పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
జననం | 1898 జూలై 8 రాజపాళయం |
---|---|
మరణం | 1957 మార్చి 15 |
మరణ కారణం | గుండెపోటు |
వృత్తి | ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒడిషా గవర్నరు |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమరయోధుడు |
రాజకీయ పార్టీ | కాంగ్రెసు |
తండ్రి | సంజీవి రాజు |
తల్లి | ముత్తమ్మాళ్, |
పూసపాటి కుమారస్వామి రాజా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒడిషా గవర్నరుగా పనిచేసారు. శ్రీమతి ముత్తమ్మాళ్, శ్రీ సంజీవి రాజు దంపతులకు 1898 జూలై 8 వ తేదీన రాజపాళయంలో కుమారస్వామి రాజా జన్మించారు. తల్లి దాట్ల వారి ఆడపడుచు. తండ్రి స్వగ్రామం కృష్ణా జిల్లాకు చెందిన పూసపాడు గ్రామం. చిన్నవయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న రాజాను తన మేనత్త అయిన గొట్టుముక్కల మంచమ్మ పెంచి పెద్దచేశారు.
రౌలట్ చట్టాన్ని నిరసించి ప్రజలను సత్యాగ్రహానికి జాగృతం చేసేందుకు వచ్చిన మహాత్మాగాంధీని దర్శించి, ఆయన ఆకర్షణ శక్తికి మంత్రముగ్ధులయ్యారు. అనాటి నుండి దేశ సేవా రంగంలోకి దిగాడు. హోంరూల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రాజా కాంగ్రెస్ పార్టీ ఆదర్శాలను, లక్ష్యాలను పటిష్ఠం చేశారు. అనేక బ్యాంకులకు డైరెక్టరు, అధ్యక్ష పదవులను చేపట్టి సహకార ఉద్యమానికి పాటు పడ్డారు. బ్రిటిషు పాలనలో కొంత కాలం జైలు జీవితం గడిపారు. కొంతకాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కుమారస్వామి రాజా టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న హయంలో వ్యవసాయ శాఖను నిర్వహించారు.
కుమారస్వామి రాజా 1949 ఏప్రిల్ లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి,1952 వరకూ ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ (జ్యూడిషియల్) ను ఎక్జిక్యూటివ్ నుండి వేరు చేశారు. ఆ తర్వాత 1954 ఫిబ్రవరిలో ఒడిషా రాష్ట్రానికి గవర్నరుగా నియమితుడయ్యారు. సంతానం లేని కుమారస్వామి 'గాంధీ కళామందిరం', 'కాంగ్రెస్ స్వర్ణోత్సవ మైదానం' అను సంస్థలను స్థాపించారు. ఆంధ్ర ప్రదేశ్లో క్షత్రియ సేవా సమితి ఆవిర్భావానికి విత్తు వేసిన కుమారస్వామి రాజా గుండెపోటుతో మద్రాసులో 1957 మార్చి 15 న కన్నుమూశారు.
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]- మూలాలు లేని వ్యాసాలు
- కృష్ణా జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- 1898 జననాలు
- 1957 మరణాలు
- మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రులు
- ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులు
- కృష్ణా జిల్లాకు చెందిన గవర్నర్లు
- మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రులు
- మద్రాసు ప్రెసిడెన్సీలో శాసన సభ్యులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ సభ్యులు