Jump to content

పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు

వికీపీడియా నుండి
పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు
జననంపిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు
1890
మరణం1962
ప్రసిద్ధికవి
మతంహిందూ
తండ్రిపెద్దనారాయణప్ప
తల్లినరసమ్మ

పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు (1890 - 1962) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి. సాహిత్యాభిమానిగా, సమాజ సేవకుడిగా గుర్తింపు పొందాడు.[1]

జననం, కుటుంబం

[మార్చు]

పిళ్లారిసెట్టి రంగబ్రహ్మారావు నాయుడు 1890లో జన్మించాడు. తండ్రి పిళ్లారిసెట్టి శ్రీకృష్ణులు నాయుడు. ఇతను హిందూ ఆదివెలమ కులానికి చెందినవాడు.[2]

ఉద్యోగం

[మార్చు]

రంగబ్రహ్మారావు నాయుడు బళ్ళారిలో తహసీలుదారుగా ఉద్యోగం చేశాడు. ఉద్యోగ రీత్యా బందరు నుండి బళ్ళారికి వచ్చాడు.[2]

సాహిత్యరంగం

[మార్చు]

1930లో రంగబ్రహ్మారావు నాయుడు సీస పద్యాలతో 'ఆదివెలమ శతకం' రచించాడు. ఈ శతకంలో, శ్రీ కృష్ణుడు బృందావనంలో జన్మించినట్లుగానే, ఆదివెలమ కులం జన్మస్థలం 'బందరు' అని సూచించాడు. ఈ శతకంలో 173 సీస పద్యాలు ఉన్నాయి.

1931లో బళ్ళారిలో శ్రీ కృష్ణ దేవరాయ గ్రంథమాల స్థాపించబడినప్పుడు, రంగబ్రహ్మారావు నాయుడు ఆ సంస్థ మేనేజింగ్ ఎడిటర్‌ను తన ఇంటికి పిలిపించుకొని, సంస్థ ప్రాముఖ్యతను వివరించారుడు. ఈ ఉద్యమం బళ్ళారి పట్టణానికి ఎంతగానో అవసరమని, పట్టుదలతో కృషి చేస్తే ధన సహాయం తప్పక లభిస్తుందని ప్రోత్సహించాడు. అంతేకాకుండా, స్వయంగా భూరి విరాళం ఇచ్చి గ్రంథమాలను ఆదుకున్నాడు.[2]

మరణం

[మార్చు]

రంగబ్రహ్మారావు నాయుడు 1962 ప్రాంతంలో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. 2.0 2.1 2.2 2.3 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).

ఇతర లింకులు

[మార్చు]