న్యాయ సేవలలో ఇ-పాలన
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
సుప్రీమ్ కోర్టు లో ఎలక్ట్రానిక్ విధానంలో దావా
[మార్చు]సుప్రీంకోర్ట్ కూడా ఇగవర్నెన్స్ బాట పట్టింది . భారతీయ పౌరుని ఇంటి ముంగిటికే కోర్ట్ సేవలు అందించడానికి సిద్ధ మైంది . ఈ విషయంగా 2006, అక్టోబరు 2వతేదీ నుంచి సుప్రీం కోర్ట్ ఇఫైలింగ్ సౌకర్యాన్ని ఆరంభించింది . ఎవరైనా సరే, ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ద్వారా అడ్వొకేట్ అవసరం లేకుండానే ఎలాంటి కేసునైనా ఇఫైలింగ్ చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని సామాన్య పౌరుడై నా, గుర్తింపున్న అడ్వొకేట్ అయినా వాడుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని వాడాలనుకొనేవారు https://web.archive.org/web/20160823152710/http://sc-efiling.nic.in/sc-efiling/index.html వెబ్పేజీని ¸ యాక్సెస్చేసి¸ యూజర్గా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫైలింగ్ తొలిసారిగా వాడేవారు కింది పద్ధతిని పాటించాలి.
- ఇఫైలింగ్ తొలిసారిగా వాడేవారు ‘Sign Up' ఆప్షన్ ద్వారా వారి పేరు నమోదు చేసుకోవాలి.
- ఇఫైలింగ్ ద్వారా సుప్రీంకోర్ట్లో కేసు నమోదును అడ్వొకేట్ ఆన్ రికార్డ్ కానీ, పిటిషనర్ స్వయంగా కానీ చేయాలి.
- ‘Advocate-on-Record’, ఆప్షన్ను కేవలం అడ్వొకేట్ ఆన్ రికార్డ్ మాత్రమే ఎంచుకోవాలి. పిటిషనర్ స్వయంగా నమోదు చేసేట్లయితే ‘In-person’ఆప్షన్ ఎంచుకోవాలి.
- తొలిసారిగా తమ పేరు నమోదు చేసేవారు వారి పేరు, అడ్ర స్, వివరాలు, ఇమెయిల్ ఐడి వగైరా సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది .
- అడ్వొకేట్ ఆన్ రికార్డ్ తమ కోడ్ ను¸ యూజర్ ఐడి గా ఇవ్వాలి. తొలిసారిగా తమ పేరు నమోదు చేసే పిటిషనర్లు మాత్రంవారి వివరాలన్నింటినీ పొందుపరిచాకే ¸ యూజర్ఐడి , పాస్వర్డ్లను క్రియేట్ చేస్తుంది .
- విజయవంతంగా లాగిన్ అయ్యాక డిస్క్లైమర్ స్క్రీన్ ఆప్షన్ మానిటర్పై కనిపిస్తుంది .
- దాన్ని చదివి ‘I agree’ బటన్ పై క్లిక్ చేశాకే ముందుకుపోవడానికి అనుమతి లభిస్తుంది . ‘I decline’ బటన్ పై క్లిక్ చేస్తే మాత్రం తిరిగి లాగిన్ స్క్రీన్ వస్తుంది .
- విజయవంతంగా లాగిన్ అయ్యాక ¸ యూజర్కు తన కేసుని ఎలక్ట్రానిక్గా ఫైల్ చేయడానికి అనుమతి లభిస్తుంది .
