పర్వతేశ ప్రభు శతకము
స్వరూపం
పర్వతేశ ప్రభు శతకము | |
---|---|
కవి పేరు | కోట సుందరరామశర్మ |
మొదటి ప్రచురణ తేదీ | 1990 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మకుటం | పర్వతేశ ప్రభూ |
విషయము(లు) | భక్తి, నీతి |
పద్యం/గద్యం | పద్యం |
ఛందస్సు | శార్దూల విక్రీడితము |
ప్రచురణ కర్త | త్రిపురసుందరీ ప్రతిష్టానము, చింతగుంట పాలెము, మచిలీపట్నం |
ప్రచురణ తేదీ | 1990 |
మొత్తం పద్యముల సంఖ్య | 108 |
మొత్తం పుటలు | 48 |
పర్వతేశ ప్రభు శతకమును కోట సుందరరామశర్మ వ్రాశాడు. పూనా నగరంలో వెలసిన శంకరుని గురించి ఈ శతకంలో 108 పద్యాలలో వర్ణించాడు. ఈ శతకాన్ని 1990లో మచిలీపట్నం సమీపంలోని చింతగుంటపాలెం త్రిపురసుందరీ ప్రతిష్టానము వారు ప్రచురించారు. ఈ పుస్తకంలో ఎడమవైపు తెలుగు పద్యాలు, కుడివైపు దానికి అనుకరణమైన సంస్కృత శ్లోకాలు ముద్రించారు[1].
ఈ శతకంలో
- శివవందనము
- వరణము
- గణనము
- కారుణ్యము
- శివయాత్ర
- నీతి
- శరణము
అనే ఏడు విభాగాలున్నాయి.
ఉదాహరణ
[మార్చు]ఈ శతకంలోని ఒక పద్యం మచ్చుకు:
కన్నుల్ మూసిన, విచ్చినం గనగఁ నౌఁ గైలాస శై లాభమై
మిన్నుల్ వ్రాలిన క్రేవ నీ శిఖరియుం; 'బెణ్ణాస' పొన్నాసయున్
మన్నాసన్ విడినట్టి వారికగు - యుష్మత్ - సత్య సందర్శనం
బెన్నన్ మాదృశ చర్మ చక్షులకు ఱాలే, పర్వతేశ ప్రభూ!
మూలాలు
[మార్చు]- ↑ ఘట్టమరాజు, అశ్వత్థనారాయణ (1 April 1990). "గ్రంథ విమర్శలు - పర్వతేశ ప్రభు శతకము". భారతి. 67 (4): 64. Retrieved 24 February 2017.[permanent dead link]