Jump to content

పెళ్లి కూతురు పార్టీ

వికీపీడియా నుండి
పెళ్లి కూతురు పార్టీ
దర్శకత్వంఅపర్ణా మల్లాది
స్క్రీన్ ప్లేఅపర్ణా మల్లాది
కథఅపర్ణా మల్లాది
నిర్మాతఏ.వీ.ఆర్‌. స్వామి
తారాగణంరాహుల్ విజయ్
శివాని రాజశేఖర్
అవసరాల శ్రీనివాస్
తనికెళ్ల భరణి
ఛాయాగ్రహణంనరేన్ ఎలాన్
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంశ్రీకర్‌ అగస్తీ
నిర్మాణ
సంస్థ
పృథ్వీ క్రియేషన్స్
విడుదల తేదీ
31 ఆగస్టు 2022 (2022-08-31)
దేశం భారతదేశం
భాషతెలుగు

పెళ్లి కూతురు పార్టీ 2022లో విడుదలైన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా.[1] పృథ్వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఏ.వీ.ఆర్‌. స్వామి నిర్మించిన ఈ సినిమాకు అపర్ణ మల్లాది దర్శకత్వం వహించింది.[2][3] ప్రిన్స్‌, అనీషా, అర్జున్, కళ్యాణ్ పవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 27న విడుదల చేయగా,[4] సినిమా ఆగష్టు 31న ఆహా ఓటీటీలో విడుదలైంది.

ఆర్కిటెక్చర్ నందిని (భావన) పైలట్ అయిన క్రిష్ (వికాస్ దర్శన్) వాళ్ళిద్దరికీ పెద్దలు పెళ్లి కుదురుస్తారు. ఈ సమయంలో అక్క పెళ్లి చేసుకోబోయే క్రిష్ ను పెళ్లి కూతురు నందిని చెల్లి రాణి (అనీషా ధామా) ముద్దు పెట్టుకుంటుంది. అది తప్పని గ్రహించి అక్క పెళ్లిని తను ముద్దు పెట్టిన వ్యక్తితో తప్పించి వేరే వ్యక్తి (ప్రిన్స్)తో చేయడానికి వేసిన ప్లాన్ చేసి తిరుపతికి వెళ్తారు. తిరుపతి నుండి హైదరాబాద్ వచ్చే క్రమంలో పోలీస్ అయిన విక్రమ్ (ప్రిన్స్)ని నందినితో పెళ్లి కుదర్చడానికి వాళ్ళు ఎదుర్కొన్న అడ్డంకులు? వాటిని అధిగమించడానికి వేసిన ప్లాన్స్... ఆ ప్లాన్ ని అమలుచేసే క్రమంలో తమ బామ్మ (అన్నపూర్ణ) పాత్ర ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]
  • ప్రిన్స్‌
  • సాయి కేతన్‌రావు[5]
  • అనీషా
  • అర్జున్
  • కళ్యాణ్ పవన్
  • కిరాక్ సీత
  • సురేష్
  • భావన
  • అన్నపూర్ణమ్మ
  • జయత్రీ
  • ఫణి
  • అల్లమట్టి నాని నవీన్
  • సాయి కేతన్ రావు
  • చరణ్ లక్కరాజు
  • రాజేష్ వుల్లి

మూలాలు

[మార్చు]
  1. "పెళ్లి కూతురు రెడీ అయిపోయింది". Chitrajyothy. 5 April 2022. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  2. "'Pellikuturu Party' is going to be masala entertainer: Aparna Malladi" (in ఇంగ్లీష్). Telangana Today. 28 May 2021. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  3. "పెళ్లి కూతురు పార్టీ సందడి". NT News. 5 April 2022. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  4. "'పెళ్లి కూతురు పార్టీ'లో ఏం జరిగింది." 27 August 2022. Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.
  5. The Hans India (6 April 2022). "Sai Ketan Rao talks about his upcoming project 'Pellikuturu Party'" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2025. Retrieved 4 January 2025.

బయటి లింకులు

[మార్చు]