పామర్ అండ్ కంపెనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పామర్ అండ్ కంపెనీ
రకంఏజెన్సీ హౌస్
స్థాపన18వ శతాబ్దపు బ్రిటీషు ఇండియా
స్థాపకుడుజాన్ పామర్ (1767 - 1836)
ప్రధాన కార్యాలయంహైదరాబాదు, ,
సేవ చేసే ప్రాంతము
బ్రిటీషు ఇండియా
సేవలువ్యాపారం, బ్యాంకింగ్

పామర్ అండ్ కో అని తరచుగా పిలువబడే ది పామర్ అండ్ కంపెనీ లిమిటెడ్, జనరల్ విలియం పామర్, ఆయన మొదటి భార్య సారా హాజెల్ కుమారుడైన జాన్ పామర్ (1767-1836) బ్రిటిష్ ఇండియాలో స్థాపించిన ఒక ఏజెన్సీ హౌస్. పామర్ అండ్ కో. బ్రిటిష్ ఇండియాలోనే అతిపెద్ద ఏజెన్సీ హౌస్.[1][2]

విలియం పామర్ అండ్ కంపెనీ అనే మరో బ్యాంకింగ్ సంస్థని 1810లో జనరల్ విలియం పామర్, ఆయన రెండవ భార్య, బీబీ ఫైజ్ బక్ష్ ఫైజున్నీసా బేగం (1828లో మరణించారు) కుమారుడైన విలియం పామర్ (1740-1816), గుజరాత్ కు చెందిన వడ్డీ వ్యాపారి, బెంకటి దాస్‌తో కలిసి ప్రారంభించాడు. ఫైజున్నీసా బేగం అవధ్ పాలక కుటుంబం నుండి వచ్చింది. ఈ సంస్థలో తరువాత సర్ విలియం రంబోల్డ్, 3వ బారోనెట్ (1787-1833) భాగస్వామి అయ్యాడు.[3]

చరిత్ర

[మార్చు]

నేపథ్యం

[మార్చు]

భారతదేశంలో జాయింట్-స్టాక్ బ్యాంకింగ్ కంపెనీలు రాకముందు, బ్యాంకుల పాత్రను ఏజెన్సీ సంస్థలు పోషించాయి. ఏజెన్సీ గృహాలు వివిధ పాక్షిక-బ్యాంకింగ్ విధులను నిర్వహించాయి. ఇవి నిర్వర్తించిన పనుల్లో దిగువన కొన్ని. అయుతే, ఏజెన్సీ గృహాలు వీటికి మాత్రమే పరిమితం కాలేదు. [4]

  • డిపాజిట్లను అంగీకరించడం (ఏజెన్సీ హౌస్లు బ్రిటిష్ జాతీయులు, ఇతర యూరోపియన్ల నుండి మాత్రమే డిపాజిట్లు అంగీకరించాయి)
  • ఫైనాన్సింగ్ వ్యాపారం
  • రుణాలు ఇవ్వడం (ప్రధానంగా ప్రభుత్వానికి)

వ్యాపారం

[మార్చు]

పామర్ అండ్ కో తొలుత, పాక్స్టన్, కాకరెల్ అండ్ ట్రైల్ అనే పేరుతో స్థాపించబడింది. ఆ తరువాత సంస్థ పేరు పామర్ అండ్ కో గా మార్చబడింది.[5]

1829లో పామర్ అండ్ కంపెనీ, బ్రిటిష్ ఇండియాలో ఉత్పత్తి అయ్యే మొత్తం నీలం (ఇండిగో)లో 16% కంటే ఎక్కువ ఎగుమతి చేసింది.[6] ఫలితంగా, పామర్ అండ్ కంపెనీ, బెంగాల్ ఇండిగో కింగ్ గా ప్రసిద్ధి చెందింది.[7]

వైఫల్యం

[మార్చు]

బ్రిటిష్ ఇండియాను ప్రభావితం చేసిన ప్రధాన ఆర్థిక మాంద్యం కారణంగా 1830లో పామర్ అండ్ కో ఏజెన్సీ హౌస్ విఫలమైంది. ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఇండిగో వంటి వస్తువుల ధరల్లో ఊహించని పతనం.[8]

వివాదాలు

[మార్చు]

హైదరాబాద్ బ్యాంకింగ్ సంస్థ అయిన పామర్ అండ్ కంపెనీ తరపున భారత గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ పాక్షికంగా వ్యవహరించారని ఆరోపించిన అవినీతి కుంభకోణంలో చార్లెస్ రస్సెల్ (1786-1856) చిక్కుకున్నాడు. స్థానిక యువరాజులకు రుణాలు ఇవ్వడంపై నిషేధం నుండి ఈ సంస్థను మినహాయించాలని 1816లో హేస్టింగ్స్ తీసుకున్న నిర్ణయం ద్వారా, ఈ సంస్థ నేరుగా హైదరాబాద్ నిజాం మీర్ అక్బరు అలీ ఖాన్ తో జరిపిన లావాదేవీలలో రస్సెల్స్ ప్రమేయం ఉండి, లాభం పొందారని కనుగొనబడింది. హెన్రీ రస్సెల్‌ తర్వాత ఆయన పదవిని చేపట్టిన సర్ చార్లెస్ మెట్‌కాఫ్ 1820లో మోసపూరితంగా కల్పించిన రుణాన్ని కనుగొన్నాడు.[9][10][1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "The Nizam, his history and relations with the British government" (PDF) – via rarebooksocietyofindia.org.
  2. Ghosh, Swagata (15 August 2016). "The returning Nabobs and a slice of India". The Asian Age.
  3. Leonard, Karen (2013). "Palmer and Company: an Indian Banking Firm in Hyderabad State".
  4. "History of Banking" (PDF). Ikouniv.ac.in. Retrieved 27 May 2021.
  5. Roy, Tirthankar. "Trading Firms in Colonial India" (PDF).
  6. "India's Indigo Crash". 29 June 2020.
  7. "Agency House Crises in India: What Role Did Indigo Play?". 14 March 2017. Archived from the original on 20 జనవరి 2022. Retrieved 17 సెప్టెంబరు 2024.
  8. Bhan, Aditya. "Indian banking's chequered history - Gateway House". Gatewayhouse.in. Retrieved 2022-05-14.
  9. "The Nizam-era banking scandal which shocked Hyderabad - Suno India". 15 February 2020.[permanent dead link]
  10. "The Gazetteers Department - Wardha". Cultural.maharashtra.gov.in. Retrieved 2022-05-14.

బయటి లింకులు

[మార్చు]