Jump to content

పెద కొత్తపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 15°35′8.268″N 80°1′10.200″E / 15.58563000°N 80.01950000°E / 15.58563000; 80.01950000
వికీపీడియా నుండి
పెద కొత్తపల్లి
పటం
పెద కొత్తపల్లి is located in ఆంధ్రప్రదేశ్
పెద కొత్తపల్లి
పెద కొత్తపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°35′8.268″N 80°1′10.200″E / 15.58563000°N 80.01950000°E / 15.58563000; 80.01950000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంమద్దిపాడు
విస్తీర్ణం14.44 కి.మీ2 (5.58 చ. మై)
జనాభా
 (2011)[1]
3,736
 • జనసాంద్రత260/కి.మీ2 (670/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,828
 • స్త్రీలు1,908
 • లింగ నిష్పత్తి1,044
 • నివాసాలు1,031
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523211
2011 జనగణన కోడ్591066


పెద కొత్తపల్లి ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన మద్దిపాడు నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 11 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1031 ఇళ్లతో, 3736 జనాభాతో 1444 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1828, ఆడవారి సంఖ్య 1908. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1680 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 21. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 591066[2].

సమీప గ్రామాలు

[మార్చు]

ఏడుగుండ్లపాడు 5 కి.మీ, మద్దిపాడు 4 కి.మీ, లింగంగుంట 6 కి.మీ, బసవన్నపాలెం 4 కి.మీ, నందిపాడు 5 కి.మీ, ఒంగోలు 12 కి.మీ.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • పెదకొత్తపల్లి గ్రామ పంచాయితిలో క్రింది గ్రామాలు వున్నాయి:- మారెళ్ళగుంటపాలెం, నరసాయపాలెం, అంజయ్యనగర్.
  • 2013 జూలైలో పెదకొత్తపల్లి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో నల్లూరి వెంకటశేషమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శివాలయం:- ఇక్కడి శివాలయం దక్షిణముఖంగా కలదు, అమ్మవారు తూర్పుముఖంగా ఉంటుంది.
  • శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవాలయం:- పెదకొత్తపల్లిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంపై ఉన్న కలశానికి అతీతశక్తులున్నాయని, ఆ కలశం విలువ రూ.5 కోట్లు .అది బియ్యాన్ని కూడా ఆకర్షిస్తుంది అంతర్జాతీయ మార్కెట్‌లో అతీత శక్తులు ఉన్న దాని విలువ రూ.5 కోట్లు పైమాటే నని. దానిని తెచ్చి ఇస్తే రూ.5 లక్షలు ఇస్తామంటూ' కొందరు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మిన ఓ ముఠా గుంటూరు జిల్లా నుంచి స్కార్పియో వాహనంలో ఇక్కడికి వచ్చింది. తమను ఎవరూ అనుమానించకుండా వెంట ఓ మహిళను కూడా తీసుకొచ్చారు. తాము పావురాళ్ల వేటగాళ్లుగా నమ్మించారు. ఆలయంపై కలశాన్ని దొంగిలించేందుకు యత్నించి మద్దిపాడు పోలీసులకు పట్టుబడ్డారు.
  • శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం:- గ్రామంలో నూతనంగా ఈ అలయ నిర్మాణానికి, 2017, మార్చి-18వతేదీ శనివారంనాడు, శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించి, దేవాలయ నిర్మాణానికి తీసిన పునాదిలో, బిందెలతో నీరుపోసి, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా నిర్మాణం పూర్తి అయిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017, జూలై-1వతేదీ సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు.
  • శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్సమేత శ్రీ రామచంద్రమూర్తివారి ఆలయం:- పెదకొత్తపల్లి గ్రామంలోని అంజయ్యనగర్‌లోని ఈ ఆలయంలో 2017, జూన్-8వతేదీ గురువారం ఉదయం 8-30 కి, శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి విగ్రహ ధ్వజస్తంభ, విమాన, కలశ, మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు ధ్వజస్తంభానికి నవధాన్యాలు సమర్పించి పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఉదయం 9 గంటల నుండి భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు స్థానికులతోపాటు పరిసరప్రాంతాలనుండి గూడా భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు.
  • శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం:- ఈ 21 అడుగుల విగ్రహం వద్ద, 2015, మే నెల-13వ తేదీ నుండి 23వ తేదీ వరకు, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆఖరిరోజైన 23వతేదీ శనివారంనాడు, భజనా కర్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1001 నిమ్మకాయల గజమాలను అలంకరించారు. 101 బుట్టల అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇకనుండి, హనుమాన్ చాలీసా భజనా కార్యక్రమాన్ని, ప్రతి శనివారంనాడు, ఒక సంవత్సరం పాటు నిర్వహించెదరని గ్రామస్థులు తెలియజేసినారు.

ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

నేతాజీతో పాటు యుద్ధంలో పాల్గొన్న కోటా వీరాస్వామి పీటర్, ఈ గ్రామస్తుడే.

నల్లూరి రామస్వామి :- ఇతను ఈ గ్రామానికి మూడుసార్లు సర్పంచిగా పనిచేసి, గ్రామానికి విశేషసేవలందించి, అందరి మన్ననలను పొందినారు. వీరు సి.పి.ఐ.లో ఎంతోకాలం పనిచేసి, పేదలకు పెన్నిధిగా ఎంతోమందిని అభివృద్ధిపథంలో నిలిపినారు. వీరి సేవలకు గుర్తుగా, గ్రామంలో వీరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీరి 5వ వర్ధంతిని, గ్రామంలో, 2015, మార్చి-21వ తేదీనాడు నిర్వహించారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామంలో 60 సంవత్సరాల క్రితం, కాంగ్రెస్ నేత శ్రీ ఉప్పుటూరి ఆదిశేషయ్య నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. కాలక్రమేణా ఆ విగ్రహం శిథిలమవగా, విశ్రాంత ఉద్యోగి నల్లూరి వెంకటేశ్వర్లు, తన స్వంత ఖర్చుతో నూతన విగ్రహన్ని ఏర్పాటు చేసారు. అవసరమైన స్థలాన్ని శ్రీ గోనుగుంట వీరయ్య విరాళంగా అందించారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ, నేతాజీ శతజయంతి ఉత్సవాలను, నేతాజీ జన్మదినం సందర్భంగా, 2016, జనవరి-23న ఘనంగా నిర్వహించారు.

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,860. ఇందులో పురుషుల సంఖ్య 1,940, మహిళల సంఖ్య 1,920, గ్రామంలో నివాస గృహాలు 924 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,444 హెక్టారులు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మద్దిపాడులోను, ఇంజనీరింగ్ కళాశాల ఏడుగుండ్లపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ ఒంగోలులోను, మేనేజిమెంటు కళాశాల దొడ్డవరప్పాడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మద్దిపాడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఒంగోలులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెద కొత్తపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పెద కొత్తపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 151 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 27 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1264 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1258 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 6 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పెద కొత్తపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • ఇతర వనరుల ద్వారా: 6 హెక్టార్లు
  • చెరువు

ఈ చెరువు 70 ఎకరాలలో విస్తరించియున్నది. ఇది చుట్టుప్రక్కల గ్రామాలలోని చెరువులకంటే పెద్దది. దీనిలో 40 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉంది. మిగిలిన భాగం వృధాగా ఉంది. అది గూడా ఉపయోగంలోనికి వస్తే, గ్రామానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం నాలుగు చెరువులున్నవి.

ఉత్పత్తి

[మార్చు]

పెద కొత్తపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

పొగాకు, శనగ

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]