Jump to content

పిన్నెల్లి లక్ష్మారెడ్డి

వికీపీడియా నుండి
పిన్నెల్లి లక్ష్మారెడ్డి
మాజీ ఎమ్మెల్యే
Assumed office
2004 - 2009
నియోజకవర్గం మాచెర్ల నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1945
మాచెర్ల గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామిఅన్నపూర్ణమ్మ,
సంతానంమధుసూదనరెడ్డి(కుమారుడు) , 1 కుమార్తె
తల్లిదండ్రులువీరా రెడ్డి
బంధువులుపిన్నెల్లి రామకృష్ణారెడ్డి (తమ్ముడి కుమారుడు)
నివాసంమాచెర్ల

పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాచెర్ల నియోజకవర్గం 2004 నుండి 2009 వరకు ఎమ్మెల్యేగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పిన్నెల్లి లక్ష్మారెడ్డి 1945 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మాచెర్ల లో జన్మించాడు. ఆయన వెల్దుర్తి లోని జిల్లా పరిషత్ పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1999లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. లక్ష్మారెడ్డి 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పై 30666 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

మరణం

[మార్చు]

పిన్నెల్లి లక్ష్మారెడ్డి అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించగా బ్లడ్‌క్యాన్సర్‌గా తేలింది, వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించిన కోలుకోలేకపోయాడు, దీనితో ఆయనను మాచర్ల లోని అతని స్వగృహానికి తీసుకొచ్చారు. ఆయన సెప్టెంబర్ 24, 2021న మరణించాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (22 March 2019). "పౌరుషాల గడ్డ ..మాచర్ల". Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.
  2. Sakshi (25 September 2021). "మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి మృతి". Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.
  3. Eenadu (25 September 2021). "పిన్నెల్లి లక్ష్మారెడ్డి మృతికి నాయకుల సంతాపం" (in ఇంగ్లీష్). Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.
  4. Andrajyothy (25 September 2021). "మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కన్నుమూత". Archived from the original on 28 సెప్టెంబరు 2021. Retrieved 28 September 2021.