పూనంబెన్ మాడమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూనంబెన్ హేమత్ భాయ్ మాడమ్

ముందు అహిర్ విక్రంభాయ్ అర్జన్‌భాయ్ మేడమ్
నియోజకవర్గం జాంనగర్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1974-09-23) 1974 సెప్టెంబరు 23 (వయసు 50)
జామ్‌నగర్ , గుజరాత్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2009 - 2012)
భారతీయ జనతా పార్టీ (2012 - ప్రస్తుతం)
తల్లిదండ్రులు హేమత్ భాయ్, దీనాబెన్
జీవిత భాగస్వామి పెర్మిందర్ కుమార్
సంతానం 1 కుమార్తె (మరణించింది)
నివాసం 47, లోధి ఎస్టేట్, న్యూఢిల్లీ

పూనంబెన్ హేమత్ భాయ్ మాడమ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పూనంబెన్ మాడమ్ 1974 సెప్టెంబరు 23న గుజరాత్ రాష్ట్రం, జామ్‌నగర్‌లో హేమత్ భాయ్, దీనాబెన్ దంపతులకు జన్మించింది. ఆమె 1990లో 10వ తరగతి, 1992లో 12వ తరగతి పూర్తి చేసి 1995లో వడోదర మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యశాస్త్రంలో పట్టభద్రురాలైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

పూనంబెన్ మాడమ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2012లో భారతీయ జనతా పార్టీలో చేరి 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో ఖంభాలియా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అహిర్ విక్రంభాయ్ అర్జన్‌భాయ్ మేడమ్ పై 1,75,289 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై పార్లమెంట్‌లో మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా, పరిశ్రమపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యురాలిగా పని చేసింది.

పూనంబెన్ 2019లో జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మురుభాయ్ కండోరియా అహిర్ పై 2,36,804 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై పార్లమెంట్‌లో పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యురాలిగా, పరిశ్రమపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా, మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యురాలిగా, మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లుపై జాయింట్ కమిటీ సభ్యురాలిగా పని చేసింది.

పూనంబెన్ 2024లో జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జేపీ మరవ్యపై 238008 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3]

మూలాలు

[మార్చు]
  1. TV9 Gujarati (5 March 2024). "જામનગર બેઠક પર પૂનમ માડમનું જ લેવામાં આવે છે નામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચુક્યા છે વખાણ". Retrieved 31 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jamnagar". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.