పశ్య రామిరెడ్డి
పశ్య రామిరెడ్డి | |
---|---|
జననం | 1925 హుజూర్‌నగర్, నల్లగొండ జిల్లా |
మరణం | మే 17, 2019 హైదరాబాదు, తెలంగాణ |
ఇతర పేర్లు | పశ్య రామిరెడ్డి |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారులు |
పశ్య రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.[1]
జననం
[మార్చు]రామిరెడ్డి 1925లో నల్లగొండ జిల్లా, హుజూర్‌నగర్ పట్టణంలో జన్మించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]రామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. ఆయన కుమార్తె పశ్య పద్మ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలిగా, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది.
ఉద్యమ ప్రస్థానం
[మార్చు]చిన్నతనం నుంచే వామపక్ష భావజాలానికి ఆకర్షితులైన రామిరెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రధాన పాత్ర పోషించడమేకాకుండా రైతాంగ పోరాట దళాలకు కొరియర్‌గా పనిచేశాడు. 60 ఏళ్ళుగా కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన రామిరెడ్డి, గత 30 ఏళ్లుగా హుజూర్‌నగర్ పట్టణ సీపీఐ పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు.
మరణం
[మార్చు]ఇతడు 2019, మే 17న కోదాడకు వెళ్లి వస్తూ గుండెపోటుతో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (18 May 2019). "తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పశ్య రామిరెడ్డి కన్నుమూత". Archived from the original on 18 May 2019. Retrieved 18 May 2019.