- ‘New Case’ ఆప్షన్ ద్వారా కొత్త కేసు ఫైల్ చేయవచ్చు
- ‘Modify’ ఆప్షన్ ద్వారా ఫైల్ చేసిన కేసు వివరాల్లో మార్పుచేర్పులు చేయవచ్చు. ఐతే కోర్టు ఫీజు వివరాలు అందించనంత వరకే ఇది వీలవుతుంది
- కోర్టు ఫీజుని కేవలం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే చెల్లించడానికి వీలౌతుంది
- ఫైల్ చేసిన కేసులో ఏవైనా లోపాలుంటే, ఆ పిటిషన్దారుకు లేదా అడ్వొకేట్కు ఇ-మెయిల్ ద్వారా సుప్రీం కోర్ట్ రిజిస్టరీ తెలియజేస్తుంది
- ఎలాటి సహాయం కావాలన్నా వెబ్సైట్లో ‘Help’ ఆప్షన్ ద్వారా పొంద వచ్చు
మరిన్ని వివరాలకు : https://web.archive.org/web/20160823152710/http://sc-efiling.nic.in/sc-efiling/index.html
కేస్ స్థితి
[మార్చు]కేసుల స్థితిని చెప్పే వెబ్సైట్ (http://www.casestatus.nic.in Archived 2020-11-23 at the Wayback Machine) లిటిగెంట్లకు, అడ్వొకేట్లకు సుప్రీం కోర్ట్లోవారి కేసులకు సంబంధించిన స్థితి అంటే, కేసు ముగింపు అయిందా, లేక పెండింగ్లో ఉందా అని ఇంటర్నెట్లో చెబుతుంది. ‘కేసు స్థితి’ అనేది కేసుల తాజా స్థితిని ముగించారా లేక వాయిదా వేసారా, కింది కోర్టు వివరాలు, పార్టీ పేరు, అడ్వొకేట్ల పేర్లు వగైరా సమాచారాన్ని చెబుతుంది. ఒక కేసు వేసిన మరుక్షణం ఆ కేసు స్థితిగతులను వబ్ లో తెలుసుకొనే వీలు ఏర్పడుతుంది. ‘కేసు స్థితి’ అనేది కొర్టు ఇప్పటిదాకా ఆ కేసుకు సంబంధించిన వెలువరించిన వివిధ ఆర్డర్లను కూడా తెలుపుతుంది. ఈ ‘కేసు స్థితి’ అనేది ప్రజలకెంతో సౌకర్యంగా మారిందని చెప్పడానికి వారినించి అందిన అనూహ్యమైన స్పందనే ఉదాహరణ. ఎందుకంటే, ఎక్కడికీ కదలనక్కరలేకుండా కూచున్నచోటే కేసు గురించి అన్ని వివరాలనూ తెలుసుకోగల్గుతున్నారు. దీనివల్ల పనిగట్టుకొని ఢిల్లీ దాకా వెళ్లే ఆగత్యం తప్పిపోయింది. ఇంటర్నెట్లో రోజువారీ తీర్పు ఆర్డర్లు
సుప్రీం కోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకుచెందిన రోజువారీ ఆర్డర్లు ఇకపై ఇంటర్నెట్లో (https://web.archive.org/web/20061113093834/http://dailyorders.nic.in/ ), లభ్యమౌతాయి. న్యాయమూర్తులు సంతకం చేసిన వెంఠనేలభ్యమయ్యే ఈ ఆర్డర్లు, ప్రజల సమాచార నిమిత్తం మాత్రమే పనికొస్తాయి. ఎటొచ్చీ ఆఫీసుపరంగా వచ్చే కాపీలు మామూలుగానే లిటిగెంట్లకు అందుతాయి. ఈ సేవ లిటిగెంట్లకు, అడ్వొకేట్లకు ఎంతో వినియోగపడుతోంది. సంబంధిత వివరాల డేటాబేస్ను ఆయా కోర్టులే నిర్వహించుకొంటాయి. ఒకే విషయానికి సంబంధించిన ఆర్డర్లను వెదకడానికి సెర్చి సౌకర్యం కూడా ఉంది. అలాగే కేసు సంఖ్య తెలీకపోయినా, పార్టీ పేరు తెలీకపోయినా కూడా సెర్చి చేసుకోవచ్చు. సుప్రీమ్ కోర్టులో దావాల పట్టిక