Jump to content

పంకజ్ కుమార్ సింగ్

వికీపీడియా నుండి
పంకజ్ కుమార్ సింగ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 ఫిబ్రవరి 20

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2025 ఫిబ్రవరి 8
ముందు మహిందర్ యాదవ్
నియోజకవర్గం వికాస్‌పురి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రష్మి కుమారి
సంతానం భవ్య సింగ్, ప్రగ్యత సింగ్ (ఇద్దరు కుమార్తెలు)
వృత్తి రాజకీయ నాయకుడు

పంకజ్ కుమార్ సింగ్ (జననం 6 నవంబర్ 1977) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో వికాస్‌పురి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[1] 2025 ఫిబ్రవరి 20న చట్టం, శాసనసభ వ్యవహారాలు & గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పంకజ్ కుమార్ సింగ్ 1977 నవంబర్ 6న , బీహార్ రాష్ట్రం, బక్సర్ లో జన్మించాడు. ఆయన 1998లో బీహార్‌లోని బోధ్ గయలోని మగధ్ విశ్వవిద్యాలయం నుండి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. ఆయన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మాజీ అదనపు కమిషనర్ దివంగత రాజ్ మోహన్ సింగ్ కుమారుడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పంకజ్ కుమార్ సింగ్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వివిధ హోదాల్లో పని చేసి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో వికాస్‌పురి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి మహిందర్ యాదవ్‌పై 12,876 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3][4] 2025 ఫిబ్రవరి 20న చట్టం, శాసనసభ వ్యవహారాలు & గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Delhi Assembly Election Results 2025: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). The Indian Express. 8 February 2025. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  2. "Pankaj Singh takes oath as Delhi cabinet minister: 5 things to know about him" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  3. "Vikaspuri Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  4. "Delhi Assembly election 2025: Vikaspuri". Election Commission of India. 8 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  5. "परसों हुआ मां का निधन, आज दिल्ली में ली मंत्री पद की शपथ; जानें कौन है डॉ पंकज कुमार सिंह?". एबीपी लाइव. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  6. "कौन हैं पंकज कुमार सिंह जो बने रेखा सरकार में मंत्री?". India TV Hindi. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
  7. "Delhi CM Rekha Gupta's Cabinet: List of ministers and portfolios" (in ఇంగ్లీష్). CNBCTV18. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.