Jump to content

పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2015

వికీపీడియా నుండి

ప్రముఖ రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తే పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు. 2015 ఏప్రిల్‌ 27 నుంచి 30 వరకు హైదరాబాద్‌ లోని రవీంద్రభారతి లో, మే 1 నుంచి 5 వరకు వరకు గుంటూరు జిల్లా లోని పల్లెకోన గ్రామంలో అఖిల భారత రజతోత్సవ నాటక పోటీలు జరిగాయి.[1][2]


రాజేంద్రప్రసాద్‌, తెలంగాణ ప్రభుత్వ సలహాదు కెవి. రమణాచారి, సుద్దాల అశోక్‌ తేజ, దర్శకుడు శంకర్‌, శ్రీకాంత్‌రెడ్డిల పాల్గొన్నారు. నాటకోత్సవాల ముగింపు కార్యక్రమానికి డా. సి.నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా టి.సుబ్బరామిరెడ్డి ముఖ్యఅతిధులుగా పాల్గొని నటీనటులను సత్కరించారు. రంగస్థల నటులు, దర్శకులైన బి. విజయ ప్రకాష్ గారికి పరుచూరి రఘుబాబు రంగస్థల పురస్కారం అందజేశారు.


01.05.2015 నాడు సాయంత్రం 5 గం.లకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారి ఆర్థిక సహాయంతో పల్లెకోనలో నిర్మించిన ఆడిటోరియం ప్రారంభోత్సవం, ప్రజానటుడు, స్వాతంత్ర్య సమరయోధడు అయిన కర్నాటి లక్ష్మీనరసయ్య గారికి పరుచూరి రఘుబాబు రంగస్థల పురస్కార కర్యక్రమం జరిగింది.

04.05.2015 నాడు రాత్రి 10 గం.లకు న్యా నిర్ణేతల జడ్జిమెంట్, విజేతల వివరాల ప్రకటన జరిగింది.


05.05.2015 నాడు సాయంత్రం గం. 6 ని.లకు జబర్దస్త్ కళాకారులచే కామొడిషో, రాత్రి గం. 8.30 ని.లకు స్వాతి సపరివార పత్రిక వ్యవస్థాపకులు వేమూరి బలరామ్ గారిచే తెలుగు నాటక రచయితల ప్రత్యేక సంచిక 'దృష్టి' ఆవిష్కరణ అనంతరం పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2015 విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.

