Jump to content

పరిమళా సోమేశ్వర్

వికీపీడియా నుండి
పరిమళా సోమేశ్వర్

పరిమళా సోమేశ్వర్ 1970వ దశకంలో పేరుపొందిన రచయిత్రి. ఈమె ఎం.ఎస్.సి పట్టాను పుచ్చుకుంది. ఈమె హైదరాబాదులోని సిటీకాలేజిలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేసింది[1].

రచనలు

[మార్చు]

ఈమె రచనలు 1965-1985 మధ్యకాలంలో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి, పుస్తకం, భారతి, ఆంధ్రజ్యోతి, వనిత, విశ్వరచన మొదలైన పత్రికలలో వెలువడ్డాయి.

  1. అంతరాంతరాలు (నవల)
  2. ఈతరం స్త్రీలు
  3. గాజు పెంకులు (కథలు)
  4. చేదునిజాలు 73 (కథలు)
  5. తప్పటడుగు (నవల)
  6. తెల్ల కాకులు (నవల)
  7. పిల్లలతో ప్రేమయాత్ర
  8. భర్తను లొంగదీసుకోవడము ఏలా ?
  9. యువతరం శివమేత్తితే
  10. లౌ మేరేజీ (కథలు)
  11. సాహిత్యాధ్యయనం
  12. సుగంధి

మరణం

[మార్చు]

పరిమళా సోమేశ్వర్‌ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 నవంబర్ 22న మరణించింది.[2]

మూలాలు

[మార్చు]
  1. వాసిరెడ్డి, సీతాదేవి (1975). "వక్తల పరిచయం". ఆంధ్ర రచయిత్రుల సప్తమ మహాసభ సంచిక (విజయవాడ) ఫిబ్రవరి 1975 (ప్రథమ ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. pp. 13–14. Retrieved 11 December 2016.[permanent dead link]
  2. Andhrajyothy (23 November 2024). "రచయిత్రి పరిమళా సోమేశ్వర్‌ కన్నుమూత". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.