Jump to content

పఠన రాయి

వికీపీడియా నుండి
Reading stone in Archeon, a historical theme park

పఠన రాయి సుమారు అర్థ గోళాకృత ఆకారంలో రాతితో చేయబడిన కటకం. దీనిని చత్వారం ఉన్నవారు అక్షరాలపై ఉంచినపుడు అక్షరాలు ఆవర్థనం చెంది పెద్దవిగా కనబడతాయి. కనుక సులభంగా చదువుకోవచ్చు. కటకాల యొక్క ప్రాచీన ఉపయోగాలలో పఠన రాయి ఒకటి. ఇవి 9వ శతాబ్దంలో అభివృద్ధి చేయబడినవి. వీటిని అబ్బాస్ ఇబ్న్ ఫిర్నాస్ ఇసుక నుండి గాజును తయారుచేసిన తరువాత అభివృద్ధి చేయడం జరిగింది. [1] గాజును కావలసిన ఆకారంలోనికి మలచి దానిపై పాలిష్ చేస్తారు. ఈ పఠన రాళ్లు స్థానంలో 13వ శతాబ్ద చివరి నుండి కళ్ళద్దాలు చేరాయి. నవీన పోకడలు ఇప్పటికీ కూడా కొనసాగింపబడుతున్నాయి. నవీన రూపంలో అవి కడ్డీ రూపంలో ఉన్న భూతద్దాలుగా, ఒకవైపు సమతలంగా ఉండి పాఠ్యంలోని ఒక్కొక్క వరుసను సులభంగా ఒకేసారి చదివేటట్లు తయారుచేయబడ్డాయి. ఒక పేజీ అంతా చదువుటకు "ఫ్రెస్నెల్ కటకం" వాడుతారు. ప్రస్తుతం ప్లాస్టిక్ తో చేయబడిన కటకాలను వాడుతున్నారు. ప్రాచీన పఠన రాళ్ళను రాతి స్ఫటికాలు (క్వార్ట్జ్) లేదా బెరైల్ తో తయారుచేసేవారు. "విస్బీ కటకాలు" కూడా పఠనానికి ఉపయోగిచే రాళ్ళే.

మూలాలు

[మార్చు]
  1. Lynn Townsend White, Jr. (Spring, 1961). "Eilmer of Malmesbury, an Eleventh Century Aviator: A Case Study of Technological Innovation, Its Context and Tradition", Technology and Culture 2 (2), pp. 97-111. "Ibn Firnas was a polymath: a physician, a rather bad poet, the first to make glass from stones (quartz?)..."
  • "A good illustration of a reading stone in use". Zeiss Optical Museum, Oberkochen. Archived from the original on 2011-05-20. Retrieved 2011-03-06.
"https://te.wikipedia.org/w/index.php?title=పఠన_రాయి&oldid=3846839" నుండి వెలికితీశారు