Jump to content

పర్మీందర్ సింగ్ ధుల్

వికీపీడియా నుండి
పర్మీందర్ సింగ్ ధుల్
పర్మీందర్ సింగ్ ధుల్


నియోజకవర్గం జులనా
పదవీ కాలం
23 అక్టోబర్ 2009 – 25 జూన్ 2019

వ్యక్తిగత వివరాలు

జననం (1957-03-04) 1957 మార్చి 4 (వయసు 67)
జింద్ , హర్యానా , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు చౌదరి దాల్ సింగ్
జీవిత భాగస్వామి బిమ్లా
సంతానం రవీందర్ సింగ్ ధుల్, సత్యేందర్ సింగ్ ధుల్
నివాసం అర్బన్ ఎస్టేట్, జింద్
వృత్తి రాజకీయ నాయకుడు

పర్మీందర్ సింగ్ ధుల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జులనా నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

పర్మీందర్ సింగ్ ధుల్ తన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి చౌదరి దాల్ సింగ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2009 శాసనసభ ఎన్నికలలో జులనా నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి షేర్ సింగ్‌పై 12,811 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

పర్మీందర్ సింగ్ ధుల్ 2014 శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేందర్ సింగ్ ధుల్‌పై 22,806 ఓట్ల మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి,[4] 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి జేజేపీ అభ్యర్థి అమర్‌జిత్ ధండా చేతిలో 24,193 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. పర్మీందర్ సింగ్ ధుల్ 20 అక్టోబర్ 2020న భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లులకు నిరసనగా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 September 2024). "Vinesh Phogat's Julana nomination stuns 2-time MLA Parminder Dhull". Retrieved 31 October 2024.
  2. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  3. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. "With MLAs, MP switching to BJP, saffron dominates the heart of Jatland | Chandigarh News - Times of India". The Times of India. 27 June 2019.
  5. The Times of India (21 October 2020). "Parminder Singh Dhull quits, to campaign against BJP in Baroda". Retrieved 31 October 2024.