పద్మా సుబ్రహ్మణ్యం
పద్మా సుబ్రహ్మణ్యం | |
---|---|
![]() | |
జననం | 4 February 1943 మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | (age 82)
జాతీయత | భారతీయులు |
విద్యాసంస్థ | ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ |
వృత్తి | డాన్సర్, కొరియోగ్రాఫర్, ఉపాధ్యాయురాలు, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భరతనాట్యం |
తల్లిదండ్రులు |
|
బంధువులు | ఎస్. కృష్ణస్వామి (తమ్ముడు) రఘురామ్ (మేనల్లుడు) అనిరుధ్ రవిచందర్ (మనవడు) హృషికేశ్ (నటుడు) (మనవడు) గాయత్రి రఘురాం (మేనకోడలు) |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం (1981) పద్మభూషణ్ పురస్కారం (2003) |
పద్మా సుబ్రహ్మణ్యం (జననం 1943 ఫిబ్రవరి 4) భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి. ఈమె పరిశోధకురాలు, నృత్య దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సంగీతకారులు , ఉపాధ్యాయురాలు, రచయిత్రి. ఈమె భారత దేశంలోనే కాక విదేశాలలో కూడా ఖ్యాతి పొందింది. అనేక చలనచిత్రాలు, లఘుచిత్రాలు జపాన్, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలలో ఆమె గౌరవార్ధం చేయబడ్డాయి.
జీవిత విశేషాలు
[మార్చు]పద్మా సుబ్రహ్మణ్యం ప్రముఖ చలన చిత్ర దర్శకుడు కె.సుబ్రహ్మణ్యం, మీనాక్షి సుబ్రహ్మణ్యం లకు 1943 ఫిబ్రవరి 4న మద్రాసులో జన్మించింది. ఈమె తండ్రి చలన చిత్ర నిర్మాత. ఆమె తల్లి మీనాక్షి ఒక సంగీత దర్శకురాలు, తమిళ, సంస్కృత రచయిత్రి. పద్మా సుబ్రహ్మణ్యం బి.రామయ్య పిళ్ళై వద్ద శిక్షణ పొందింది.
ఈమె సంగీతం బ్యాచులర్స్ డిగ్రీ, ఎత్నో-మ్యూజికాలజీ ఒక మాస్టర్ డిగ్రీ ని పొందింది. నృత్యంలో పి.హెచ్.డి ని కూడా పొందింది. ఆమె అనేక వ్యాసాలు, పరిశోధన పత్రాలు, పుస్తకాలు రచించింది, విద్య, సంస్కృతి శాఖకు సంబంధించి ఇండో ఉప కమిషన్ లో ఒక అనధికార సభ్యురాలిగా వ్యవహరించింది.
అవార్డులు
[మార్చు]ఈమె అనేక అవార్డులను పొందింది. ఈమెకు 1981 లో పద్మశ్రీ, 2003 లో పద్మ భూషణ అవార్డులు వచ్చినవి. ఆమె నృత్య ప్రస్థానంలో అనేక యితర అవార్డులు కూడా పొందింది.
- సంగీత నాటక కమిటీ అవార్దు (1983)'
- పద్మ భూషణ (2003)
- కళైమణి అవార్డు (తమిళనాడు ప్రభుత్వం నుండి)
- మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి "కాళిదాసు సమ్మాన్" అవార్డు.
- నారద గాన సభ , చెన్నై నుండి "నాద బ్రహ్మం" అవార్డు.
- "ఆసియాలో అభివృద్ధి, సామరస్యాన్ని ఆమె సహకారం" అందించినందుకుగాను జపాన్ ప్రభుత్వం చే ఫకోకా ఆసియన్ కల్చర్ ప్రైజ్
మూలాలు
[మార్చు]- India's 50 Most Illustrious Women (ISBN 81-88086-19-3) by Indra Gupta
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1943 జననాలు
- తమిళనాడు మహిళా నాట్య కళాకారులు
- పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు
- జీవిస్తున్న ప్రజలు
- మహిళా నృత్య కళాకారులు
- నృత్యదర్శకులు
- సంగీత దర్శకులు
- మహిళా సంగీతకారులు
- తమిళనాడు రచయిత్రులు
- భరతనాట్య కళాకారులు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు