Jump to content

పరిమల్ నత్వానీ

వికీపీడియా నుండి
పరిమల్‌ ధీరజ్ లాల్ నత్వానీ
పరిమల్ నత్వానీ


రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
22 జూన్ 2020 నుండి ప్రస్తుతం
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్[1]
పదవీ కాలం
మార్చి 2008 – మార్చి 2020
నియోజకవర్గం జార్ఖండ్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-02-01) 1956 ఫిబ్రవరి 1 (వయసు 68)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు దీరజ్ లాల్ నత్వానీ
పుష్పాబెన్ నత్వానీ
జీవిత భాగస్వామి వర్ష నత్వానీ
సంతానం ధనరాజ్ నత్వానీ
కరణ్ నత్వానీ
నివాసం ఢిల్లీ[2]
వృత్తి రాజకీయ నాయకుడు, పారిశ్రామిక వేత్త
మతం హిందూ

పరిమల్‌ నత్వానీ భారతదేశానికి చెందిన పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 2020లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పరిమల్‌ నత్వానీ గుజరాత్ రాష్ట్రంలోని జాం కంబాలియా గ్రామంలో దీరజ్ లాల, పుష్పా బెన్ దంపతులకు 1956 ఫిబ్రవరి 1న జన్మించాడు.ఆయన ముంబైలోని ఎన్.యం కాలేజీలో బి.కాం పూర్తి చేశాడు.

వ్యాపార జీవితం

[మార్చు]

పరిమల్‌ నత్వానీ మొదటిసారి పార్లే గ్రూప్ కి చెందిన ప్రకాష్ చౌహాన్, రమేష్ చౌహాన్ మొదలు పెట్టబోయే డీలర్ షిప్ వ్యాపారంలో భాగస్వామ్యం అయ్యాడు. వ్యాపారంలో మెళుకువులు నేర్చుకుని పుంజుకున్న తరువాత 30ఏళ్ళకే సన్ రైజ్ సోప్స్ అండ్ కెమికల్స్ డీలర్ షిప్ ని సొంతం చేసుకున్నాడు.ఆయన తరువాత బరోడాలో ఎస్.ట్.డి - పి.సి.ఒ వ్యాపారం, స్టాక్ ఎక్సేంజ్ వ్యాపారం లాంటి అనేక రంగాల్లో వ్యవరాలు చేశాడు. 1995లో కొటాక్ సెక్యూరిటీస్ కి రిలయన్స్ సంస్థలకి మద్యవర్తిత్వం వహించి గుజరాత్ లోని జాం నగర్ దగ్గర ఏర్పాటు చేసే ఆయిల్ రిఫైనరీకి సంబంధించి రైతుల నుండి 10వేల ఎకరాల భూ సమీకరణలో, అలాగే అందులో పని చేసే వారికోసం ఫ్లాట్స్ కొనడంలోను తాము ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించి దీరుభాయి అంబాని కుటుంబానికి సన్నిహితుడిగా మారాడు.

పరిమల్‌ నత్వానీ 1997లో రిలయన్స్ గ్రూప్ లో చేరిన 2016లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహరాల గ్రూప్ కి అధ్యక్షుడు అయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పరిమల్‌ నత్వానీ 2008లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు, ఆయన 2014 లో రెండోసారి జార్ఖండ్ నుండి రెండోసారి ఎంపీగా ఎన్నికై, 2020లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన సెప్టెంబరు 9న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Parimal Nathwani among four elected to Rajya Sabha from Andhra Pradesh on YSR Congress tickets". P Pavan. Mumbai Mirror. 20 June 2020. Retrieved 20 June 2020.
  2. "Detailed Profile - Shri Parimal Nathwani - Members of Parliament (Rajya Sabha) - Who's Who - Government: National Portal of India". india.gov.in. Archived from the original on 23 September 2015. Retrieved 5 August 2015.
  3. 10TV (19 June 2020). "రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు నలుగురు గెలుపు" (in telugu). Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Sarkaritel (9 September 2020). "Parimal Nathwani takes oath as Rajya Sabha MP for third term". Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.
  5. Sakshi (25 June 2020). "'సీఎం జగన్‌ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శం'". Archived from the original on 23 August 2021. Retrieved 23 August 2021.