పవిత్ర గౌడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పవిత్ర గౌడ
జాతీయతబారతీయురాలు
వృత్తిసినిమా నటి,
ఫ్యాషన్ డిజైనర్

పవిత్ర గౌడ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి, ఫ్యాషన్ డిజైనర్. 2016లో 54321 అనే చిత్రంలో నటించడం ద్వారా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత చత్రిగాలు సార్ చత్రిగాలు, ఆగమ్య, సాగువ దారియాలి అనే చిత్రాల్లో నటించింది.

కెరీర్

[మార్చు]

ఖుషీ టీవీ షోతో ఆమె కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత, దక్షిణాది సినిమా పరిశ్రమలో నటిగా బిజీగా ఉంటూనే పవిత్ర గౌడ ఫ్యాషన్ డిజైనర్‌గా కూడా రాణిస్తోంది. బెంగళూరులో రెడ్ కార్పెట్ స్టూడియో 777 అనే ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తోంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సంజయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి పవిత్ర గౌడ పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు ఖుషీ ఉంది. అయితే, భర్తతో విభేదాలతో ఒంటరిగా ఉంటున్న తనకు కన్నడ హీరో దర్శన్ తూగుదీపకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.[1]

వివాదం

[మార్చు]

పవిత్ర గౌడ, దర్శన్ సంబంధాలపై చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామి అనే అభిమాని అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం వివాదంగా మారింది. ఆ యువకుడి హత్య సంఘటనలో పవిత్ర, దర్శన్ లపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వీరిపై బెంగళూరులోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్ 2024లో కేసు నమోదైంది. వీరిని జూన్ 2024లో అదుపులో తీపుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "కన్నడనాట సంచలనం రేపిన హీరో దర్శన్ అరెస్ట్.. ఎవరీ పవిత్రా గౌడ? | Who is pavithra gowda arrested in murder case with kannada star darshan-10TV Telugu". web.archive.org. 2024-06-14. Archived from the original on 2024-06-14. Retrieved 2024-06-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Pavithra Gowda: ఆమె కోసం హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్‌.. ఎవరీ పవిత్ర గౌడ..? | who-is-pavithra-gowda-in-renuka-swamys-murder-case". web.archive.org. 2024-06-14. Archived from the original on 2024-06-14. Retrieved 2024-06-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)