పార్టికల్ థెరపీ
Jump to navigation
Jump to search
పార్టికల్ థెరపీ (కణ చికిత్స) అనేది ఒక రకమైన రేడియో చికిత్స. ఇందులో శక్తివంతమైన ప్రోటాన్లు, న్యూట్రాన్ల లేదా ఇతర ధనాత్మక అయాన్ల పుంజాలను క్యాన్సర్ ను నయం చేయడానికి వాడతారు. ఆగస్టు 2021 నాటికి అత్యంత ప్రాచుర్యమైన కణ చికిత్స ప్రోటాన్ చికిత్స.[1]
విధానం
[మార్చు]ఈ చికిత్సలో గుర్తించిన కణితిపైకి శక్తివంతమైన అయోనైజింగ్ కణాలను ప్రయోగిస్తారు.[2][3] ఈ అయొనైజింగ్ కణాలు, క్యాన్సర్ కణాల డిఎన్‌ఏని దెబ్బతీస్తాయి, చివరికి వాటి నాశనానికి కారణమవుతాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాలకు డిఎన్‌ఏ మరమ్మత్తు సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల అవి బాగా నష్టపోతాయి.
ఎలక్ట్రాన్ థెరపీలో భాగంగా ఎలక్ట్రాన్లను ప్రయోగిస్తారు. వాటికి తక్కువ వ్యాప్తి ఉండటం వల్ల చర్మానికి దగ్గరగా ఉండే కణజాలానికి మాత్రమే ఈ చికిత్స పనిచేస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ Matsumoto, Y.; Fukumitsu, N.; Ishikawa, H.; Nakai, K.; Sakurai, H. (2021). "A Critical Review of Radiation Therapy: From Particle Beam Therapy (Proton, Carbon, and BNCT) to Beyond". Journal of Personalized Medicine. 11 (8): 825. doi:10.3390/jpm11080825. PMC 8399040. PMID 34442469.
- ↑ Amaldi U, Kraft G (2005). "Radiotherapy with beams of carbon ions". Reports on Progress in Physics. 68 (8): 1861–1882. Bibcode:2005RPPh...68.1861A. doi:10.1088/0034-4885/68/8/R04.
- ↑ Jäkel O (2007). "State of the art in hadron therapy". AIP Conference Proceedings. 958 (1): 70–77. Bibcode:2007AIPC..958...70J. doi:10.1063/1.2825836.