పాలీశాకరైడ్

పాలీశాకరైడ్ లేదా పాలీకార్బోహైడ్రేట్ అంటే ఆహారంలో విరివిగా లభించే కార్బోహైడ్రేట్లు. ఇవి దీర్ఘశ్రేణి కార్బోహైడ్రేట్ అణుపుంజాలు. ఇవి గ్లైకోసిడిక్ బంధంతో అనుసంధానించబడిన మోనోశాకరైడ్లను కలిగి ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లు హైడ్రాలిసిస్ ప్రక్రియ ద్వారా అమిలేస్ ఎంజైం ఉత్ప్రేరకంగా నీటితో చర్యనొంది మోనోశాకరైడ్లు, ఒలిగోశాకరైడ్ల లాంటి చక్కెరలను ఉత్పత్తి చేస్తాయి. వీటి నిర్మాణాలు ఒకే గొలుసు కట్టు నుంచి శాఖోపశాఖలుగా ఉంటాయి. స్టార్చ్, గ్లైకోజెన్, గలాక్టోజెన్ లాంటి స్టోరేజి పాలీశాకరైడ్లు, సెల్యులోజ్, చిటిన్ లాంటి స్ట్రక్చరల్ పాలీశాకరైడ్లు వీటికి ఉదాహరణలు.
పాలిశాకరైడ్లు చాలా భిన్నమైనవి. పునరావృతమయ్యే యూనిట్ స్వల్ప మార్పులను కలిగి ఉంటాయి. నిర్మాణంపై ఆధారపడి, ఈ స్థూల అణువులు వాటి మోనోశాకరైడ్ బిల్డింగ్ బ్లాక్‌ల నుండి విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి. అవి నిర్దిష్టమైన ఆకారం లేనివి, నీటిలో కరగనివై ఉండవచ్చు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Varki A, Cummings R, Esko J, Freeze H, Stanley P, Bertozzi C, Hart G, Etzler M (1999). Essentials of Glycobiology. Cold Spring Harbor Laboratory Press. ISBN 978-0-87969-560-6.
{{cite book}}
:|work=
ignored (help)