పనస పొట్టు కూర
మూలము | |
---|---|
మూలస్థానం | భారత దేశం |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | పనస పొట్టు చింత పండు పేస్టు ఆవాలు ఆవ నూనె |
పనసకాయపై ఉండే పొట్టుతో ఆవపెట్టి చేసే కూరను పనస పొట్టు కూర అంటారు. శాకాహారులలో పనస పొట్టు కూరకు గొప్ప ఆదరణ ఉంది. మంచి రుచి ఉండడమనే కారణం వల్ల కష్టభరితమైన తయారీ పద్ధతిని కూడా లెక్కచేయకుండా వండుకుంటూంటారు.[1]
పనసపొట్టు కొట్టడం
[మార్చు]లేత పనస కాయను ఎంచుకుని కోస్తారు. ఆ కోసిన పనస కాయను పొట్టు కొట్టేందుకు ఒక ప్రత్యేకమైన కత్తిని వినియోగిస్తారు. సాధారణంగా పదునైన ఊచని కాయ మధ్య గుండా దింపుతారు. ఆ ఊచ సాయంతో పట్టుకుని పనసకత్తితో కాయపైన ఉన్న పచ్చని పొట్టు చెక్కి, బయట పారేస్తారు. అనంతరం ఆ కాయను పనసకత్తితో చిన్న చిన్న ముక్కలుగా అయ్యేవరకూ కొడతారు. ఆ చిన్న చిన్న ముక్కలనే పనస పొట్టు అని వ్యవహరిస్తారు.
ప్రత్యేకత
[మార్చు]అందరూ వండుకునే కూరే అయినా శాకాహారుల ఆహారంలో పనస పొట్టు కూరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మాంసాహారులు కొన్ని రకాల చేపల కూర, కోడి కూర వంటివాటికి ఇచ్చే స్థానాన్ని శాకాహారుల ఆవపెట్టిన పనస పొట్టు కూరకు ఇస్తారని ప్రతీతి.[1] ప్రత్యేకించి ఆవపెట్టి చేసిన పనసపొట్టు కూర చాలామంది ఇష్టపడి తింటారు. మిథునం సినిమాలోనూ దీని ప్రస్తావన డైలాగుల్లో వస్తుంది.[2] ఈ కూర ప్రాశస్త్యాన్ని వివరిస్తూండేలా కవులు పద్యాలు కూడా రాశారు. [3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 పసంద్ పనస:సూర్య దినపత్రిక:13 మార్చి 2013[permanent dead link]
- ↑ మూర్తి, వైదేహి. "పనసపొట్టు కూరకి ఎందుకంత డిమాండ్". కోస్తాలైఫ్. Archived from the original on 2015-07-23. Retrieved 21 జూలై 2018.
- ↑ భళ్లమూడి, శ్రీరామశంకర ప్రసాద్. "పనసపొట్టు కూర (పద్యాలు)". ప్రతిలిపి. Retrieved 21 July 2018.[permanent dead link]