Jump to content

పిల్లిన్-బ్రోకా పట్టకం

వికీపీడియా నుండి

పిల్లిన్-బ్రొకా పట్టకం అనేది స్థిర విచలనం చెందే విక్షేపక పట్టకం. ఇది అబ్బె పట్టకంను పోలి ఉంటుంది. దీనిని ప్రెంచ్ వాయిద్యాల తయరీదారుడు పె.హెచ్.పెల్లిన్, ప్రొఫెసర్ అయిన ఆండ్రి బ్రోకాలు సంయుక్తంగా తయారు చేసినందున వారి పేరుపై ఈ పట్టకానికి "పెల్లిన్-బ్రోకా" పట్టకం అని పేరు వచ్చింది.[1]

ఈ పట్టకం నాలుగు భుజాలు కలిగి గాజుతో తయారుచేయబడిన లంబకోణ పట్టకం. దీనిలో నాల్గు కోణములు వరుసగా 90°, 75°, 135°, 60° ఉంటాయి. కాంతి AB తలం గుండా ప్రవేశించి, BC గుండా సంపూర్ణాంతర పరావర్తనం చెంది AD గుండా పోతుంది. కాంతి ఒక ప్రత్యేక తరంగదైర్ఘ్యంతో పట్టకంలోనికి పతనమైనపుడు కచ్చితంగా 90° విచలనం అయ్యే విధంగా వక్రీభవనం చెందుతుంది. ఆ పట్టకం తన అక్షం O గుండా భ్రమణం చెందినపుటు ∠BAD కోణం యొక్క సమద్విఖండన రేఖ, BC యొక్క పరావర్తన తలాల ఖండన రేఖ, 90 డిగ్రీలతో విచలనం చెందించే ఎంపిక చెయబడిన తరంగ దైర్ఘ్యం జ్యమితి పరంగా మారవు లేదా నివేశ, నిర్గమ కిరణాల సాపేక్ష స్థానాలు మారవు.[2]

మూలాలు

[మార్చు]
  1. Pellin, P; Broca, A (1899). "A Spectroscope of Fixed Deviation". Astrophysical Journal. 10: 337–342. Bibcode:1899ApJ....10..337P. doi:10.1086/140661.
  2. Forsythe, WE (1917). "The Rotation of Prisms of Constant Deviation". Astrophysical Journal. 45: 278–284. Bibcode:1917ApJ....45..278F. doi:10.1086/142328.

ఇతర లింకులు

[మార్చు]