Jump to content

పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (పుస్తకం)

వికీపీడియా నుండి

పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర ఆచార్య ఎస్వీ రామారావు రచించిన పుస్తకం. దీన్ని 2012 సెప్టెంబరులో ముద్రించగా 2012 డిసెంబరులో జరిగిన ప్రపంచతెలుగు మహాసభలలో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన జిల్లాస్థాయి తెలుగు మహాసభలలోఆవిష్కరించబడింది. 186 పేజీలు కల ఈ పుస్తకాన్ని పసిడి ప్రచురణలు ప్రచురించింది. ఇందులో రచయిత పాలమూరు జిల్లాకు చెందిన 37 ఆధునిక కవుల జీవితచరిత్రలు వివరించడమే కాకుండా పుస్తకం చివరలో మరెందరో కవుల గురించి సంక్షిప్తంగా తెలియజేశారు.

పుస్తకంలో ముందుగా జిల్లాకు చెందిన వైతాళికుల గురించి ఆ తర్వాత 35 కవుల గురించి వివరించబడింది. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వైతాళికులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత కవుల జన్మ సంవత్సరం ఆధారంగా ఒక్కొక్కరి విశేషాలను పుస్తకంలో పొందుపర్చారు. ప్రతి వ్యాసం ప్రారంభంలో కవి జనన, మరణ వివరాలు, వారి స్వస్థలం, రచనలు, కవి ఛాయాచిత్రాలు ఇవ్వడం జరిగింది.