చూసి తెలుసుకోవడం రోజువారీ విచారణకు వచ్చే కేసుల వివరాలను సుప్రీం కోర్టు వారానికిముందే ఆన్‌లైన్‌లో ( కంప్యూటర్‌ద్వారా తెలుసుకోవడానికి వీలుగా ఇంటర్నెట్‌లో ) వుంచుతుంది. కంప్యూటర్‌లో, https://web.archive.org/web/20140118211212/http://causelists.nic.in/scnew/index1.html అనే, వెబ్‌సైట్ చిరునామాను టైప్‌చేసి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ కాజ్ లిస్ట్ పేజి (భారత సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే కేసుల పేజి) నుంచి, ఈ కేసుల సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చును. భారత సుప్రీం కోర్టు రోజువారీ చేపట్టే కేసుల వివరాలను ఇలా తెలుసుకోండి: ముందుగా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ కాజ్ లిస్ట్స్ పేజిలో డెయిలీ కాజ్ లిస్ట్ అనే వర్గీకరణ కింద, తేదీలను పొందుపరచిన గడిలో కావలసిన తేదీని ఎంచుకుని, గో అనే దానిపై క్లిక్ చేయండి. విచారణకు చేపట్టే కేసుల వివరాలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడి వుంటాయి:
- న్యాయస్థానం (కోర్టు) వారీగా
- న్యాయవాది వారీగా
- కేసు నంబరు వారీగా
- న్యాయమూర్తి (జడ్జి) వారీగా
- వాది / ప్రతివాది వారీగా
న్యాయస్థానం (కోర్టు) వారీగా కేసు వివరాలను తెలుసుకోవాలంటే:
[మార్చు]కోర్ట్‌వైజ్ అనే చోట క్లిక్‌చేయండి సెలెక్ట్ ది కోర్ట్ నంబర్ అనే గడితోవున్న పేజి వస్తుంది. దాని పక్క గడిలో కోర్టు నంబర్లు వుంటాయి. ఆ గడికి ఆనుకునివున్న బాణంగుర్తుపై క్లిక్‌చేయడంద్వారా కావలసిన కోర్టు నంబరును ఎంపిక చేసుకోవచ్చు.ఆ తర్వాత సబ్మిట్ అనేదానిపై క్లిక్ చేయాలి
న్యాయవాదివారీగా కేసు వివరాలను తెలుసుకోవాలంటే:
[మార్చు]లాయర్‌వైజ్ అనే చోట క్లిక్‌చేయండి లాయర్ అనే గడితోవున్న పేజి వస్తుంది. ఆ గడిలో లాయర్ పేరు టైప్ చేసి, సబ్మిట్ అనేదానిపై క్లిక్ చేయాలి
33957
[మార్చు]కేసు నంబర్ అనేచోట క్లిక్ చేయండి కేసు నంబర్ అనే గడితోవున్న పేజి వస్తుంది. ఆ గడిలో కేసు నంబరును టైప్ చేసి, ఆ తర్వాత సబ్మిట్ అనేదానిపై క్లిక్ చేయాలి
న్యాయమూర్తివారీగా తెలుసుకోవాలంటే:
[మార్చు]జడ్జివైజ్ అనేచోట క్లిక్ చేయండి సెలెక్ట్ ది జడ్జి నేం అనే గడితోవుండే పేజి వస్తుంది. పక్కనే న్యాయమూర్తుల పేర్లు పొందుపరచిన గడినుంచి కావలసిన న్యాయమూర్తిపేరును ఆ గడిని ఆనుకునివున్న బాణంగుర్తుపై క్లిక్ చేయడంద్వారా ఎంపికచేసుకుని, తరువాత, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
వాది / ప్రతివాది వారీగా తెలుసుకోవాలంటే:
