పంజా
పులి, [1] సింహం వంటి బలమైన జంతువులు తమ ఆహారం కోసం జింక ఏనుగు వంటి అనేక రకాల జంతువులను తమ కాళ్లను ముఖ్యంగా ముందరి కాళ్లను విసరి వాటిని చంపడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధంగా ఒక జంతువు మరొక జంతువుపై దాడి చేసేటప్పుడు తమ కాళ్ల గోర్లు అవతలి జంతువు చర్మంపై బలమైన గాయాన్ని కలుగచేస్తాయి. అనగా ఒక జంతువు మరొక జంతువును చంపడానికి తన కాళ్లును బలంగా విసరడాన్ని పంజా విసరడం అంటారు. బలమైన, పదునైన గోర్లు, శక్తివంతమైన వేళ్లు కలిగిన జంతుపాదాన్ని పంజా అంటారు.
పంజా అనేది సంస్కృతం నుండి ఉద్భవించిన పదం, మనిషి చేతికి ఉన్న ఐదు వేళ్లు (పంచ వేళ్లు) నుంచే ఈ పంజా అనే పదం ఏర్పడింది. దీని అర్థం "చెయ్యి" లేదా "ఐదు వేళ్లు."[2] హిందీ, ఇతర భారతీయ భాషలలో, ఇది సాధారణంగా చెయ్యి లేదా అరచేతిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఇది కొన్నిసార్లు చేతి ఆకారాన్ని పోలిన ఐదు ప్రాంగ్‌లు లేదా వేళ్లతో కూడిన సాధనం లేదా పరికరాన్ని సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది. కొన్ని సందర్భాల్లో, "పంజా" అనేది ఒక నిర్దిష్ట రకమైన రెజ్లింగ్ కదలిక లేదా పట్టును సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది.
ఇతర వాడకం
[మార్చు]పంజా అనే పదాన్ని బలమైన దెబ్బకొట్టడం వంటి పదాలను ఉపయోగించే చోట ఉపయోగిస్తారు. ముఖ్యంగా వార్తలలో ఒక సందర్భాన్ని బలంగా సూచించుటకు "పంజా" అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు కొవిడ్ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపడంతో వార్తలలో "దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై కొవిడ్ పంజా" వంటి వాక్యాలను ఉపయోగించి వ్రాస్తుంటారు.[3] ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయినప్పుడు వార్తలలో "చలి పంజా" అనే పదాలను ఉపయోగిస్తుంటారు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ https://glosbe.com/te/en/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B0%BF%20%E0%B0%AA%E0%B0%82%E0%B0%9C%E0%B0%BE%7C పులి పంజా
- ↑ https://andhrabharati.com/dictionary/ నిఘంటుశోధన
- ↑ https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/123071463 దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై కొవిడ్ పంజా
- ↑ https://www.ntnews.com/karimnagar/falling-temperatures-in-the-combined-district-924507%7C చలి పంజా