Jump to content

పి.టి. శ్రీనివాస అయ్యంగార్

వికీపీడియా నుండి
పి.టి.శ్రీనివాస అయ్యంగార్

పిళ్ళైపుండగుడి తిరువెంగదత్తయ్యంగార్ శ్రీనివాస అయ్యంగార్ (1863-1931) భారతీయ చరిత్రకారుడు, భాషావేత్త, విద్యావేత్త. అతను దక్షిణ భారతదేశ చరిత్రపై పుస్తకాలు రాసాడు.

ఉపాధ్యాయ వృత్తి

[మార్చు]

శ్రీనివాస అయ్యంగార్ ఇరవయ్యవ శతాబ్ది మొదటి రెండు దశాబ్దాలలో విశాఖపట్నంలోని ఎవిఎన్ కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేశాడు. [1] పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలని, సామాన్యులు మాట్లాడే మాండలికాలను ప్రవేశపెట్టాలనీ ఆయన ప్రచారం చేసాడు. 1909 లో అతను తెలుగుకు ప్రాచుర్యం కల్పించేందుకు, ఒక తెలుగు బోధనా సంస్కరణ సంఘాన్ని ఏర్పాటు చేసాడు. [2] [3] 1911 లో అయ్యంగార్ ఆధునిక తెలుగులో లాంగ్మన్ అరిథ్‌మెథిక్కులు అనే అంకగణిత పాఠ్యపుస్తకాన్ని ప్రచురించాడు. [4] 1913 ఏప్రిల్లో, మద్రాస్ విశ్వవిద్యాలయం వారు మునుపటి ఎఫ్ఎ స్థానంలో ప్రవేశపెట్టిన ఇంటర్మీడియట్ కోర్సు యొక్క తెలుగు కూర్పు కోసం అనుసరించాల్సిన శైలిని పరిశీలించడానికీ సలహా ఇవ్వడానికీ ఒక కమిటీని నియమించినప్పుడు, అయ్యంగార్ ఆ కమిటీ పది మంది సభ్యులలో ఒకరిగా నియమించబడ్డాడు.

అతను రాజమండ్రి శిక్షణ కళాశాలలో ప్రిన్సిపాలు‌గా ఇంగ్లీష్ ప్రొఫెసరుగా పనిచేస్తూండగా, తోటి ఇండాలజిస్టులు డాక్టర్ ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్ ఏకైక ప్రొఫెసరుగా, వి.ఆర్.రామచంద్ర దీక్షితార్ ఏకైక లెక్చరరు‌గా ఉన్నపుడు, ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ రీడరుగా నియమితుడయ్యాడు. బహుశా 1931 లో మరణించే వరకు అతను రీడరుగా పనిచేశాడు. [5]

పుస్తకాలు

[మార్చు]
  • పి. టి. శ్రీనివాస అయ్యంగార్ (1909). భారతీయ తత్వశాస్త్రం యొక్క రూపురేఖలు. థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్.
  • పి. టి. శ్రీనివాస అయ్యంగార్ (1909). డెత్ ఆర్ లైఫ్: ఎ ప్లీ ఫర్ ఫర్ ది వెర్నాక్యులర్స్.
  • పి. టి. శ్రీనివాస అయ్యంగార్ (1912). భారతీయ ప్రజల చరిత్ర. మంత్రాల యుగంలో ప్రాచీన భారతదేశంలో జీవితం. శ్రీనివాస వడరాచారి & కో.
  • క్షేమరాజా (పి. టి. శ్రీనివాస అయ్యంగార్ అనువదించాడు) (1912). క్షేమరాజు యొక్క శివ-సూత్ర-విమర్సినా. ఎడిటర్స్, ఇండియన్ థాట్.
  • పి. టి. శ్రీనివాస అయ్యంగార్ (1912). గాయత్రి. హిగ్గిన్‌బోతం & కో.
  • పి. టి. శ్రీనివాస అయ్యంగార్. భారతదేశంలో రాతియుగం.
  • పి. టి. శ్రీనివాస అయ్యంగార్. పూర్వ ఆర్యన్ తమిళ సంస్కృతి.
  • డేనియల్, ఎస్. జి .; పి. టి. శ్రీనివాస అయ్యంగార్. తమిళంలో మొదటి దశలు.
  • పి. టి. శ్రీనివాస అయ్యంగార్ (1929). తొలి కాలం నుండి ప్రస్తుత రోజు వరకు తమిళుల చరిత్ర.
  • విల్లాట్, జాన్; పి. టి. శ్రీనివాస అయ్యంగార్ (1929). ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్.
  • పి. టి. శ్రీనివాస అయ్యంగార్ (1931). భోజా రాజా. మెథడిస్ట్ పబ్లిషింగ్ హౌస్.
  • పి. టి. శ్రీనివాస అయ్యంగార్ (1942). అడ్వాన్స్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా. హిందీ ప్రచార్ ప్రెస్.

మూలాలు

[మార్చు]
  1. Seshu Madhava Rao Adhuri. "Gurajada Venkata Appa Rao". Memorial University of Newfoundland. Archived from the original on 2008-12-06. Retrieved 2008-09-07.
  2. "Gidugu Venkata Ramamurti — Rekhachitram" (PDF). Archived from the original (PDF) on 2011-07-10. Retrieved 2008-09-07.
  3. "KANYASULKAM - PREFACE TO THE SECOND EDITION". 1909. Archived from the original on 2008-07-05. Retrieved 2008-09-07.
  4. "Classical or Modern - A Controversy of Styles in Education in Telugu". Retrieved 2008-09-07.
  5. "History". Department of History, University of Madras. Archived from the original on 2008-04-22. Retrieved 2008-09-07.