పాడు
స్వరూపం
పాడు అనే తెలుగు పదానికి వివిధ అర్ధాలు ఉన్నాయి.
క్రియాపదంగా వాడినప్పుడు పాటపాడు (Sing) అనే అర్ధాన్నిస్తుంది.
విశేష్యంగా వాడినప్పుడు పాడుపడిన నేల మొదలైన అర్ధాలను తెలియజేస్తుంది. (పాడుబావి) (పాడుపడిన ఇల్లు) (పాడు = ఉపయోగములో లేని.... )
- చెడు అనే అర్థంలో కూడా ఈ పదాన్ని వాడుతుంటారు
- ఉదా: పాడు పిల్ల వాడు. [ఒక పాతలో పద ప్రయోగము: చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన పడతనంటడు....... (చీ...... పాడు)
గ్రామనామాలలో ఇది ఎక్కువగా ఉత్తరపదముగా వాడినప్పుడు దానికి గ్రామం అనే అర్ధం వస్తుంది.