పెగ్గు
స్వరూపం
పెగ్గు అనేది సాధారణంగా భారత ఉపఖండంలో మద్యాన్ని కొలిచేందుకు వాడే కొలత. 30 మిల్లీలీటర్లకు సమానమైన పరిమాణాన్ని పెగ్గు అంటారు. పెగ్గు అనే కాకుండా "పెద్ద పెగ్గు", "చిన్న పెగ్గు" అనే కొలతలను కూడా వాడుతారు. పెద్దపెగ్గు 60 మి.లీ. కు సమానం కాగా, చిన్నపెగ్గు 30 మి.లీ. కు సమానం. కేవలం పెగ్గు అంటే చిన్నపెగ్గు అనే అర్థం. బ్రిటిషు కాలంలో ఇది ఒక ఇంపీరియల్ ఔన్సుకు (28.4 మి.లీ.) సమానం. తరువాత ఇది 30 మి.లీ. గా ప్రమాణమై పోయింది. 120 మి.లీ. పరిమాణంలో ఉండే పెగ్గును పాటియాలా పెగ్గు అంటారు. [1]
మరింత జనాంతికంగా చెప్పాలంటే, పెగ్గు అంటే ఒక్క గుక్కలో మింగివేయగల మద్యం పరిమాణం.
భారతదేశంలో పెగ్గు అని పిలిచే ఈ కొలతను వివిధ దేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. చాలా దేశాల్లో దీన్ని షాట్ అని అంటారు.[2] ఆస్ట్రేలియాలో చిన్నపెగ్గును నిప్ అని పిలుస్తారు. [3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Kirin Narayan, Love, stars, and all that, Piatkus, 1995, ISBN 978-0-7499-0265-0,
A Patiala peg is as high as the distance between pinky and index finger.
- ↑ "shot". Oxford English Dictionary (2nd ed.). Oxford University Press. 1989.
- ↑ "Alcohol – Standard drinks guide". alcohol.gov.au. Archived from the original on 2019-06-03. Retrieved 2020-02-03.