Jump to content

వెస్ట్ సియాంగ్ జిల్లా

వికీపీడియా నుండి
(పశ్చిమ సియాంగ్ జిల్లా నుండి దారిమార్పు చెందింది)
వెస్ట్ సియాంగ్ జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ పటంలో వెస్ట్ సియాంగ్ జిల్లా స్థానం
అరుణాచల్ ప్రదేశ్ పటంలో వెస్ట్ సియాంగ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఅరుణాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంఆలో
విస్తీర్ణం
 • మొత్తం8,325 కి.మీ2 (3,214 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం1,12,272[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత67.6%[1]
 • లింగ నిష్పత్తి916[1]
Websiteఅధికారిక జాలస్థలి
ఆలో సమీపంలోని సియోమ్ నది

వెస్ట్ సియాంగ్ జిల్లా, భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[2] జిల్లా ముఖ్యపట్టణం ఆలో.

చరిత్ర

[మార్చు]

1989 ఈ ప్రాంతం తూర్పు సియాంగ్ జిల్లాలో ఉండేది.[3] 1999 నుండి ఈ ప్రాంతం ఎగువ సియాంగ్ జిల్లాలో భాగం అయింది.[3]

భౌగోళికం

[మార్చు]

పశ్చిమ సియాంగ్ జిల్లా కేంద్రం ఆలో పట్టణంలో ఉంది. జిల్లా వైశాల్యం 8325.[4] జిల్లా వైశాల్యపరంగా క్రెట్ దేశంతో సమానం.[5]

శాసన వ్యవస్థ

[మార్చు]

ఈ జిల్లాలో ఏడు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి: లిరోమోబా, లికబాలి, బాసర్, వెస్ట్, వెంట తూర్పు, రమ్‌గాంగ్, మెచుకా. మొదటి ఆరు అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉండగా, మెచుకా అరుణాచల్ తూర్పు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.[6]

జనాభా గణాంకాలు (2011)

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్ జిల్లాలో మొత్తం జనాభా 112,274. వీరిలో 58,168 మంది పురుషులు కాగా, 54,106 మంది స్త్రీలు ఉన్నారు.[7] జిల్లాలో మొత్తం 21,231 కుటుంబాలు ఉన్నాయి.జిల్లా సగటు లింగ నిష్పత్తి 930.

జిల్లా లోని మొత్తం జనాభాలో 22.2% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 77.8% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 85.4% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 60.9% ఉంది. అలాగే పశ్చిమ సియాంగ్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 852 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 954గా ఉంది.

జిల్లాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 14855, ఇది మొత్తం జనాభాలో 13%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 7655 మంది మగ పిల్లలు ఉండగా, 7200 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా పిల్లల లింగ నిష్పత్తి 941గా ఉంది, ఇది పశ్చిమ సియాంగ్ జిల్లాలోని సగటు లింగ నిష్పత్తి (930) కంటే ఎక్కువ.

పశ్చిమ సియాంగ్ జిల్లా మొత్తం అక్షరాస్యత రేటు 66.46%. పశ్చిమ సియాంగ్ జిల్లాలో పురుషుల అక్షరాస్యత రేటు 63.23% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 51.69%గా ఉంది.

మతాలు

[మార్చు]

పశ్చిమ సియాంగ్ జిల్లాలో ఆది, మెంబా, ఖంబ గిరిజనజాతులు నివసిస్తున్నాయి. ఆది సాధారణంగా డోన్యి-పొలో మతాన్ని, మరికొందరు సమీప కాలంగా బాప్టిస్ట్ క్రైస్తవమతం అనుసరిస్తున్నారు. మెంబా, ఖంబా ప్రజలు టిబెటన్ బుద్ధిజం అనుసరిస్తున్నారు. జిల్లాలో ప్రబలమైన మెచుకా గొంపా అనే టిబెటన్ ఆలయం ఉంది. ఇది మెంబా మాట్లాడే ప్రజలు నివసిస్తున్న మెచుయా ప్రాంతంలో ఉంది.

భాషలు

[మార్చు]

పశ్చిమ సియాంగ్ జిల్లాలో ఆది భాషను సుమారుగా 1,40,000 మంది మట్లాడుతుంటారు. దీనిని టిబెటన్, లాటిన్ లిపిలో వ్రాస్తుంటారు.[8] అలాగే గాలో (అంతరించి పోతున్న భాష) భాషను దాదాపు 30,000 మంది మాట్లాడుతుంటారు. ఇది కూడా సినీ-టిబెటన్ కుటుంబానికి చెందింది. [9]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

పశ్చిమ సియాంగ్ వనజీవితం సుసంపన్నమైనది. జిల్లాలోని అరణ్యాలలో జ్మిస్మి తకిన్, మంచుచిరుత, ఎర్రని పాండా, మస్క్ డీర్ వంటి అరుదైన క్షీరదాలు ఉన్నాయి. అలాగే అరుదైన బ్లిత్ ట్రాగోపాన్ కూడా ఉంది.[10] సైన్సు ప్రపంచంలో సరికొత్తగా కవిపెట్టబడిన ఎగిరే ఉడుత కూడా ఈ అరణ్యాలలో ఉంది. .[11] 1991లో పశ్చిమ సియాంగ్ జిల్లాలో 55 కి.మీ " కానే అభయారణ్యం " ఏర్పాటు చేయబడింది.[12]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in.
  2. "Arunachal Pradesh Population Census 2011, Arunachal Pradesh Religion, Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  3. 3.0 3.1 Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1113. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
  5. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11. Crete 8,350km2
  6. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 ఆగస్టు 2011. Retrieved 21 March 2011.
  7. "West Siang District Population Religion - Arunachal Pradesh, West Siang Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  8. M. Paul Lewis, ed. (2009). "Adi: A language of India". Ethnologue: Languages of the World (16 ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  9. M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16 ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  10. Choudhury, Anwaruddin (2008) Survey of mammals and birds in Dihang-Dibang biosphere reserve, Arunachal Pradesh. Final report to Ministry of Environment & Forests, Government of India. The Rhino Foundation for nature in NE India, Guwahati, India. 70pp.
  11. Choudhury,Anwaruddin (2007).A new flying squirrel of the genus Petaurista Link from Arunachal Pradesh in north-east India. The Newsletter and Journal of the RhinoFoundation for nat. in NE India 7: 26–34, plates.
  12. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 25 September 2011.

భౌగోళిక స్థితి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]