పిన్నమనేని వెంకటేశ్వరరావు (వైద్యుడు)
పిన్నమనేని వెంకటేశ్వరరావు విజయవాడకు చెందిన వైద్యుడు. విద్యా దాత, సిద్ధార్థ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సమీపంలో గాల నెప్పల్లి గ్రామంలో డిసెంబరు 16 1910 న జన్మించాడు. వారిది విజయవాడలో పేరొందిన కుటుంబం. ఆయన సర్జరీలో పేరు పొందాడు. ఆయన సర్జరీలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. విశాఖపట్నం లోని ఆంధ్రా వైద్య కళాశాలలో కొంతకాలం పాటు బోధకునిగా ఉన్నాడు.
ప్రభుత్వ సేవలో పనిచేసిన తరువాత 1950 లో రాజీనామా చేసి విజయవాడలో ప్రైవేటు ప్రాక్టీసు ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే మంచి సర్జనుగా పేరొందారు. ఆయన సమర్థవంతమైన శస్త్రచికిత్స వైద్యుడు మాత్రమే కాదు, అధిక విలువలు, సమగ్రత, నిజాయితీ గల ఒక వైద్యుడు. ఆయన రోగులకు స్నేహితునిగా, తాత్వికునిగా వ్యవహరించేవాడు.
ఆయన యు.ఎస్.ఎ, యు.కె లలో 1970, 1977, 1981 లలో ప్రముఖ సర్జరీ క్లినిక్ లను సందర్శించాడు. వైద్య విధానంలో నూతన పోకడలు తెలుసుకున్నాడు. ఆయనకు క్రికెట్ అంటే ఎంతో యిష్టం.
ఆయన భార్య సీతాదేవి ఆయనకు వివిధ విషయాలలో సహకారం అందిస్తుండేది.[1]
సిద్ధార్థ అకాడమీ
[మార్చు]విజయవాడలో విద్యారంగం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది సిద్ధార్థ అకాడమీనే. 1975లో పెద్దలు డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఆడిటర్లు ముమ్మనేని సుబ్బారావు తదితర విద్యాభిమానులతో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పేరుతో సంస్థలను నెలకొల్పారు. విజయవాడలో స్కూల్ దగ్గర నుంచి పీజీ, ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ వరకు అన్ని కోర్సులతో దాదాపు 20 విద్యాసంస్థలను నెలకొల్పిన ఘనత దీనికి దక్కుతుంది.[2][3]
పిన్నమనేని పురస్కారాలు
[మార్చు]ఆయన సోదరుడు పిన్నమనేని నరసింహారావు ఇ.ఎన్.టి వైద్య పరిశోధకుడు.[4] ఆయన పేరుతో అంతర్జాతీయ మెడికల్ సైన్సెస్ అకాడమీ వారు అంతర్జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసారు. ఇది "డా.పిన్నమనేని నరసింహారావు అంతర్జాతీయ అవార్డు" పేరుతో అందజేయబడుతుంది.[5]
పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులు "డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్" 1989, డిసెంబరులో ఏర్పాటు చేసారు.[6] 1989 నుంచి దాదాపు ప్రతి ఏడాది దేశ ప్రముఖులకు పురస్కార ప్రదానం చేస్తున్నారు.
- 1989 - ప్రొ.వి.రామలింగస్వామి, శ్రీభాష్యం అప్పలాచార్యులు
- 1990 - డా. కరణ్ సింగ్, యాషో రాజ్యలక్ష్మి కరణ్‌సింగ్
- 1991 - వర్ఘీస్ కురియన్, ఎల్.వి.ప్రసాద్
- 1992 - ఎం.నరసింహం, బిందేశ్వర్ పాథక్
- 1993 - లతా మంగేష్కర్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- 1994 - వి.జి.వెర్గేసే
- 1995 - ఆర్.కె. లక్ష్మణ్, హెచ్ సుదర్శన్
- 1997 - పి.వేణుగోపాల్ [8]
- 1997 - రామానంద్ సాగర్
- 1998 - ఎ.పి.జె.అబ్దుల్ కలాం
- 1999 - ఎం.ఎస్.వాలియాథన్
- 2000 - కె.జె.యేసుదాసు
- 2001 - సేవా రూరల్
- 2002 - కిరణ్ బేడి
- 2003 - సుధామూర్తి
- 2004 - జయప్రకాష్ నారాయణ
- 2005 - సి.ఎన్.ఆర్ రావు
- 2007 - డా. ఇ.శ్రీథరన్
- 2009 - డా.ఎ.శ్రీనాథ్ రెడ్డి
- 2010 - ఉస్తాద్ జాకీర్ హుస్సేన్
- 2011 - ఎం.ఎస్.స్వామినాథన్
- 2012 - డా.వై.వి.రెడ్డి[9]
- 2013 - జస్టిస్ పి.చంద్రశేఖరరావు
- 2014 - అత్యుత సమంత [6]
- 2015 - హరిప్రసాద్ చౌరాసియా [10]
- 2016 - చాగంటి కోటేశ్వరరావు [11]
మూలాలు
[మార్చు]- ↑ "Introduction to the foundation". Archived from the original on 2017-10-06. Retrieved 2017-05-05.
- ↑ కృష్ణా - వికాస్ పీడియా
- ↑ "డా.పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రీసెర్చ్ ఫౌండేషన్". Archived from the original on 2017-05-08. Retrieved 2017-05-05.
- ↑ "12 Great Sons of Vijayawada". Archived from the original on 2017-09-10. Retrieved 2017-05-05.
- ↑ Dr. Pinnamaneni Narasimha Rao International Award[permanent dead link]
- ↑ 6.0 6.1 Pinnamaneni awards for Achyuta Samanta, RDT
- ↑ "PS Foundation". Archived from the original on 2017-10-05. Retrieved 2017-05-05.
- ↑ "Dr. Panangipalli Venugopal Citation". Archived from the original on 2016-03-04. Retrieved 2017-05-05.
- ↑ Pinnamaneni award for former RBI Governor
- ↑ Pinnamaneni foundation award for Hariprasad Chaurasia and Hindol
- ↑ "బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ఫొటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డిలకు డాక్టర్ పిన్నమనేని అండ్ సీతాదేవి ఫౌండేషన్ అవార్డు ప్రదానం". Archived from the original on 2018-03-17. Retrieved 2017-05-05.