పరమజిత్ ఖురానా
పరమజిత్ ఖురానా | |
---|---|
జననం | 1956 ఆగస్టు 15 |
జాతీయత | భారతీయ |
వృత్తి | Teaching and Research |
క్రియాశీల సంవత్సరాలు | 1983 to date |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | Plant Biotechnology, Molecular Biology, Genomics |
గుర్తించదగిన సేవలు | Research in Wheat and Seribiotechnology |
పరమజిత్ ఖురానా (Paramjit Khurana) (జననం 1956 ఆగస్టు 15) ప్లాంట్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనోమిక్స్ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్త, ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తోంది.
జీవితం
[మార్చు]పరమజిత్ ఖురానా ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి వృక్షశాస్త్రంలో 1975 సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ (బి.ఎస్సీ.), 1977 సంవత్సరంలోలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ (ఎం, ఎస్సీ ), 1978 సంవత్సరంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్.), ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1983 సంవత్సరంలో వృక్షశాస్త్రంలో డాక్టరేట్ డిగ్రీ, పి.హెచ్.డి. పొందింది. ఖురానా 1983-84 సంవత్సరాలలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని యూనిట్ ఫర్ ప్లాంట్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ యూనిట్ లో సైంటిస్ట్ గా పనిచేస్తూ తన వృత్తిని ప్రారంభించింది. ఆమె 1984 నుండి 1987 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఎస్.జి.టి.బి ఖల్సా కళాశాలలో ప్లాంట్ బయాలజీ విభాగంలో లెక్చరరుగా పనిచేసింది. 1987-88 సమయంలో ఆమె, అమెరికాలో ఈస్ట్ లాన్సింగ్ లోని మిచిగన్ స్టేట్ యూనివర్శిటీ (ఎమ్.ఎస్.యు) లో రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేసింది. ఖురానా అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత లెక్చరరుగా (1989–90), రీడరుగా (1990–98), ప్రస్తుతం ప్రొఫెసరుగా 1998 సంవత్సరం నుండి ఢిల్లీ విశ్వవిద్యాలయం, సౌత్ క్యాంపస్ లోని ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ విభాగంలో పనిచేసింది. 2004-07 సంవత్సరాలలో ఈ విభాగానికి ఆమె అధిపతిగా ఉండేది.[1]
పరిశోధన
[మార్చు]ఖురానా సాధించిన పరిశోధనా విజయాలను చూస్తే, గోధుమ, సెరిబియోటెక్నాలజీ, కంపారిటివ్ జెనోమిక్స్, గోధుమ బయోటెక్నాలజీలో మార్గదర్శకమైన రచనలు చేశారు. తృణధాన్యాల తిత్తి నెమటోడ్ కు వ్యతిరేకంగా నిరోధకత, నిర్జీవ ఒత్తిడిలో భారతీయ గోధుమల లోని జన్యు పరివర్తన, లవణీయత, కరువు వంటి పరిస్థితులను తట్టుకునే సామర్ధ్యం కలిగిన మల్బరీ ట్రాన్స్ జెనిక్స్ అభివృద్ధి, పంట మొక్కల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగిన సమర్థవంతమైన జన్యు ఇంజనీరింగ్ వ్యూహాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో తట్టుకునే సామర్ధ్యం కలిగిన ట్రాన్స్జెనిక్స్ అభివృద్ధి చేయడం వంటి రంగాల్లో పేరిశోధన చేసింది. వరి లోని క్రోమోజోమ్ 11, టొమాటో లోని క్రోమోజోమ్ 5, మల్బరీ యొక్క క్లోరోప్లాస్ట్ జీనోమ్ సీక్వెన్సింగ్ మొదలైన వాటిలో ఖురానా పనిచేసింది.[2]
ఖురానా మల్బరీ దానిపై కూడా తమ పరిశోధన చేయడం జరిగింది. మల్బరీని భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో పండిస్తారు, దాని ఆకులు పట్టు పురుగులకు ఆహారం. మల్బరీ సెరికల్చర్ (పట్టు వ్యవసాయం) ప్రధాన వాణిజ్య కరమైన పంట. మల్బరీని పండించడం ద్వారా, రైతుకు పశుగ్రాసం, ఇంధనం, ఎరువులు కూడా లభిస్తాయి. కానీ కరువు, నేల ఉప్పు స్థాయిలు అధిక శాతం కల భారతదేశంలో మల్బరీ దిగుబడిలో సుమారు అరవై శాతం వరకు నష్టపోయాయి. ఆమె మల్బరీ బయోటెక్నాలజీకి మార్గదర్శకత్వం వహించింది, ఖురానా చేసిన పరిశోధనలో అధిక ఉష్ణోగ్రతకు, వేడికీ తట్టుకునే మల్బరీ రకంపై పరిశోధన చేసింది. ఈ కొత్త మల్బరీని ఇటీవల మైసూరులోని సెంట్రల్ సెరికల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో పరీక్షించారు, దీన్ని తక్కువ భూగర్భజలాలు ఉన్న బంజరు భూముల్లో పండించవచ్చని ఫలితాలు చూపిస్తున్నాయి. మల్బరీ తోటలు కరువు, నేల పరిస్థితుల నుండి ప్రభావితమై, అధిక దిగుబడినిచ్చే మల్బరీ సాగుదారులకు నీటి కోసం అధిక డిమాండ్లు ఉన్న చోట, పరమజిత్ ఖురానా చేసిన కృషి సెరికల్చర్ జీవనోపాధి సుస్థిరతలో అంతర్భాగంగా ఉంది.[3]
అవార్డు- సభ్యత్వములు
[మార్చు]అంతర్జాతీయ మహిళా దినోత్సవం (2011) సందర్భంగా ఘంటావయ సంస్థాన్ ప్రదానం చేసిన 'సర్టిఫికేట్ ఆఫ్ హానర్', 2011-2012లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రొఫెసర్ అర్చనా శర్మ స్మారక పురస్కారాన్ని ఖురానా అందుకున్నారు.[3]
సభ్యత్వాలు
[మార్చు]- ఫెలో ఆఫ్ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (2010)
- ఫెలో ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (2003)
- ఫెలో ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (2014)
- ప్రొఫెసర్ జె.C. బోస్ ఫెలోషిప్ (2012-2017) ద్వారా డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం.
ప్రచురణలు
[మార్చు]ఖురానా జాతీయ, అంతర్జాతీయ జర్నళ్ళలో సుమారు 129 శాస్త్రీయ ప్రచురణలు ప్రచురించింది. ఖురానా పర్యవేక్షణలో సుమారు 19 మంది పట్టభద్రులకు డాక్టరేట్ అవార్డులు, నలుగురు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ పొందారు. ఖురానా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే పరిశోధన సంస్థల్లో సభ్యురాలిగా, ముఖ్య నిర్వహణ అధికారిణిగా పనిచేస్తున్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Paramjit Khurana | Indian National Science Academy | India". OMICS International (in ఇంగ్లీష్). Retrieved 2022-04-22.
- ↑ "INSA :: Indian Fellow Detail". www.insaindia.res.in. Retrieved 2022-04-22.
- ↑ 3.0 3.1 Sci-Illustrate (2021-02-09). "Paramjit Khurana". Sci-Illustrate Stories (in ఇంగ్లీష్). Retrieved 2022-04-22.
- ↑ "Faculty Details proforma for DU Web-site" (PDF). du.ac.in/.