పరిషత్తు వివరాలు - నాటక/నాటికలు

[మార్చు]
తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు
27.04.2015 మ. 12 గం. కొత్త బానిసలు (నాటిక) కళారాధన, హైదరాబాద్ బి. శ్రీనివాసరావు ఎమ్.ఎస్.కె. ప్రభు
27.04.2015 మ. 3 గం. అక్షయ (నాటిక) గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక, వెనిగండ్ల అంచేరి నర్సిరెడ్డి అంచేరి నర్సిరెడ్డి
27.04.2015 మ. 4 గం. మరో ప్రపంచం (నాటిక) కళాంజలి, హైదరాబాద్ కావూరి సత్యనారాయణ కొల్లా రాధాకృష్ణ
27.04.2015 సా. 5 గం. దృశ్యం (నాటకం) ఎన్.టి.ఆర్ కల్చరర్ అసోసియేషన్, ఒంగోలు సూదనగుంట వెంకటేశ్వర్లు సూదనగుంట వెంకటేశ్వర్లు
27.04.2015 రా. 7 గం. వార్ని! అదా విషయం (నాటిక) శ్రీ మురళీ కళా నిలయం, హైదరాబాద్ శంకరమంచి పార్థసారధి తల్లావజ్ఝుల సుందరం
28.04.2015 ఉ. 10 గం. కాంట్రవర్సీ (నాటిక) న్యూస్టార్ మోడరన్ థియేటర్, విజయవాడ ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
28.04.2015 ఉ. గం. 11.15 ని. గురివింద గింజలు (నాటకం) గీతాంజలి థియేటర్ ఆర్ట్స్, విజయవాడ బి.వి. శ్యాం ప్రసాద్ ఆర్. మోహన్ కృష్ణ
29.04.2015 ఉ. 10 గం. పొద్దు పొడిచింది (నాటిక) మురళీ కృష్ణ కళా నిలయం, నిజామాబాద్ చల్లా మధుకర్ వై. సాయన్న
29.04.2015 ఉ. గం. 11.15 ని. ఇక్కడ దొంగలంతా క్షేమం (నాటిక) కాశీ విశ్వనాథ క్రియేషన్స్, విశాఖపట్నం కాశీ విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్
29.04.2015 మ. గం. 12.30 ని. ప్రాయశ్చిత్తం (నాటిక) చైతన్య కళా స్రవంతి, విశాఖపట్నం చలసాని కృష్ణ ప్రసాద్ పి. బాలాజీ నాయక్
30.04.2015 ఉ. 10 గం. సైకత-శిల్పం (నాటిక) కళారాధన సాంస్కృతిక సంస్థ, నంద్యాల తాళబత్తుల వెంకటేశ్వరరావు జి. రవికృష్ణ
30.04.2015 ఉ. గం. 11.15 ని. సంభవం (నాటిక) అభ్యుదయ నటసమైఖ్య, సికింద్రాబాద్ తులసి బాలకృష్ణ తులసి బాలకృష్ణ
30.04.2015 మ 2 గం. దత్తస్వీకారం (నాటిక) జనశ్రేణి, విజయవాడ వై. భాస్కరరావు ఉదయభాస్కర్
30.04.2015 మ గం. 3.15 ని. బొమ్మా! బొరుసా! (నాటకం) అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి ఆకెళ్ల గంగోత్రి సాయి
01.05.2015 రా. 7 గం. అనగనగా (నాటిక) యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ మృత్యుంజయుడు ఆర్. వాసుదేవరావు
01.05.2015 రా. గం. 8.15 ని. ఆకుపచ్చని సూర్యుడు (నాటిక) సాగరి, చిలకలూరిపేట కందిమళ్ల సాంబశివరావు ఐ. రాజ్ కుమార్
01.05.2015 రా. గం. 9.30 ని. ప్రేయకు పద్దెనిమిదేళ్లా ? (నాటకం) భానూదయ, ఒంగోలు కందుల వెంకట్ కందుల వెంకట్
02.05.2015 సా. గం. 6.30 ని. హంస కదా నాపడవ (నాటకం) కందుకూరి కళా సమితి, ధవళేశ్వరం స్నిగ్ధ టి. మణికుమార్
02.05.2015 రా. గం. 8.45 ని. మరో దేవాలయం (నాటిక) ఉషోదయ కళానికేతన్, కట్రపాడు చెరుకూరి సాబంశివరావు చెరుకూరి సాబంశివరావు
02.05.2015 రా. 10 గం. తూర్పు కిటికీ(నాటిక) రసవాహిని, అమలాపురం మార్గశీర్ష మహమ్మద్ షహన్ షా
03.05.2015 సా. గం. 6.30 ని. డొక్కా సీతమ్మ (నాటకం) గంగోత్రి, పెదకాకాని పినాకపాణి నాయుడు గోపి
03.05.2015 రా. గం. 8.45 ని. అగ్నిపుష్పం (నాటిక) సద్గురు కళా నిలయం, గుంటూరు కావూరి సత్యనారాయణ కావూరి సత్యనారాయణ
03.05.2015 రా. 10 గం. అనంతం (నాటిక) కృష్ణా తెలుగు ఆర్ట్ థియేటర్, న్యూఢిల్లీ గంధం నాగరాజు కరణం సురేష్
04.05.2015 సా. గం. 6.30 ని. రెండు నిశబ్దాల మధ్య (నాటిక) అభినయ ఆర్ట్స్, గుంటూరు శిష్ట్లా చంద్రశేఖర్ యన్. రవీంద్రరెడ్డి
04.05.2015 సా. గం. 7.45 ని. జానకీ ఈజ్ రైట్ (నాటకం) కింగ్ ఆర్ట్స్, విజయనగరం పెనుమత్స రాజ్ కుమార్ గంటా సత్యనారాయణ
05.05.2015 సా. 7 గం. నిర్ణయం (నాటిక) పండు క్రియేషన్స్, కొప్పోలు పరుచూరి గోపాలకృష్ణ పాటిబండ్ల ఆనందరావు

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ (2 May 2015). "నాటకరంగాన్ని బతికించాలి:స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు". Retrieved 5 March 2018.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ (14 December 2014). "రఘుబాబు స్మారక నాటకోత్సవాలు: పరుచూరి". Retrieved 5 March 2018.