Jump to content

పిట్ ఇండియా చట్టం

వికీపీడియా నుండి

పిట్ ఇండియా చట్టం(Pitt's India Act)గా ప్రాచుర్యంలో ఉన్న ఈస్టిండియా కంపెనీ చట్టం 17841773 నాటి నియంత్రణా చట్టంలోని లోపాలను సవరించి భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలనను బ్రిటీష్ ప్రభుత్వం నియంత్రణ కిందికి తీసుకువచ్చే గ్రేట్ బ్రిటన్ పార్లమెంటు(Parliament of Great Britain) చట్టం. ఆనాటి బ్రిటీష్ ప్రధాని విలియం పిట్ పేరిట దీన్ని పిట్ ఇండియా చట్టంగా పిలిచారు. దీని ప్రకారం బ్రిటీష్ ఇండియా పరిపాలన కంపెనీ, బ్రిటీష్ ప్రభుత్వం రెండూ సంయుక్తంగా నిర్వహిస్తాయి, అయితే అంతిమ అధికారం బ్రిటీష్ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. రాజకీయ వ్యవహారాలను చూసేందుకు ఆరుగురు సభ్యులతో బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ ని, ఆర్థిక వ్యవహారాలను చూసుకునేందుకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఏర్పరిచింది.

నేపథ్యం

[మార్చు]

1773లో ఈస్టిండియా కంపెనీ దారుణమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ బ్రిటీష్ ప్రభుత్వ సహకారాన్ని కోరింది. ఈ పరిస్థితి భారతదేశంలోని కంపెనీ అధికారుల అవినీతి, పక్షపాత ధోరణులతో వచ్చింది. దాంతో 1773లో బ్రిటీష్ ప్రభుత్వం కంపెనీ కార్యకలాపాలను నియంత్రించడం కోసం ఒక నియంత్రణ చట్టాన్ని చేసింది. చట్టం ఏర్పరిచిన పద్ధతి ప్రకారం అది కంపెనీ వ్యవహారాలను, పనులను పర్యవేక్షిస్తుంది, తప్ప దాని అధికారాన్ని తన చేతిలోకి తీసుకోదు. 1773 నియంత్రణ చట్టం భారతదేశంలో బ్రిటీష్ పాలనకు తొలిమెట్టు.

1784 చట్టంలోని అంశాలు

[మార్చు]

రాజ్య కార్యదర్శి సహా ఆరుగురు కన్నా తక్కువ సంఖ్యలో ప్రీవీ ఛాన్సలర్లు భారత వ్యవహారాల కమిషనర్ల నియామకానికి చట్టం వీలు ఇచ్చింది. వీరిలో ముగ్గురు కన్నా ఎక్కువమంది కలిసి పిట్స్ ఇండియా చట్టాన్ని అమలు చేసే అధికారంతో ఒక బోర్డుగా ఏర్పడతారు.

బోర్డుకు ప్రెసిడెంట్ అధ్యక్షత వహించేవాడు, తర్వాతి కొద్దికాలానికే ఈ పదవి ఈస్టిండియా కంపెనీ వ్యవహారాల మంత్రిగా మారింది. సెక్షన్ 3 ప్రకారం ప్రెసిడెంటుగా రాజ్య కార్యదర్శి ఉండాలి, కాని పక్షంలో ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్ ఉండాలి, అదీ కుదరిని పక్షంలో ఇతర కమీషనర్ల కన్నా సీనియర్ ఆ పదవి స్వీకరించవచ్చు.

చట్టం ప్రకారం, కంపెనీ చేతిలోని ప్రభుత్వాన్ని బోర్డు పర్యవేక్షించి, నిర్దేశించి, నియంత్రించాలి,[1] ఈ పర్యవేక్షణ, నియంత్రణ, నిర్దేశాల కిందనే కంపెనీ పౌర, సైనిక, రెవెన్యూ వ్యవహారాలు నిర్వహణ, చట్టాల రూపకల్పన జరుగుతుంది.

బోర్డుకు ఛీఫ్ సెక్రటరీ సహకారం అందిస్తాడు.

చట్టం కంపెనీ కార్యనిర్వాహక మండలి సభ్యులను మూడుకు తగ్గించింది. బొంబాయి, మద్రాసు గవర్నర్ల స్వయం నిర్ణయాధికారాన్ని తొలగించింది. యుద్ధం, రెవెన్యూ, దౌత్య వ్యవహారాల్లో ఉన్నతాధికారాలను గవర్నర్ జనరల్ కు ఇచ్చింది.

1785లో శాసనమైన అనుబంధ చట్టం ద్వారా బెంగాల్ రెండవ గవర్నర్ జనరల్ గా లార్డ్ కారన్ వాలీసు నియమితుడయ్యాడు. తద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల అధికారం కింద బ్రిటీష్ ఇండియా పరిపాలకుడు అయ్యాడు. పిట్ ఇండియా చట్టం కింద ఏర్పడిన రాజ్యవ్యవస్థలో 1858లో భారతదేశంలో కంపెనీ పరిపాలన ముగిసేవరకూ ఏ ప్రధాన మార్పులూ లేకుండా కొనసాగింది.

మూలాలు

[మార్చు]
  1. John Keay, The Honourable Company.
  • Nilakanta Sastri, K.A.; Srinivasachari (2000). Advanced History of India. New Delhi: Allied Publishers Ltd.
  • "The Pitt's Act". Archived from the original on 2006-05-14. Retrieved 2006-06-26.

మరింత చదవండి

[మార్చు]
  • Furber, Holden. "The East India Directors in 1784," Journal of Modern History (Dec., 1933) 5#4, pp. 479–495 in JSTOR, reprints primary sources
  • Philips, C. H. "The East India Company 'Interest' and the English Government, 1783-4." Transactions of the Royal Historical Society (Fourth Series) 20 (1937) pp: 83-101.