[మార్చు]రెస్పాండెంట్ / పిటిషనర్ వైజ్ అనేచోట క్లిక్ చేయండి. రెస్పాండెంట్ / పిటిషనర్ అనే గడితోవుండే పేజి వస్తుంది. ఆ గడిలో వాది లేదా ప్రతివాది పేరును టైప్‌చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
విచారణకు చేపట్టే అన్ని కేసుల వివరాలు తెలుసుకోవాలంటే:
[మార్చు]ఎంటైర్ కాజ్‌లిస్ట్ అనే దానిపై క్లిక్ చేయండి సుప్రీమ్ కోర్టులో దావా స్ధాయి చూసి తెలుసుకోవడం ఇది, భారత సుప్రీం కోర్టులో పెండింగ్‌లోవున్న కేసుల, తీర్పువెలువడినకేసుల వివరాలను న్యాయవాదులు, కక్షిదారులు, కిందికోర్టుల న్యాయమూర్తులు తెలుసుకోవడానికి వీలుగా రూపొందించిన సమాచార సాధనం. ==కేసుల వివరాలను ఈ క్రింది వర్గీకరణలో పొందవచ్చును.==
- కేసు నంబరు ప్రకారం
- టైటిల్ ప్రకారం (వాది లేదా ప్రతివాది పేరునుబట్టి)
- న్యాయవాది పేరు ప్రకారం
- హైకోర్టు నంబరు ప్రకారం
- డైరీ నంబరు ప్రకారం
కంప్యూటర్‌లో http://www.courtnic.nic.in/courtnicsc.asp Archived 2014-01-06 at the Wayback Machine అనే చిరునామాను టైప్ చేసి క్లిక్ చేస్తే, సుప్రీంకోర్టు కేసు స్టేటస్ పోర్టల్ అనే పేజి కనిపిస్తుంది. కేసుదశకు సంబంధించి పైన పేర్కొన్న వర్గీకరణ అంశాలు పేజికి ఎడమవైపున ఒక పట్టికలో పొందుపరచి వుంటాయి. వాటినుంచి ఈ కింద పేర్కొనే విధంగా మీరు కేసు ఏ దశలో వున్నదీ తెలుసుకోవచ్చు
కేసు నంబరు ప్రకారం:
[మార్చు]- కేసు నంబర్ అనేచోట మీరు క్లిక్ చేయగానే, కేసు టైప్ (కేసు ఏ రకానికి చెందినది) అనే గడి కనిపిస్తుంది. ఆ గడిపక్కనే వుండే బాణంగుర్తుపై క్లిక్‌చేసి, ఏ రకానికి చెందిన కేసో ఎంపికచేసుకోవాలి
- కేసు నంబర్ అనే గడిలో కేసునంబర్ టైప్ చేయాలి
- ఇయర్ (సంవత్సరం) అనే గడిపక్కనవున్న బాణంగుర్తుపై క్లిక్‌చేసి, ఏ సంవత్సరమో ఎంపికచేసుకుని, సబ్మిట్ అనేచోట క్లిక్ చేయాలి
టైటిల్ ప్రకారం (వాది లేదా ప్రతివాది పేరునుబట్టి):
[మార్చు]టైటిల్ అనేచోట మీరు క్లిక్‌చేయగానే, పిటిషనర్ (వాది) లేదా రెస్పాండెంట్ (ప్రతివాది) పేరు అనే గడి కనిపిస్తుంది. ఆ గడిలో, వాది లేదా ప్రతివాది పేరు టైప్‌చేయాలి దాని దిగువనవున్న గడి పక్కనున్న బాణంగుర్తుపై క్లిక్‌చేస్తే, డోంట్ నో (తెలియదు) పిటిషనర్ (వాది) రెస్పాండెంట్ (ప్రతివాది) అనే మూడు అంశాలు కనిపిస్తాయి. వాటిలో, సంబంధించిన ఒకదానిపై క్లిక్ చేయాలి దిగువన, ఇయర్ (సంవత్సరం) అనే చోట, బాణంగుర్తుపై క్లిక్‌చేసి, ఏ సంవత్సరమో ఎంపికచేసుకుని, సబ్మిట్ అనేచోట క్లిక్ చేయాలి
న్యాయవాది పేరు ప్రకారం:
[మార్చు]- అడ్వొకేట్ అనేచోట క్లిక్ చేస్తే, అడ్వొకేట్‌నేం అనే గడి కనిపిస్తుంది.అక్కడ న్యాయవాది పేరు టైప్ చేయాలి.
- ఆ పక్కనే, ఇయర్ అనే గడిని ఆనుకునివున్న బాణంగుర్తుపై క్లిక్‌చేసి, ఏ సంవత్సరమో పేర్కొని, సబ్మిట్ అనేచోట క్లిక్ చేయాలి.
