పరిమల్ సుక్లాబైద్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరిమల్ సుక్లాబైద్య

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రాజ్‌దీప్ రాయ్
నియోజకవర్గం సిల్చార్

ఫిషరీస్, ఎక్సైజ్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, పర్యావరణ & అడవులు, రవాణా శాఖ మంత్రి
పదవీ కాలం
24 మే 2016 – 14 జూన్ 2024
ముందు బసంత దాస్ (ఫిషరీస్)
అజిత్ సింగ్ (ఎక్సైజ్)
అజంతా నియోగ్ (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్)
ప్రమీలా రాణి బ్రహ్మ (పర్యావరణ)
చంద్ర మోహన్ పటోవారీ (రవాణా)

పదవీ కాలం
19 మే 2016 – 14 జూన్ 2024
ముందు గిరీంద్ర మల్లిక్
నియోజకవర్గం ధోలై
పదవీ కాలం
2001 – 2011
ముందు గిరీంద్ర మల్లిక్
తరువాత గిరీంద్ర మల్లిక్
పదవీ కాలం
1991 – 1996
ముందు దిగేంద్ర పురకాయస్థ
తరువాత గిరీంద్ర మల్లిక్

వ్యక్తిగత వివరాలు

జననం (1958-01-20) 1958 జనవరి 20 (వయసు 66)
ఇరోంగ్మారా, కాచర్, అస్సాం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి సామాజిక కార్యకర్త

పరిమల్ సుక్లాబైద్య (జననం 20 జనవరి 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు అస్సాం శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పరిమల్ సుక్లాబైద్య 1958 జనవరి 20న అస్సాంలోని ఇరోంగ్మారా గ్రామంలో జన్మించాడు. ఆయన 1980లో గౌహతి విశ్వవిద్యాలయం నుండి బిఎ పూర్తి చేశాడు.

లోక్‌సభ ఎన్నికలలో పోటీ

[మార్చు]

పరిమల్ సుక్లాబైద్య 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి సూర్యకాంత్ సర్కార్‌పై 264311 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. పరిమళ్ శుక్లాబాయిద్యకు 652405 ఓట్లు రాగా, సూర్యకాంత్ సర్కార్‌కు 388094 ఓట్లు, ఏఐటీసీ అభ్యర్థి రాధేశ్యామ్ బిశ్వాస్ 20493 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. [2]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (6 March 2024). "Assam: BJP Fields Parimal Suklabaidya From Silchar" (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
  2. 2.0 2.1 Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Silchar". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.