పర్జానియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పర్జానియా
పర్జానియా సినిమా పోస్టర్
దర్శకత్వంరాహుల్ ధోలాకియా
రచనడేవిడ్ ఎన్. డోనిహ్యూ
రాహుల్ ధోలాకియా
నిర్మాతరాహుల్ ధోలాకియా
కమల్ పటేల్
తారాగణంనసీరుద్దీన్ షా
సారిక
కోరిన్ నెమెక్
రాజ్ జుత్షి
ఛాయాగ్రహణంరాబర్ట్ డి. ఎరాస్
కూర్పుఆరీఫ్ షేక్
సంగీతంజాకీర్ హుస్సేన్
తౌఫిక్ ఖురేషి
పంపిణీదార్లుపివిఆర్ పిక్చర్స్
విడుదల తేదీs
2005 నవంబరు 26 (ఫిల్మ్ ఫెస్టివల్)
2007 జనవరి 26 (థియేటర్)
సినిమా నిడివి
122 నిముషాలు
దేశాలుయునైటెడ్ స్టేట్స్
భారతదేశం
భాషలుఇంగ్లీష్
గుజరాతి
హిందీ
బడ్జెట్US$700,000[1]

పర్జానియా[2] 2007 జనవరి 26న విడుదలైన సినిమా. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, సారిక, కోరిన్ నెమెక్, రాజ్ జుత్షి తదితరులు నటించారు. 700,000 అమెరికన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అహ్మదాబాద్, హైదరాబాదు తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా థియేటర్లతో విడుదలకుముందు, 2005 నవంబరు 26న గోవాలో జరిగిన 36వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3] 53వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి (సారిక) విభాగంలో అవార్డులు వచ్చాయి.

కథా నేపథ్యం

[మార్చు]

2002లో గుల్బర్గ్ సొసైటీ మారణకాండ తర్వాత అదృశ్యమైన పదేళ్ల వయస్సు గల పార్సీ అబ్బాయి, అజహర్ మోడి (పర్జాన్ పిఠవాలా పాత్ర) నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. 2002లో గుజరాత్‌లో జరిగిన మత అల్లర్లలో అనేక సంఘటనలలో ఇదీ ఒకటి.[4] తప్పిపోయిన కొడుకు ఆచూకీ కోసం పిఠవాలా కుటుంబం ప్రయత్నాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది.

నటవర్గం

[మార్చు]
  • నసీరుద్దీన్ షా (సైరస్)
  • కోరిన్ నెమెక్ (అల్లన్‌)
  • సారిక (షెర్నాజ్)
  • పర్జాన్ దస్తూర్ (పర్జాన్)
  • పెర్ల్ బార్సివల్లా
  • రాజ్ జుత్షి
  • ఆసిఫ్ బస్రా
  • పుష్పేంద్ర సైనీ
  • రామ్ గోపాల్ బజాజ్
  • షీబా చద్దా

అవార్డులు, గౌరవాలు

[మార్చు]
అవార్డు విభాగం గ్రహీత ఫలితం
53వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[5] గోల్డెన్ లోటస్ అవార్డు రాహుల్ ధోలాకియా గెలుపు
సిల్వర్ లోటస్ అవార్డు సారిక గెలుపు
53వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ కథ డేవిడ్ ఎన్. డోనిహుయే, రాహుల్ ధోలాకియా ప్రతిపాదించబడింది
ఉత్తమ స్క్రీన్ ప్లే ప్రతిపాదించబడింది
స్క్రీన్ అవార్డ్స్ 2008 రామ్‌నాథ్ గోయెంకా మెమోరియల్ అవార్డు రాహుల్ ధోలాకియా[6] గెలుపు

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Chu, Henry (25 February 2007). "Film about massacre banned in India state". The Los Angeles Times. San Francisco Chronicle. Retrieved 31 July 2021.
  2. "Heaven & Hell On Earth - Overview". Allmovie. Retrieved 31 July 2021.[permanent dead link]
  3. Kamath, Sudhish (3 December 2005). "Turnout spells success for IFFI". The Hindu. Archived from the original on 5 March 2006. Retrieved 31 July 2021.
  4. "Apex court SIT submits report on Gulbarg Society massacre". The Hindustan Times. 14 May 2010. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 31 జూలై 2021.
  5. "53rd National Film Awards – 2006". Directorate of Film Festivals. p. 30. Archived from the original on 15 August 2016. Retrieved 31 July 2021.
  6. 'Rahul Dholakia' Wins Ramnath Goenka Memorial Award Archived 2008-01-13 at the Wayback Machine IndiaGlitz, 11 January 2008.

బయటి లింకులు

[మార్చు]