పాతాళకోట ఎక్స్‌ప్రెస్
'చింద్వారా - ఢిల్లీ సారాయ్ రోహిల్లా పాతాళ్‌కోట్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్' ప్రతిరోజు నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది గ్వాలియార్ లోని గ్వాలియార్ రైల్వే జంక్షన్ స్టేషను, చింద్వారా యొక్క చింద్వారా రైల్వే జంక్షన్ స్టేషను మధ్య నడుస్తుంది. రెండు నగరాలు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఇటీవల భారతీయ రైల్వేలు ఈ రైలును ఢిల్లీ సారాయ్ రోహిల్లా వరకు విస్తరించారు.
సేవ (సర్వీస్)
[మార్చు]ఈ రైలు నంబరు 14009⇒14623 పాతాళకోట్ ఎక్స్‌ప్రెస్ అనే పేరుతో పిలవబడుతుంది. గ్వాలియార్ - చింద్వారా ఎక్స్‌ప్రెస్, గ్వాలియార్ జంక్షన్ నుండి చింద్వారా జంక్షన్ వరకు మధ్యలో మొత్తం 16 విరామములతో చేరుకుంటుంది. ఇది సరాసరి 45 కిలోమీటర్ల వేగంతో 15 గంటల 57 నిమిషాల్లో 726 కి.మీ. ప్రయాణించి తన గమ్యాన్ని పూర్తిచేస్తుంది.[1]
జోను, డివిజను
[మార్చు]ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని ఉత్తర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ప్రతిరోజు ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు గంటకు 45 కి.మీ. సరాసరి వేగంతో నడుస్తుంది.
రైలు మార్గము
[మార్చు]గౌలియార్ జంక్షన్, చింద్వారా జంక్షన్ మధ్య 99 మధ్యంతర (ఇంటర్మీడియట్ స్టేషన్స్) స్టేషనులు లోని 16 విరామములతో చేరుతుంది. గ్వాలియార్ - చింద్వారా ఎక్స్‌ప్రెస్, గౌలియార్ జంక్షన్ రైల్వే స్టేషను నుంచి బయలుదేరి ఝాన్సీ, బినా, భోపాల్, ఇటార్సీ, ఆమ్లా, పరాసియా రైల్వే స్టేషన్లు మీదుగా చింద్వారా జంక్షన్ రైల్వే స్టేషనుకు చేరుకుంటుంది.
రేక్ షేరింగ్
[మార్చు]గ్వాలియార్ - చింద్వారా ఎక్స్‌ప్రెస్ నకు నంబరు 14625 / 14626 ఫిరోజ్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ తోటి ఆర్‌ఎస్‌ఎ - రేక్ షేరింగ్ ఏర్పాటు ఉంది.