Jump to content

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం

వికీపీడియా నుండి
PNB's Headquarters in Dwarka, New Delhi
న్యూ ఢిల్లీ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రధాన కార్యాలయం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం అన్నది ముంబైలోని బ్రాడీహౌస్ పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచి ఇచ్చిన 14,356 కోట్ల 84 లక్షల రూపాయల (2.1 బిలయన్ యు.ఎస్.డాలర్లు)కు సంబంధించిన మోసపూరితమైన లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ కు సంబంధించిన కుంభకోణం. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకును ఆ డబ్బుకు బాధ్యత వహించేలా చేసింది.[1] ఈ కుంభకోణాన్ని వజ్రాల వ్యాపారి, డిజైనర్ నీరవ్ మోడీ నడిపించినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టింది. సీబీఐ చార్జిషీట్లో నిందితులుగా నీరవ్, అతని భార్య అమీ మోడీ, సోదరుడు నిషాల్ మోడీ, బంధువు మెహుల్ చోక్సీ, డైమండ్ ఆర్, సోలార్ ఎక్స్ పోర్ట్స్, స్టెల్లర్ డైమండ్స్ వంటి సంస్థల భాగస్వాములందరూ, పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు, ఉద్యోగులూ ఉన్నారు.[2]

కుట్ర

[మార్చు]

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు ఇద్దరు ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారని మొదట్లో బ్యాంకు పేర్కొంది.బ్యాంకు కోర్ బ్యాంకింగ్ పద్ధతిని తప్పించి, అవినీతిపరులైన ఉద్యోగులు అలహాబాదు బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకుల విదేశీ బ్రాంచిలకు అంతర్జాతీయ ఆర్థిక సమాచార ప్రసార్ వ్యవస్థ అయిన స్విఫ్ట్ ద్వారా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ జారీచేశారు. ఈ లావాదేవీలను కొత్తగా బ్యాంకులో చేరిన ఒక ఉద్యోగి గమనించి బయటపెట్టాడు.[3] బ్యాంకు ఆ వెంటనే ఈ కుట్రపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. తర్వాత సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు పి.ఎన్.బి. మాజీ సీఈవో ఉషా అనంతసుబ్రమణ్యన్, కార్యనిర్వాహక డైరెక్టర్లు కె.వి.బ్రహ్మాజీరావు, సంజీవ్ శరణ్ వంటి కీలకమైన విధుల్లోని అధికారులను స్విఫ్ట్ సందేశాలు, కోర్ బ్యాంకింగ్ పద్ధతుల విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన పలు సర్క్యులర్లు, నోటీసులను అమలుచేయనందుకు బాధ్యులను చేస్తూ ఛార్జిషీట్లో పేర్కొంది.[4]

నిందితుల పరారీ

[మార్చు]

2018లో ఈ కుంభకోణానికి సంబంధించిన వార్తలు బయటకు రాగానే నీరవ్ మోడీ, అతని కుటుంబం పరారయ్యింది. ఆ క్రమంలో తప్పించుకుని నీరవ్ మోడీ కుటుంబం యునైటెడ్ కింగ్‌డమ్ చేరుకుంది. బ్రిటన్ ప్రభుత్వాన్ని రాజకీయ శరణార్థిగా తనకు రక్షణనివ్వాలని నీరవ్ కోరాడు. నేరస్తుల అప్పగింతంలో భాగంగా నీరవ్ మోడీని భారతదేశానికి అప్పగించమని భారత ప్రభుత్వం అధికారికంగా అడిగింది.[5] ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిందితుల ఆస్తులు అటాచ్ చేసింది, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళ ఆర్డినెస్స్ ప్రకారం వారి ఆస్తులను వెంటనే జప్తు చేసుందుకు అనుమతించాలని కోరుతోంది.[6] నీరవ్ మోడీని నేరస్వభావం కల కుట్ర, నేరపూరితమైన విశ్వాస భంగం, మోసం, నిజాయితీ రాహిత్యం వంటివాటితో పాటు అవినీతి, హవాలా వంటి నేరాలకు పాల్పడినందుకు వాంటెడ్ జాబితాలో చేర్చింది.[7][8]

అరెస్టు

[మార్చు]

2019 మొదట్లో లండన్లో టెలిగ్రాఫ్ పత్రిక నీరవ్ మోడీని ఇంటర్వ్యూ చేసి, అతను 73 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లో విలాసవంతంగా జీవిస్తూ వజ్రాల వ్యాపారం తిరిగి ప్రారంభించాడని ప్రచురించింది. భారత ప్రభుత్వం అతన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ పోలీసులు 2019 మార్చి 20న నీరవ్ మోడీని అరెస్టు చేశారు.[9]

మూలాలు

[మార్చు]
  1. "PNB will honour commitments to banks in LoU case". The Economic Times. 28 March 2018. Retrieved 1 June 2018.
  2. "PNB scam: CBI to file chargesheet against 19 accused by May 15". India Today (in ఇంగ్లీష్). Retrieved 1 June 2018.
  3. "A freshly appointed official first noticed the fraud at Punjab National Bank". Moneycontrol (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-02-15.
  4. Sahgal, Ram (22 May 2018). "Former MD of PNB was aware of Nirav Modi fraud, says CBI". The Economic Times. Retrieved 1 June 2018.
  5. "Video: India asks UK to help extradite Mallya, Lalit Modi, Nirav Modi : The Good, The Bad And The Ugly: Business Today". www.businesstoday.in. Retrieved 1 June 2018.
  6. "PNB fraud: ED to seek 'immediate confiscation' of Nirav Modi's assets under Fugitive Economic Offenders Ordinance - Firstpost". www.firstpost.com. Retrieved 1 June 2018.
  7. "- INTERPOL". www.interpol.int (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2018-07-10. Retrieved 2018-08-31.
  8. "- INTERPOL". www.interpol.int (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2018-07-10. Retrieved 2018-08-30.
  9. "నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?". బీబీసీ తెలుగు. 21 March 2019. Retrieved 23 March 2019.