హైకోర్టు నంబరు ప్రకారం:
[మార్చు]- హైకోర్టు నంబర్ అనేచోట క్లిక్ చేస్తే, స్టేట్ అనే గడి కనిపిస్తుంది. ఆ గడిలో వుండే బాణంగుర్తుపై క్లిక్‌చేసి, మీ రాష్ట్రమేదో పేర్కొనాలి
- లోవర్‌కోర్ట్ నంబర్ అనే గడిలో దిగువకోర్టు నంబర్ టైప్ చేయాలి
- డేట్ ఆఫ్ జడ్జిమెంట్ అనే దాని దిగువనవున్న గడులలో బాణం గుర్తుతో, తీర్పుచెప్పిన తేది, నెల, సంవత్సరం పేర్కొని, సబ్మిట్ అనేచోట క్లిక్ చేయాలి
డైరీ నంబరు ప్రకారం:
[మార్చు]- డైరీ నంబర్ అనేచోట క్లిక్‌చేస్తే కనిపించే గడిలో డైరీ నంబర్ టైప్‌చేయాలి
- ఏ సంవత్సరమో పేర్కొనాలి
సుప్రీం కోర్టు తీర్పులను తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోండి ఇలా...! సుప్రీంకోర్టు తీర్పులు, వివిధ హైకోర్టుల తీర్పులను కోర్టు తీర్పుల సమాచార సాధనం (ది జడ్జిమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జుడిస్) పేరిట అందుబాటులో వుంచారు. కంప్యూటర్‌లోhttp://judis.nic.in/supremecourt/chejudis.asp Archived 2014-01-03 at the Wayback Machine అనే చిరునామాను టైప్ చేసి, జడ్జిమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జుడిస్) అనే వెబ్‌సైట్‌నుంచి తీర్పులకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చును. ఈ కింది వర్గీకరణ ప్రకారం తీర్పుల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
- పిటిషనర్ (వాది) / రెస్పాండెంట్ ( ప్రతివాది) పేరిట
- న్యాయమూర్తి పేరిట
- కేసు నంబర్ ప్రకారం
- తీర్పు వెలువడిన తేదీ ప్రకారం
- రాజ్యాంగ ధర్మాసనం (కాన్స్టిట్యూషనల్ బెంచ్) ప్రకారం
- కేసుల అక్షర క్రమంలో
- హక్కు, యాజమాన్యం ప్రకారం
- తీర్పు పాఠంలోని కొంత భాగాన్ని పేర్కొనడంద్వారా
- ఏ చట్టానికి సంబంధించి ఎలాంటి తీర్పు... మొదలైన విధాలుగా
పైన పేర్కొన్న అంశాలన్నీ, కంప్యూటర్ తెర పై కనిపించే, ది జడ్జిమెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జుడిస్) వెబ్‌సైట్ పేజీలో పైభాగంలో ఎడమవైపున వరుసగా పొందుపరచబడి వుంటాయి. వీటిలో దేనినిగురించి తెలుసుకోవాలనుకుంటే, దానిపై క్లిక్ చేయడంద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చును.
పిటిషనర్(వాది) / రెస్పాండెంట్( ప్రతివాది) పేరిట
[మార్చు]- వాది లేదా ప్రతివాది పేరును పేర్కొనండి
- దిగువ గడిలోని డోంట్ నో (తెలియదు), పిటిషనర్ (వాది), రెస్పాండెంట్ (ప్రతివాది) అనే అంశాలలో ఒకదానిని పేర్కొనండి
- దిగువ గడులలో ఏ తేదీనుంచి, ఏ తేదీ వరకు అనే వివరం పేర్కొనండి
- చివరగా, రిపోర్టబుల్ స్టేటస్ అనే గడిలో, రిపోర్టబుల్, నాన్ రిపోర్టబుల్, లేదా ఆల్ (అన్నీ) అనే మూడిటిలో ఒకదానిని పేర్కొని, సబ్మిట్ అనే చోట క్లిక్ చేయాలి
న్యాయమూర్తి పేరుతో
[మార్చు]- జడ్జి పేరు పేర్కొనండి
- దిగువ గడులలో ఏ తేదీనుంచి, ఏ తేదీ వరకు అనే వివరం పేర్కొనండి
- చివరగా, రిపోర్టబుల్ స్టేటస్ అనే గడిలో, రిపోర్టబుల్, నాన్ రిపోర్టబుల్, లేదా ఆల్ (అన్నీ) అనే మూడిటిలో ఒకదానిని పేర్కొని, సబ్మిట్ అనే చోట క్లిక్ చేయాలి
కేసు నంబర్ ప్రకారం
[మార్చు]- కేసు ఏ రకానికి చెందినదో గడిలోని బాణం గుర్తుపై క్లిక్ చేసి ఎంపిక చేయాలి
- కేసు నంబర్ పేర్కొనండి
- దిగువ గడిలో, ఏ సంవత్సరమో బాణంగుర్తుపై క్లిఖ్ చేసి, పేర్కొనండి
- చివరగా, రిపోర్టబుల్ స్టేటస్ అనే గడిలో, రిపోర్టబుల్, నాన్ రిపోర్టబుల్, లేదా ఆల్ (అన్నీ) అనే మూడిటిలో ఒకదానిని పేర్కొని, సబ్మిట్ అనే చోట క్లిక్ చేయాలి .
