పరమయోగి విలాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరమయోగి విలాసము తాళ్ళపాక తిరువేంగళనాధుడు రచించిన ద్విపద పద్య కావ్యం. ఇందులో పన్నిద్దరు ఆళ్వార్లు, ఆచార్యుల చరిత్ర సుమారు 7,000 ద్విపద పద్యాలు, ఎనిమిది ఆశ్వాసాలుగా ఉన్నాయి. ఆళ్వార్ల జీవితచరిత్రలపై తెలుగులో రచించిన మొట్టమొదటి కావ్యం దీని విశిష్టత.

నేపథ్యం

[మార్చు]

ఒకనాడు చిన్నన్నకు రాత్రి నిద్రలో వేంకటేశ్వరుడు ఒకానొక శ్రీవైష్ణవాచార్యుని ఆకారంలో గోచరించాడు. తన చేతితో తాను ఆరగించిన ప్రసాదాన్ని ఈ మహాకవికి ఇచ్చాడు. "పన్నిద్దరాళ్వారుల పవిత్రగాథలను ద్రావిడ ప్రబంధాన్నుండి సేకరించి, తెలుగులో ద్విపద కావ్యంగా రచించి, లక్ష్మీసమేతుడవై, భక్తుల పరివారంతో కొలువుదీరియున్న నాకు అంకితం చేయవలసింది" అని సెలవిచ్చారు. స్వామివారి ఆదేశానుసారం ఈ అపూర్వమైన గ్రంథాన్ని చిన్నన్న రచించెను.

బయటి లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: