబ్దం ముగింపుకు ముందు, మొక్క  సాగు దక్షిణ పసిఫిక్ లోని  కొన్ని ద్వీపాలతో సహా ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలలో వ్యాపించింది. కోస్టారికా, బ్రెజిల్, చైనా, భారతదేశం, థాయ్ లాండ్ పైనాపిల్ కు ఆధునిక సాగు చేసే దేశాలుగా భావించవచ్చును.[2]

లక్షణాలు

[మార్చు]
  • బహువార్షిక గుల్మము.
  • అంచు కొనభాగం కంటకయుతంగా పొడవుగా ఉండే పత్రాలు.
  • కుదించబడిన అగ్రస్థ కంకి పుష్పవిన్యాసం.
  • సంయుక్త ఫలం.

ఉపయోగాలు

[మార్చు]
  • పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న అనాస పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన అనాసపండు రసం ఇస్తే చాలా మంచిది. అనాస పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు వుంచి తింటే అజీర్తి పోతుంది. పేగులో చలనం కలిగి విరోచనం సాఫీగా అవుతుంది.
  • అనాస పండును కోసుకొని తింటారు. దీనినుండి తీసిన రసం పానీయంగా త్రాగుతారు.
  • పైనాపిల్ జీర్ణక్రియ ప్రచారంలో సహాయపడుతుంది [3]
  • పైనాపిల్ వికారం ఉపశమనంలో సహాయపడుతుంది
  • అనాస జుట్టు రాలడం తగ్గించడములో సహాయపడుతుంది.

పోషక విలువలు

[మార్చు]
  • నీరు................ 87.8 గ్రా (ప్రతి వంద గ్రాములకు)
  • ప్రోటీన్ 0.4 "
  • కొవ్వు 0.1
  • పిండి పదార్తం: 10.8 "
  • కాల్షియం: 20 మి.గ్రా
  • పాస్పరస్ 9 "
  • ఇనుము 2.4 "
  • సోడియం 34.7 "
  • పొటాసియం 37 "
  • మాంగనీస్ 0.56 "
  • కెరోటిన్ 18 మైక్రో.గ్రా,
  • శక్తి: 46 కిలో కాలరీలు.

గర్భవిచ్ఛిత్తి

[మార్చు]

గర్భవతులు అనాస పండు తినడం శ్రేయస్కరం కాదు, గర్భవిచ్ఛిత్తి కావచ్చును. పచ్చికాయల రసంలో ఉప్పు వేసుకొని తాగితే ఋతుస్రావమౌతుంది. గర్భవిచ్ఛిత్తి కలుగుతుంది. కనుక గర్భవతులు తినకూడదు.

ఉపయోగాలు

[మార్చు]
  • రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది.
  • ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.
  • పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.
  • పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
  • జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం ఇవ్వడం ఎంతో మంచిది. అనాస పండును ఆహారంగా తీసుకోవడం అందరికీ తెలిసిందే! కానీ అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉంది.
  • అనాసపండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.
  • అనాసలోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది.
  • ఇది అర గడానికి రెండు గంటలు పడుతుంది. పండని అనాసకాయ తింటే అరగడం చాలా కష్టమవుతుంది. దీనితో విరేచనాలు అవుతాయి.
  • బాగా పండిన అనాస రసం శరీర తాపాన్ని తగ్గిస్తుంది. అదనపు శక్తిని కూడా కలిగిస్తుంది. ఈ పండులో ఉన్న కొన్ని ఎంజైమ్స్‌ కారణంగా జీర్ణశక్తి పెరిగి జీర్ణాశయానికి చక్కగా పనిచేస్తుంది.
  • ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పనిచేస్తుంది.
  • అనాసలో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధులలో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది.
  • పచ్చి అనాసకాయ రసం తెగిన గాయాలపై వేస్తే రక్త స్రావం అరికడుతుంది.
  • గ్లాసు అనాస పండు రసంలో పంచదార కలిపి సేవిస్తే వేసవిలో అతి దాహం అంతరించి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
  • పొగ తాగడం వల్ల శరీరానికి సంభవించే అనర్ధాలు తగ్గిపోతాయి.
  • తాజా అనాస పండు రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్‌ నివారణ అవుతాయి.
  • గజ్జి, దురద ఉన్నవారు అనాస రసం పైపూత మందుగా వాడితే మంచి గుణం కనిపిస్తుంది.
  • పచ్చ కామెర్ల కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, కొన్ని రకాల గుండెజబ్బులు ఉన్నవారు ప్రతిరోజు అనాసరసాన్ని తాగుతే మంచి ఫలితాలని స్థాయి.
  • పచ్చి అనాస రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుంది.
  • అనాస రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.
  • అనాసలో ఉన్న ఫైబర్ మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది.
  • అనాస వితమిన్ బి6 ఉంటుంది. గర్భవతులు ఈ పందు తినడమువలన వికారము నుండి ఉపశమనం పొందుతారు.[4]

అనాస పండు రసం

[మార్చు]

అనాస పండు మాంసం, రసం ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇది మొత్తం అమ్మిన, లేదా ప్రవేశపెట్టిన ఒక స్టిక్ తో విభజించటం జరుగుతుంది మధ్యలో ఒక చెర్రీతో మొత్తం, ముక్కలని అందంగ అలంకరిస్తారు. ఒక సాధారణ అలంకరించు ఉంటాయి. పైనాపిల్ భాగాలుగా పిజ్జా టాపింగ్స్, ఒక హాంబర్గర్ న ఒక గ్రిల్డ్ ఉంగరాన్ని సహా కొన్ని ఇంపైన వంటకాల, అలాగే, అటువంటి పండు సలాడ్ వంటి డెసెర్ట్లకు ఉపయోగిస్తారు. పిండి పైనాపిల్ పెరుగు, జామ్, స్వీట్లు, ఐస్ క్రీం ఉపయోగిస్తారు. అనాస పండు రసం ఒక పానీయం పనిచేశారు, అటువంటి వాటిలో ప్రధాన పదార్ధంగా ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. "History of Pineapple Fruit | Real Fruit Beverage". www.realfruitpower.com. Retrieved 2022-12-05.
  2. "Pineapple | Description, History, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-05.
  3. http://www.stylecraze.com/articles/amazing-health-benefits-of-pineapples/
  4. గర్భవతులకు అనాస ఉపయోగాలు
  • 2008 ఆగస్టు 24 ఈనాడు ఆదివారం సంచిక
"https://te.wikipedia.org/w/index.php?title=అనాస&oldid=3898737" నుండి వెలికితీశారు