జడ్జిమెంట్ తేదీ ప్రకారం
[మార్చు]- పక్క గడిలోని బాణం గుర్తుపై క్లిక్‌చేసి, ఏ తేదీనుంచి, ఏ తేదీవరకో పేర్కొనండి.
- చివరగా, రిపోర్టబుల్ స్టేటస్ అనే గడిలో, రిపోర్టబుల్, నాన్ రిపోర్టబుల్, లేదా ఆల్ (అన్నీ) అనే మూడిటిలో ఒకదానిని పేర్కొని, సబ్మిట్ అనే చోట క్లిక్ చేయాలి .
రాజ్యాంగ ధర్మాసనం (కాన్‌స్టీట్యూషనల్ బెంచి) ప్రకారం
[మార్చు]- గడిలోని బాణం గుర్తుపై క్లిక్‌చేసి, ఏ తేదీనుంచి, ఏ తేదీవరకో పేర్కొనండి.
- చివరగా, రిపోర్టబుల్ స్టేటస్ అనే గడిలో, రిపోర్టబుల్, నాన్ రిపోర్టబుల్, లేదా ఆల్ (అన్నీ) అనే మూడిటిలో ఒకదానిని పేర్కొని, సబ్మిట్ అనే చోట క్లిక్ చేయాలి.
కేసుకు సంబంధించిన విషయ సూచికలో, అక్ష్ర క్రమం ప్రకారం
[మార్చు]- వాది, లేదా ప్రతివాది పేరును పేర్కొనండి
- గడిలోని బాణం గుర్తుపై క్లిక్‌చేసి, ఏ తేదీనుంచి, ఏ తేదీవరకో పేర్కొనండి.
- చివరగా, రిపోర్టబుల్ స్టేటస్ అనే గడిలో, రిపోర్టబుల్, నాన్ రిపోర్టబుల్, లేదా ఆల్ (అన్నీ) అనే మూడిటిలో ఒకదానిని పేర్కొని, సబ్మిట్ అనే చోట క్లిక్ చేయాలి .
ఇవే కాకుండా, అధికారిక యాజమాన్యం, తీర్పుపాఠంలోని కొంతభాగాన్ని పేర్కొనడం, ఏ చట్టానికి సంబంధించి ఎలాంటి తీర్పు... సైటేషన్ మొదలైన విధాలుగాకూడా ఈ సమాచారాన్ని పొందవచ్చును. సుప్రీంకోర్టు మధ్యతరహా ఆదాయవర్గం న్యాయ సహాయ పథకం
(సుప్రీంకోర్ట్ మిడిల్ ఇన్‌కం గ్రూప్ లీగల్ ఎయిడ్ స్కీం) పథకాన్ని గురించిసుప్రీం కోర్టు మధ్య తరహా ఆదాయ వర్గం న్యాయ సహాయ పథకం అనేది, మధ్య తరహా ఆదాయం (నెలకు20, 000రూపాయలు లేదా సంవత్సరానికి2,40,00రూపాయలు) కలిగిన పౌరులకు న్యాయ సేవలు అందించడానికి ఉద్దేశించిన పథకం. తగిన కొన్ని కేసుల విషయంలో, నెలకు25,000రూపాయలు, లేదా సంవత్సరానికి3,00,000రూపాయలు సంపాదించే దరఖాస్తుదారునుకూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందడనికి అనుమతిస్తారు. ఈ పథకం స్వయం పోషకత్వం కలిగినది; పథకం ప్రారంభ పెట్టుబడిని మొదటి ఎగ్జిక్యూటివ్ కమిటి సమకూర్చవలసి వుంటుంది. ఈ పథకం వర్తించే కేసులు
