Jump to content

పుట్టెనహల్లి సరస్సు (యలహంక)

వికీపీడియా నుండి
పుట్టెనహల్లి సరస్సు (యలహంక)
ప్రదేశంయలహంక, కర్ణాటక
సమీప నగరంబెంగళూరు
విస్తీర్ణం10 హెక్టార్లు
స్థాపితం2007
పాలకమండలిPrincipal Chief Conservator of Forests (Wildlife), Karnataka

పుట్టెనహల్లి సరస్సు బెంగుళూరుకు ఉత్తరాన 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న యలహంక సమీపంలో ఉంది. 10 హెక్టార్ల విస్తర్ణంలో ఈ సరస్సు విస్తరించి ఉంది. ఇదే పేరుతో JP నగర్ దక్షిణ బెంగుళూరులో మరో పుట్టెనహళ్లి సరస్సు ఉంది. [1]

అభివృద్ధి కార్యక్రమాలు

[మార్చు]

స్థానిక ప్రదేశానికి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు పక్షులను రక్షించడానికి, ప్రభుత్వ సహాయంతో సరస్సులో జీవవైవిధ్యాన్ని పెంచడానికి "యలహంక పుట్టెనహళ్లి సరస్సు, పక్షుల సంరక్షణ ట్రస్ట్" అనే ట్రస్ట్‌ను ప్రారంభించారు. సరస్సును జీవ వైవిధ్య ప్రదేశంగా మార్చడానికి, ప్రభుత్వం, ట్రస్ట్ లు కృషి చేస్తున్నాయి.

వేక్ ది లేక్

[మార్చు]

క్షీణించి పోతున్న సరస్సులను పునరుద్ధరించడానికి 'వేక్ ది లేక్' కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగానే పుట్టెనహల్లి సరస్సును అభివృద్ధి పరుస్తున్నారు. సరస్సు చుట్టూ నివసిస్తున్న సమాజాన్ని చైతన్యపరచడం, సరస్సును పునరుద్ధరించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.[2]

పక్షులు

[మార్చు]

జీవవైవిధ్య నిపుణులు ఇక్కడ 49 జాతుల పక్షులను కనుగొన్నారు. ఆ పక్షులలో డార్టర్స్, పెయింట్ క్రెన్స్, నైట్ హెరాన్స్, పర్పుల్ హెరాన్స్, పౌండ్ హెరాన్స్, ఎగ్రెట్స్, ఆసియన్ ఓపెన్‌బిల్ క్రేన్స్, యురేషియన్ స్పూన్‌బిల్స్, స్పాట్-బిల్ పెలికాన్స్, లిటిల్ గ్రెబ్స్, స్మాల్ కార్మోరెంట్స్, ఇండియన్ స్పాట్-బిల్ డక్స్, పర్పుల్ మూరెన్స్, కామన్ శాండ్‌పైపర్‌లు ముఖ్యమైనవి.[3]

మూలాలు

[మార్చు]
  1. https://books.google.co.in/books?id=uM6FDwAAQBAJ&pg=PA89&dq=puttenahalli+lake+yelahanka&hl=en&sa=X&ved=0ahUKEwjuybPxgZrmAhXcILcAHRDJA5MQ6AEIOzAC#v=onepage&q=puttenahalli%20lake%20yelahanka&f=false Google books
  2. https://www.thehindu.com/news/cities/bangalore/yelahankas-puttenahalli-lake-to-be-rejuvenated-soon/article26101894.ece As mentioned in The Hindu article
  3. It may soon become the first bird sanctuary in Karnataka.