Jump to content

పరగటిచర్ల

అక్షాంశ రేఖాంశాలు: 16°14′58″N 79°58′02″E / 16.249307°N 79.967283°E / 16.249307; 79.967283
వికీపీడియా నుండి
పరగటిచర్ల
—  గ్రామం  —
పరగటిచర్ల is located in Andhra Pradesh
పరగటిచర్ల
పరగటిచర్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°14′58″N 79°58′02″E / 16.249307°N 79.967283°E / 16.249307; 79.967283
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం రొంపిచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522603
ఎస్.టి.డి కోడ్

పరగటిచర్ల , గుంటూరు జిల్లా, రొంపిచర్ల మండలానికి చెందిన గ్రామం. ఇది నరసరావుపేట పట్టణానికి 9 కి.మీ దూరంలో ఉంది. గ్రామ జనాభా 2000. అక్షరాస్యత 35 శాతం. వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవనాదారం.ఈ గ్రామంలో ప్రదాన పంటలు వరి, ప్రత్తి, మిరప. దిగువ మధ్య తరగతి రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ గ్రామంలో ప్రజలు అందరు కలుపుగొలుగా ఉంటారు. ఈ గ్రామానికి తూర్పు దిక్కున ఒగేరు వాగు ఉంటుంది.ఈ గ్రామం 1800-1900 మధ్య కాలంలో పుట్టీ ఉండవచ్చని అంచనా.ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మూడవ శుక్రవారం బ్రహ్మంగారి ఊరేగింపు జరుగుతుంది.ఈ ఊరెగింపుకు రాష్ట్రంలో ఎక్కడ లేని విదంగా బ్రహ్మంగారి గడని ఊరెగిస్తారు.ప్రతి వేసవి కాలంలో ఆంజనేయస్వామి తిరునాళ్ళు జరుగుతుంది.ఈ ఊరు చుట్టుప్రక్కల తూర్పునపాలపాడు, పడమర సంతగుడిపాడు, ఉత్తరాన గార్లపాడు, దక్షిణాన తుంగపాడు ఉన్నాయి. ఈ గ్రామానికి 20 కి.మి.దూరంలో కోటప్పకొండ అనేపుణ్యక్షేత్రం ఉంది.

  • ఈ క్షేత్రం మొదటి కొండపై ముసలి కోటయ్యగారిగుడి ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది.
  • రెండవ కొండ త్రికోటేశ్వరస్వామివారి దేవాలయం కలది. ఇక్కడ ఎర్రగా ఉండే కోతులు ఒక ప్రత్యేకత. గుడి పరిసరాలలో భక్తులు ఇచ్చే ప్రసాదాలను తీసుకొంటూ ఒక్కోసారి లాక్కుంటూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్దపుట్ట, నవగ్రహముల దేవాలయము, ద్యాన మందిరము, దేవాలయపు వెనుక బాగమున రెస్ట్ రూమ్స్ ఉన్నాయి.
  • మూడవ భాగమైన కొండ క్రింద బొచ్చుకోటయ్యగారి మందిరము, కళ్యాణ కట్ట, సిద్ధి వినాయక మందిరములు ఉన్నాయి.

శివరాత్రికి ఇక్కడ జరిగే ప్రభల సంభరం అత్యంత పేరు కలిగినది, విశేషమైనదీను. చుట్టుప్రక్కల గ్రామాలనుండి చిన్నపిల్లల చేతులలో చిన్న చిన్న ప్రభలనుండి దాదాపు డెభై ఎనభై అడుగుల వరకూ ఎత్తు గలిగిన ప్రభలు కోటప్పకొండకు శివరాత్రి సంబరాలకు తీసుకొస్తారు. వీటిని ట్రాక్టర్లలో బండ్లలో డప్పులు, బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాల వంటి పలు కార్యక్రమములతోనూ తీసుకొస్తారు. ఒక్కొక్క ప్రభను ఒక్కొక్క రకంగా అలంకరించి కొండక్రింద పొలాల్లో ఉంచుతారు. ఇవి పెద్దవే వందల సంఖ్యలో ఉంటాయి. చిన్నవయితే లక్షల సంఖ్యలో కనుపిస్తూ, కొండ పైభాగమునుండి చూసేవారికి సముద్రంలో తెరచాపల్లా కనువిందు చేస్తూఉంటాయి.ఈ సంభరానికి పూర్వకాలంలో పరగటిచర్ల గ్రామం నుంచి కూడా ప్రభ కట్టుకొని వెల్లెవారని చరిత్ర చెబుతుంది.

పరగటిచర్ల గ్రామం కు దారి

[మార్చు]

నరసరావుపేట పల్నాడు బస్ స్టాండు నుండి ప్రతి అరగంటకు ప్రైవెటు వాహనాలు (ఆటోలు) ఉన్నాయి. బైకు మీద రావలంటే యస్.యస్.యన్ కాలేజి ప్రక్క రోడ్డు నుంచి లేక రావిపాడు వఛ్ఛి రావఛ్ఛు.

పల్నాడు బస్ స్టాండు ------> యస్.యస్.యన్ కాలేజి ప్రక్క రొడ్డు -------> పాలపాడు -------> పరగటిచర్ల.

(లేక)

పల్నాడు బస్ స్టాండు -------> రావిపాడు -----> పాలపాడు -------> పరగటిచర్ల.