సుప్రీం కోర్టులో దాఖలుచేయాలనుకునే కేసులు సుప్రీంకోర్టు న్యాయ విచారణ పరిథికి సంబంధించిన ఈ కింది కేసులకు ఈ పథకం వర్తించదు. కస్టమ్స్ చట్టం-1962 లోని 130 ఏ సెక్షన్ లో పేర్కొన్నవి సెంట్రల్ ఎక్సైజ్, సాల్ట్ చట్టం-1944లోని 35 హెచ్ సెక్షన్ లో పేర్కొన్నవి స్వర్ణ (నియంత్రణ) చట్టం-1968లోని 82 సి సెక్షన్ లో పేర్కొన్నవి ఎం.ఆర్.టి.పి చట్టం-1969 లోని సెక్షన్ 7 (2) లో పేర్కొన్నవి ఆదాయం పన్ను చట్టం-1961లోని 25 జె సెక్షన్‌లో పేర్కొన్నవి రాజ్యాంగం లోని 317 (ఇ) ఆర్టికల్‌లో పేర్కొన్నవి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం-1952లోని 3వ భాగంలో పేర్కొన్నవి ఎన్నికల న్యాయ సూత్రంలో పార్లమెంటు సభ్యుల, రాష్ట్ర శాసన సభల సభ్యుల ఎన్నికకు సంబంధించి పేర్కొన్నవి ఎం.ఆర్.టి.పి చట్టం-1969 లోని 55 వ సెక్షన్ లో అప్పీల్ విషయమై పేర్కొన్నవి కస్టమ్స్ చట్టం -1962 లోని 130 ఇ సెక్షన్ క్లాజ్ బిలో అప్పీల్ విషయమై పేర్కొన్నవి సెంట్రల్ ఎక్సైజ్, సాల్ట్ చట్టం-1944లోని సెక్షన్ 35 ఎల్‌లో అప్పీలు విషయమై పేర్కొన్నవి సమీక్షకు సంబంధించిన విషయాలు
న్యాయ సహాయం ఎప్పుడు కోరవచ్చు
[మార్చు]సుప్రీం కోర్టులో వ్యాజ్యం నడపదలచుకున్న వ్యక్తి మధ్య తరహా ఆదాయ వర్గం సొసైటీని రెండు సందర్భాలలో న్యాయసహాయంకోసం అడగవచ్చు ; అవి: సుప్రీం కోర్టులో కేసు దాఖలుచేయడానికి, తన తరఫున కేసు వాదించడానికి. కేసు అంటే, ఈకింది అంశాలన్నీ వర్తిస్తాయి:
- అప్పీలు / హైకోర్టు తీర్పుపై దాఖలుచేసే, సివిల్ లేదా క్రిమినల్ స్పెషల్ లీవ్ పిటిషన్లు
- రిట్ పిటిషన్ / హిబియస్ కార్పస్,
- ఇండియాలో ఒక రాష్ట్రంలో విచారణలోవున్న, సివిల్ లేదా క్రిమినల్ కేసును మరొక రాష్ట్రానికి బదిలీ కోసం పెట్టుకునే పిటిషన్
- సుప్రీం కోర్టులో నడిపించడలచుకున్న కేసునుగురించి న్యాయపరమైన సలహా
ఈ పథకం ఎలా పనిచేస్తుంది
[మార్చు]- ఈ పథకం ప్రకారం, సుప్రీం కోర్టు మధ్యతరహా ఆదాయ వర్గం సొసైటీలో అడ్వొకేట్ ఆన్ రికార్డ్ తో సహా, న్యాయవాదుల బృందమొకటి వుంటుంది. ఈ న్యాయవాదుల బృందాన్ని (ప్యానల్ ) ఏర్పాటుచేసే సమయంలో, ఇండియాలోని దిగువకోర్టులో కేసు వ్యవహారం చూడడానికి వీలుగా, ప్రాంతీయ భాష తెలిసిన కనీసం ఒక న్యాయవాది (ఇద్దరికి మించకుండా) వుండేలా శ్రద్ధవహించారు.
