Jump to content

పిండం (2023 సినిమా)

వికీపీడియా నుండి
పిండం
దర్శకత్వంసాయికిరణ్ దైదా
స్క్రీన్ ప్లేసాయికిరణ్ దైదా
కథసాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ & టోబి ఒస్బోర్న్
నిర్మాత
  • యశ్వంత్‌ దగ్గుమాటి
తారాగణం
ఛాయాగ్రహణంసతీష్ మనోహరన్
కూర్పుశిరీష్ ప్రసాద్
సంగీతంకృష్ణ సౌరభ్ సూరంపల్లి
నిర్మాణ
సంస్థ
కళాహి మీడియా
విడుదల తేదీs
26 డిసెంబరు 2023 (2023-12-26)(థియేటర్)
2 ఫిబ్రవరి 2024 (2024-02-02)( ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

పిండం 2023లో విడుదలైన తెలుగు సినిమా. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్‌ దగ్గుమాటి హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్‌, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 30న  టీజర్‌ను విడుదల చేసి[1], సినిమా డిసెంబర్ 15న  విడుదలై[2], 2024 ఫిబ్రవరి 2న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

ఆంథోని(శ్రీరామ్‌) రైస్‌ మిల్లులో అకౌంటెంట్‌ గా పని చేస్తూ భార్య మేరి (ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు (సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలో ఓ పురాతమైన ఇల్లు కొనుకొని ఉంటాడు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురైతాయి. ఆంథోని చిన్న కూతురిలోకి ఓ ఆత్మ ఆవహిస్తుంది. కడుపుతో ఉన్న అతని భార్య హాస్పటల్‌లో చేరుతుంది. వారికి సాయం చేయడానికి అన్నమ్మ (ఈశ్వరీరావు) వస్తుంది. అయితే ఆ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయని తెలుసుకుంటారు. అసలు ఆత్మలు అక్కడ ఎందుకు ఉన్నాయి వారంతా ఎలా చనిపోయారు ? ఆంథోనీ ఫ్యామిలీని అన్న‌మ్మ (ఈశ్వ‌రీరావ్‌) కాపాడిందా ? ఆ ఆత్మ‌లు ఆంథోనీ ఫ్యామిలీని ఎందుకు ఆవ‌హించాయి? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్:కళాహి మీడియా
  • నిర్మాత: యశ్వంత్‌ దగ్గుమాటి
  • కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ & టోబి ఒస్బోర్న్
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయికిరణ్ దైదా
  • సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
  • సినిమాటోగ్రఫీ: సతీష్ మనోహరన్
  • ఎడిటర్: శిరీష్ ప్రసాద్
  • ఫైట్స్: జాషువా
  • సహ నిర్మాత: ప్రభు రాజా

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes Telugu (30 October 2023). "భయపెడుతున్న పిండం టీజర్.. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని విధంగా." Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
  2. "'పిండం' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?". 18 November 2023. Archived from the original on 18 November 2023. Retrieved 18 November 2023.
  3. Eenadu (26 January 2024). "ఓటీటీలో 'పిండం'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  4. A. B. P. Desam (16 December 2023). "'పిండం' రివ్యూ: శ్రీరామ్ & టీమ్ మరీ అంత భయపెట్టారా? సినిమా ఎలా ఉంది?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  5. Andhrajyothy (14 December 2023). "ఐకాన్ స్టార్, న్యాచురల్ స్టార్ అంటే ఇష్టం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  6. Andhrajyothy (14 December 2023). "కొంచెం భయపెడితే... చూస్తారు". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.