పల్పు పుష్పంగదన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పల్పు పుష్పంగదన్ (జననం: 1944 జనవరి 23) కేరళ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టి.బి.జి.ఆర్.ఐ) మాజీ డైరెక్టర్. అతను నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్.బి.ఆర్.ఐ) లక్నో, రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, తిరువనంతపురం మాజీ డైరెక్టర్ కూడా. అతను 2010లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.[1]

అతను కేరళలోని కొల్లం జిల్లా ప్రక్కుళం లో 1944 జనవరి 23న జన్మించాడు. పుష్పంగదన్ వృక్ష శాస్త్రానికి చేసిన కృషికి గుర్తింపు పొందాడు. అతను సైటోజెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్, బయోప్రాస్పెక్టింగ్, బయోటెక్నాలజీ, కన్జర్వేషన్ బయాలజీ, ఎథ్నోబయాలజీ, ఎత్నోఫార్మకాలజీ, ఫార్మాకోగ్నోసీలలో బహుళ విభాగ శిక్షణ పొందాడు.

అతను వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో సుమారు 317 పరిశోధనా పత్రాలు/కథనాలను ప్రచురించాడు. అతను 15 పుస్తకాలను రచించాడు/సవరించాడు. వర్గీకరణ, మొక్కల పెంపకం, పరిరక్షణ జీవశాస్త్రం, బయోటెక్నాలజీ, ఎథ్నోబయాలజీ, ఎథోఫార్మకాలజీ, ఐపిఆర్ మొదలైన పుస్తకాలలో 41 అధ్యాయాలను అందించాడు. అతను పేటెంట్ పొందిన 15 ఉత్పత్తులు ఇప్పటికే వాణిజ్యీకరించబడ్డాయి.

మూలాలు

[మార్చు]
  1. "Padma Shri Awardees". Government of India. Retrieved 5 March 2010.

బాహ్య లంకెలు

[మార్చు]