పెళ్లి మీద పెళ్లి
స్వరూపం
పెళ్ళి మీద పెళ్ళి (1959 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.విఠలాచార్య |
తారాగణం | జె.వి.రమణమూర్తి, కృష్ణ కుమారి, జయశ్రీ, మీనాకుమారి, చలం, మిక్కిలినేని |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పెళ్ళి మీద పెళ్ళి 1959 నవంబరు 8న విడుదలైన తెలుగు సినిమా. విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద బి.విఠలాచార్య నిర్మించిన ఈ సినిమాకు బి. విఠలాచార్య దర్శకత్వం వహించాడు. టి.కృష్ణ కుమారి, మీనా కుమారి, జె.వి.రమణ మూర్తి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- జె.వి.రమణమూర్తి
- కృష్ణ కుమారి - లక్ష్మి
- జయశ్రీ
- మీనాకుమారి
- చలం
- మిక్కిలినేని
- పెరుమాళ్ళు - సుబ్బయ్య
- రమాదేవి
- ఉదయలక్ష్మి
- ఎ.వి.సుబ్బారావు
- లంక సత్యం
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: బి. విఠలచార్య;
- ఛాయాగ్రాహకుడు: ఎస్.కె. వరదరాజన్;
- ఎడిటర్: జి. విశ్వనాథన్;
- స్వరకర్త: రాజన్-నాగేంద్ర;
- గేయ రచయిత: జి. కృష్ణ మూర్తి
- సమర్పించినవారు: B.L.A. సెట్టి;
- కథ: బి.వి.ఆచార్య;
- సంభాషణ: జి. కృష్ణ మూర్తి
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీలా, ఎస్.జానకి, టి.ఎస్. బాగవతి, నాగేందర్, పి.బి. శ్రీనివాస్
- ఆర్ట్ డైరెక్టర్: బి.సి. బాబు;
- డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి
పాటలు
[మార్చు]- కనులనే కలిపి కలతను నిలిపి, రచన: జి. కృష్ణమూర్తి, గానం. ప్రతివాది భయంకర శ్రీనివాస్, పి. సుశీల
- ప్రియతమా అందీ అందకపోయే ఆటలేలా, రచన: జి. కృష్ణమూర్తి, గానం. పి బి. శ్రీనివాస్ , టి ఎస్ భగవతి
- మదిలో మెదిలే మరులేలా మారేను జీవనమీవేళా, రచన: జి. కృష్ణమూర్తి, గానం. పులపాక సుశీల
- అదరక బెదరక నువ్వు పదవమ్మ , రచన:జీ . కృష్ణమూర్తి . గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు
- ఓ మనసా కుములవలదే కుమిలి కృశించవలదే, రచన: జి.కృష్ణమూర్తి, గానం.పులపాక సుశీల
- ఒరచూపు చూసిపోవు చిన్నదాన నిన్నుచేరరాక, రచన: జి.కృష్ణమూర్తి, గానం.శిష్ట్లా జానకి, నాగేంద్ర
- కనులను కలిపి కలతను నిలిపి కదిలేదనంటే కుదరదులే, రచన: జి.కృష్ణమూర్తి, గానం.పి .సుశీల
- చిరునవ్వుల నవవసంతం విరజల్లెను నవనీతం, రచన: జి.కృష్ణమూర్తి, గానం.పి.బి.శ్రీనివాస్, నాగేంద్ర
- విధి ఎదురై నిలిచెనిలా యిక బ్రతుకేలా, రచన: జి.కృష్ణమూర్తి, గానం.భగవతి
- చిరునవ్వుల నవ వసంతం విరజల్లెను నవనీతం, రచన: జి.కృష్ణమూర్తి, గానం.పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
- నెలరాజా అలిగేవేలా నీలి మేఘాల దాగనేల జాలి చూపవేలా , రచన: జి.కృష్ణమూర్తి, గానం.పి.సుశీల
- పిల్లా పిల్లా పిల్లా మాతో ఢీ కొట్టి పోటీలో గెలుచుటకల్ల, రచన: జి.కృష్ణమూర్తి, గానం.శిష్ట్లా జానకి, నాగేంద్ర.
మూలాలు
[మార్చు]- ↑ "Pelli Meedha Pelli (1959)". Indiancine.ma. Retrieved 2021-04-15.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.