పయ్యావుల కేశవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పయ్యావుల కేశవ్
పయ్యావుల కేశవ్

తెలుగుదేశం పార్టీ చురుకైన నాయకుడు పయ్యావుల కేశవ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
12 జూన్ 2024
గవర్నరు ఎస్. అబ్దుల్ నజీర్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు వై.విశ్వేశ్వర రెడ్డి
నియోజకవర్గం ఉరవకొండ

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2014
ముందు వై.శివరామి రెడ్డి
తరువాత వై.విశ్వేశ్వర రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1965-05-14) 1965 మే 14 (వయసు 59)
బళ్ళారి
రాజకీయ పార్టీ తెలుగుదేశం
జీవిత భాగస్వామి హేమలత[1]
సంతానం 2
వృత్తి రాజకీయనాయకుడు

'పయ్యావుల కేశవ్' అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ శాసనసభ సభ్యుడు. 2015 లో ఇతడు ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికయ్యాడు.1994, 2004, 2009 లో శాసనసభ సభ్యుడుగా 2019లో ఇతను వైసీపీ గాలిలో కూడా 4000 ఓట్ల మేజరిటీతో గెలిచాడు

నేపధ్యం

[మార్చు]

ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన పయ్యావుల కేశవ్ ఎంబిఎ చదివాడు. 1994, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాలు సాధించాడు. 2014లో ఓటమి చెందాడు.మళ్లీ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

పయ్యావుల కేశవ్ తన 29 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి 1994 నుంచి 2024 వరకు ఏడుసార్లు ఎన్నికలు పోటీ చేసి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 1999, 2014 శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయాడు. పయ్యావుల కేశవ్ 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 12న ఆర్థిక &ప్రణాళిక, వాణిజ్య పన్నులు & అసెంబ్లీ వ్యవహారాలు శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]

రాజకీయ ప్రస్థానం

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరము శాసనసభ ప్రత్యర్థి ఓట్లు తేడా ఫలితము
1 1999 ఉరవకొండ ఎల్లారెడ్డిగారి శివరామరెడ్డి

(కాంగ్రెస్)

45562-54063 8501 ఓటమి
2 2004 ఉరవకొండ వై.విశ్వేశ్వర రెడ్డి (సిపిఐ (ఎం. ఎల్) లిబరేషన్) 55756-47501 8,255 గెలుపు
3 2009 ఉరవకొండ వై.విశ్వేశ్వర రెడ్డి (కాంగ్రెస్) 64728-64499 229 గెలుపు
4 2014 ఉరవకొండ వై.విశ్వేశ్వర రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) 78767-81042 2,275 ఓటమి
5 2019 ఉరవకొండ వై.విశ్వేశ్వర రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) 90209-88077 2,132 గెలుపు
6 2024[4] ఉరవకొండ వై.విశ్వేశ్వర రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) 102046-80342 21704 గెలుపు

మూలాలు

[మార్చు]
  1. http://www.youtube.com/watch?v=zK0M-CqIrP4
  2. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  3. EENADU (14 June 2024). "పవన్‌కు పంచాయతీరాజ్‌... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Uravakonda". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.

బయటి లంకెలు

[మార్చు]