పత్ని (సినిమా)
పత్ని (1942 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | గూడవల్లి రామబ్రహ్మం |
నిర్మాణం | గూడవల్లి రామబ్రహ్మం |
కథ | తాపీ ధర్మారావు |
సంగీతం | కొప్పరపు సుబ్బారావు |
గీతరచన | తాపీ ధర్మారావు |
ఛాయాగ్రహణం | సుధీష్ ఘాతక్ |
నిర్మాణ సంస్థ | సారధీ పిక్చర్స్ |
నిడివి | 194 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పత్ని సినిమా తమిళ గాథ అయిన శిలప్పదికారం ఆధారం చేసుకొని సారథీ పతాకం క్రింద తీసిన చారిత్రక సినిమా. పూంపుహార్లో జరిగిన కోవలన్ - కణ్ణగి కథను గూడవల్లి రామబ్రహ్మం అపూర్వమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఒక అపురూప చిత్రం అని విమర్శకులు కొనియాడారు. కళా దర్శకుడు వాలి చిత్రకళా నైపుణ్యం దానిని వన్నె తెచ్చింది.
గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో సారధి స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సురభి కమలాబాయి, ఋష్యేంద్రమణి కొచ్చర్ల్లకోట సత్యనారాయణ నటించిన ఈ చిత్రానికి సంగీతం కొప్పరపు సుబ్బారావు అందించారు.
తారాగణం
[మార్చు]సురభి కమలాబాయి
కొచ్చెర్లకోట సత్యనారాయణ
ఋష్యేంద్రమణి
కె.ఎస్.ప్రకాశరావు
వంగర
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: గూడవల్లి రామబ్రహ్మం
సంగీతం: కొప్పరపు సుబ్బారావు
గీత రచయిత: తాపీ ధర్మారావు
గాయనీ గాయకులు: హైమావతి, సురభి కమలాబాయి, కె ఎస్.ప్రకాశరావు, ఋష్యేంద్రమణి, అన్నపూర్ణ, కమల
నిర్మాత: గూడవల్లి రామబ్రహ్మం
నిర్మాణ సంస్థ: సరస్వతి టాకీస్
విడుదల:17:03:1942.
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]రాజకొలువులో పనిచేసే కోవలన్ రాజనర్తకి ప్రేమలో పడతాడు. అతని మీద రాజుగారి ధనాగారం నుంచి ఒక హారం దొంగిలించినట్లు అభియోగం పడుతుంది. అయితే అతని భార్య కన్నగి హారం తనదేనని ఋజువు చేస్తుంది. ఇంతలోపలే అతనికి మరణశిక్ష అమలవుతుంది. నిర్దోషి అయిన తన భర్తను తనకివ్వమని రాజును నిలదీస్తుంది కన్నగి. ఆగ్రహించిన కన్నగి పాతివ్రత్య మహిమతో మధుర పట్టణం సర్వనాశనమవుతుంది.
పాటల జాబితా
[మార్చు]1.ఏమి పూజలను చేసితినో ఈ మహితానందము కలిగే, రచన: తాపీ ధర్మారావు, గానం.హైమావతి
2.కర్మ దాటవశమా నరుడా ధనికుడు తృటిలో బికారికాడా, రచన: తాపీ ధర్మారావు, గానం.సురభి కమలాబాయి
3.వలపు తెలియవలదా కాలు నిలుపవు కమలా, రచన: తాపీ ధర్మారావు, గానం.హైమావతి, కె.ఎస్.ప్రకాశరావు
4.హా విధి తగునా ఈ పరిశోధనా....చారెడు నీరు,రచన: తాపీ ధర్మారావు, గానం.ఋష్యేంద్రమణి
5.అదిగో అదిగో పతి రాక పదవే పదవే ముదమున, రచన: తాపీ ధర్మారావు, గానం.ఋష్యేంద్రమణి
6.ఆనందమే లేదా ప్రకృతి యందము పరికించుటలో, రచన: తాపీ ధర్మారావు, గానం.అన్నపూర్ణ
7.ఇంద్రవో విశ్వతస్పరిహవా మహేజన్యాబ్(శ్లోకం)
8.గోవులన్ని బతికే కొండను గున్నమామిడి చెట్టుమీద, రచన: తాపీ ధర్మారావు, గానం.కమల
9.చిరునగవేది చూపవా నాథా సరస హృదయము, రచన: తాపీ ధర్మారావు, గానం.హైమావతి
10.చిరునవ్వు మోముతో చెలువొందు నాసామి, రచన: తాపీ ధర్మారావు, గానం.
11.తెలియజాలరేలా వీరికి తెలుపజాలనేలా, రచన: తాపీ ధర్మారావు, గానం.ఋష్యేంద్రమణి
12.నాకేలా నాకేలా ఆ ఇంద్రుని పూజలు స్త్రీకేలా, రచన: తాపీ ధర్మారావు, గానం.ఋష్యేంద్రమణి
13.నన్ను గొల్చెదుగా నిను పూజించేదగా నీకే పార్ధన, రచన: తాపీ ధర్మారావు, గానం.ఋష్యేంద్రమణి
14.మా సామి ఇందురుడా మాదేవ ఇందురుడా, రచన: తాపీ ధర్మారావు, గానం.బృందం
15.మాధవిని పున్నాగమెంతో మన్ననల పెండ్లాడ వచ్చెను, రచన: తాపీ ధర్మారావు, గానం.సురభి కమలాబాయి.
మూలాలు
[మార్చు]- శ్రీ గూడవల్లి రామబ్రహ్మం, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, శ్రీ గాయత్రి ప్రింటర్స్, తెనాలి, 2004.
- నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.