Jump to content

పాఠశాల (మాసపత్రిక)

వికీపీడియా నుండి

ఈ మాసపత్రిక 1977లో ప్రారంభించబడింది. పదవ తరగతి విద్యార్థుల కొరకు ఈ ప్రత్యేక విద్యాసంబంధమైన పత్రిక వెలువడుతున్నది. విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలు, వాటికి సంబంధించిన విషయాలు ఈ పత్రికలోని ప్రధానాంశాలు. ఈ తరహా మాసపత్రిక తెలుగులో ఇదే మొదటిది. ఈ పత్రిక చిత్తూరు జిల్లా, చౌడేపల్లె నుండి వెలువడుతున్నది. విజయవాణి పబ్లిషర్స్ తరఫున ఈ పత్రికను నాయుని కృష్ణమూర్తి నడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ పత్రికకు గుమ్మనూరు రమేష్ బాబు ప్రధాన సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు.