Jump to content

పరావర్తన చెందించని ఫిల్మ్స్

వికీపీడియా నుండి

ఫిల్ం వ్యతికరణం దృగ్విషయం యొక్క ఒక ముఖ్యమైన అనువర్తనం, దృక్ కటకాల ఉపరితలాల పై పరావర్తనం చెందించని పూతలను ఏర్పరచడం.

వక్రీభవన గుణకం విలువ μ2 గల ఒక పారదర్శక ఉపరితలం పై వక్రీభవన గుణకం విలువ μ2 గల యానకం ద్వారా ప్రయాణస్తున్న కంపన పరిమితి 'a' గల కిరణం పతనం అయింది అఉకొందాం.

ఫ్రెనెల్ సమీకరణాలు అనుసరించి, పరావర్తనం, వక్రీభవనం చెందని కిరణాల కంపన పరిమితులు వరుసగా ar, atలు అని అనుకొందాం.

ar= { (μ12) / (μ12) }*a

at= { (2μ1) / (μ12) }*a

iపతన కాంతి తీవ్రత అనుకుందాం. పరావర్తనం, వక్రీభవనం చెందిన కాంతి కిరణాల తీవ్రతలు వరుసగా ir, it లని అనుకొందాం. అప్పుడు

ir= [ (μ12/ (μ12) ]2*i

it=[ (2μ1) / (μ12) ]2 *i

గాలి-గాజు తలాలకు μ1=1, μ2=1.5, ir=0.041, ir/i=0.04 లేదా 4%.దీనిని అనుసరించి 4% పతన కాంతి మాత్రమే పరావర్తనం చెందింది. 96% పతన కాంతి ప్రసారం అయింది. ప్రతిబింబం తీక్షణతకు సంబంధించి, దృశా పరికరాలలో పరావర్తన కాంతికి ఉపయోగం లేదు. సంయుక్త సూక్ష్మదర్శిని, దూరదర్శిని, కెమెరా కటకాల మొదలైన దృశా పరికరాలలో కటకాల సముదాయం ఉపయోగిస్తారు. ఆవర్ణ వస్తు కటక దూరదర్శినిలో నాలుగు కటకాలు ఉండినట్లయితే, పతన కాంతిలో 30% పరావర్తనం చెందుతుంది. మిగిలిన 70% మాత్రమే ప్రసారం అవుతుంది. దృశా పరికరాలలో పరావర్తన తలాలు పెరగడం కారణంగా, ప్రసారిత కాంతి తీవ్రత ఎక్కువగా తగ్గిపోతుంది. కాబట్టి ఈ పరావర్తన ద్వారా ప్రప్తించే నష్టాలను తగ్గించడానికి కటక తలాలను సరియైన మందం గల పారదర్శక పదార్ద ఫిల్మ్లను కటకాల పై అతికిస్తారు. ఈ ఫిల్ంను పరావర్తనం 'ప్రదర్శంచని ఫిల్మ్' అంటారు. ఈ విధంగా పరావర్తనం చెందించ ఫిల్మ్ల ద్వారా ఒక తలం పరావర్తన ప్రక్రియను తగ్గించడాన్ని "బ్లూమింగ్" అంటారు.

ఇవి కూడా చుడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

[1] <ref>Non-reflective graphic surface

  1. Non-reflective black cathode in organic light-emitting diode