పైడి తెరేష్ బాబు
పైడి తెరేష్ బాబు | |
---|---|
జననం | 1963 నవంబరు 3 |
మరణం | 2014 సెప్టెంబరు 29 |
జాతీయత | భారతదేశం |
వృత్తి | కవి, గాయకుడు, సంగీత కారుడు, దళిత సాహితీవేత్త |
భాగస్వామి | తాహెర సుల్తానా |
పిల్లలు | కుమారుడు (ప్రణయ్ చంద్ర), కుమార్తె (సాయి రితిక) |
తల్లిదండ్రులు | సుబ్బమ్మ, శాంతయ్య |
గాయకునిగా, కవిగా, సంగీత కారుడుగా, దళిత సాహితీవేత్తగా తెలుగు సాహితీ లోకంపై చెరిగిపోని స్థానం పొందినవాడు పైడి తెరేష్ బాబు (నవంబర్ 3, 1963 - సెప్టెంబరు 29, 2014). తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన అనతికాలంలోనే సమాజం మెచ్చే కవిగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన పైడి తెరేశ్ బాబు తెలంగాణకు గట్టి మద్దతుదారుగా నిలిచారు. అంతేకాక.. ఆంధ్రా ప్రాంతంలో కవులు, కళాకారులను కలిసి తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచేలా కృషి చేశారు.
జననం - ఉద్యోగం
[మార్చు]ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని గద్దల కుంటలో సుబ్బమ్మ, శాంతయ్య దంపతులకు 1963 నవంబర్ 3 న జన్మించాడు. శాంతయ్య పద్యాలు రాయడం, పాడడం చేయడంతో తెరేశ్‌బాబు కవిత్వంపై మక్కువ పెంచుకున్నారు. మొదటిసారిగా కొత్తగూడెం లోని ఆలిండియా రేడియోలో వ్యాఖ్యాతగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని ఆలిండియా రేడియోలో ఉద్యోగిగా స్థిరపడ్డారు.
వివాహం - పిల్లలు - నివాసం
[మార్చు]తాహెర సుల్తానాతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (ప్రణయ్ చంద్ర), కుమార్తె (సాయి రితిక) ఉన్నారు. నగరంలోని అశోక్‌నగర్‌లో నివసిస్తున్నారు.
రచనా ప్రస్థానం
[మార్చు]తెలుగులో గజల్స్ రాసి వాటికి ట్యూన్స్ చేసి పాడడంలో ఈయన నిష్ణాతుడు. ముఖ్యంగా అల్పపీడనం, ', హిందు మహాసముద్రం, నేను నా వింతల మారి ప్రపంచం వంటి ఎన్నో రచనలు చేశారు.
మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో సూటిగా, సున్నితంగా గుండెలను తట్టే తడితో ఆయన రాసిన ఎన్నో కవితలు పేరొందాయి. దళిత కవిత్వంలోని అగ్నిజ్వాలలను, అదే సమయంలో మానవ జీవితంలోని ప్రేమ, అనుభూతి అలాంటి అనేక అంశాలను ఆయన తన గేయాల్లో ఆవిష్కరించారు.
కవిసంగమం గ్రూప్ లో చాలా కవితలు రాశారు
రచనలు
[మార్చు]1)కావడి కుండలు 2)హిందూ మహా సముద్రం(దళిత పాటల క్యాసెట్)
మరణం
[మార్చు]ఆకాశవాణిలో ఎనౌన్సర్‌గా పనిచేస్తున్నగా ఈయన గతకొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, లివర్ పూర్తిగా చెడిపోయి పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 29, 2014 సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు.
చిత్రమాలిక
[మార్చు]-
పైడి తెరేష్ బాబు దర్శకత్వం వహించిన నాటకంలోని నటులు
-
పైడి తెరేష్ బాబుకి సత్కారం
-
ఆకాశవాణిలో పైడి తెరేష్ బాబు
-
కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్లో గోరటి వెంకన్నతో కచేరి
-
కవిసంగమం మిత్రులతో పైడి తెరేష్ బాబు
మూలాలు
[మార్చు]- వన్ ఇండియా వెబ్ లో వ్యాసం
- టీవి10లో పైడి తెరేష్ బాబు గురించిన వీడియో Archived 2014-10-01 at the Wayback Machine
- సరసభారతి ఉయ్యూరు వెబ్ లో వ్యాసం
ఇతర లంకెలు
[మార్చు]- ఫేస్ బుక్ పైడి తెరేష్ బాబు పేజీ
- పైడి తెరేష్ బాబు రాసిన కవిత్వపు వీడియో
- ఆంధ్రజ్యోతి వెబ్ లో దెంచనాల శ్రీనివాస్ రాసిన వ్యాసం[permanent dead link]
- వాకిలి సాహిత్య వెబ్ పత్రికలో పైడి తెరేష్ బాబు ముఖాముఖి
- 10టీవి లో పైడి తెరేష్ బాబుపై ప్రత్యేక కార్యక్రమం
- [http://www.andhrajyothy.com/Artical?SID=30522&SupID=26 బహుజన గీతాకారుడు - డాక్టర్ కోయి కోటేశ్వరరావు�][permanent dead link]