- ఈ పథకంకింద ఏదైనా కేసు తమకు అప్పగిస్తే, తాము ఈ పథకం నియమనిబంధనలకు లోబడి నడచుకుంటామని, ఈ ప్యానల్ లోకి తీసుకునే న్యాయవాదులు లిఖితపూర్వకంగా తమ ఆమోదం తెలియజేయవలసి వుంటుంది.
- సొసైటీకి చెందిన న్యాయవాదుల ప్యానల్‌నుంచి, దరఖాస్తుదారు కోరుకునే క్రమంలో, ముగ్గురు న్యాయవాదుల పేర్లజాబితాను ప్యానల్‌కమిటీ రూపొందిస్తుంది. అడ్వొకేట్ ఆన్ రికార్డ్, లేదా, కేసువాదించే న్యాయవాది, లేదా సీనియర్ న్యాయవాదితో సహా ముగ్గురి పేర్లను దరఖాస్తుదారు కోరుకోవచ్చు. దరఖాస్తుదారు కోరికను మన్నించడానికి కమిటీ ప్రయత్నిస్తుంది.
- కేసును ప్యానెల్‌లోని ఏ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ / కేసును వాదించే న్యాయవాది, సీనియర్ న్యాయవాదికి అప్పగించే స్వేచ్ఛ కమిటీకి వుంటుంది. అయితే, ఈ పథకం కింద కేసును ఏ అడ్వొకేట్ ఆన్ రికార్డ్ లేదా, కేసును వాదించే న్యాయవాది లేదా, సీనియర్ న్యాయవాదికి అప్పగించే చిట్టచివరి నిర్ణయాధికారం సుప్రీంకోర్టు ( మధ్య తరహా ఆదాయ వర్గం) న్యాయ సహాయ సొసైటీకే వుంటుంది. న్యాయ సహాయంకోసం ఎక్కడ సంప్రతించాలి
- న్యాయ సహాయం కోరే కక్షిదారు, నిర్దేశిత దరఖాస్తు పత్రాన్ని పూర్తిచేసి, సంబంధిత పత్రాలను జతపరచి, ఆ పత్రాలన్నిటిని ఈ పథకం సెక్రెటరీకి (సుప్రీం కోర్ట్ మిడిల్ ఇన్‌కం గ్రూప్ లీగల్ ఎయిడ్ సొసైటీ,109- లాయర్స్ చేంబర్స్, పోస్టాఫీస్ వింగ్, సుప్రీం కోర్ట్ కాంపౌండ్, న్యూఢిల్లీ-110001) అందజేయవలసి వుంటుంది.
- దరఖాస్తుదారునుంచి దరఖాస్తు అందినమీదట, న్యాయ సహాయ సొసైటీ, ఆ కేసు పత్రాలను అడ్వొకేట్ ఆన్ రికార్డ్‌కు పంపించి; ఆ కేసును పరిశీలించి, అది తగిన కేసు అని సంతృప్తిచెందితే, తదనంతర చర్యలు తీసుకోవలసిందిగా కోరుతుంది.
- ఈ పథకం ప్రయోజనం పొందడానికి దరఖాస్తుదారుకు అర్హతవుందా లేదా అనే విషయంలో, అడ్వొకేట్ ఆన్ రికార్డ్ వెలిబుచ్చే అభిప్రాయమే తుది నిర్ణయంగా పరిగణిస్తారు. కేసు పత్రాల విషయంలోకాని, దానికి జతపరిచే పత్రాల విషయంలోకాని అలా వ్యక్తమయ్యే అభిప్రాయాన్నిబట్టి, సుప్రీంకోర్టు మధ్యతరహా ఆదాయవర్గం న్యాయ సహాయ సొసైటీ, దరఖాస్తుదారుకు ఆ పత్రాలను తిరిగి ఇచ్చివేసి, సర్వీస్ చార్జీలకింద 350 రూపాయలను మినహాయించుకుంటుంది. న్యాయ సహాయానికి చెల్లించవలసిన రుసుము
- సెక్రెటరీ సూచించిన సుంకం మొత్తాన్ని దరఖాస్తుదారు డిపాజిట్ చేయవలసి వుంటుంది. ఈ పథకానికి జతపరచిన షెడ్యూల్ ప్రకారం ఆ సుంకం వుంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే, సెక్రెటరీ ఆ కేసును ఎంఐజి న్యాయ సహాయ పథకం కింద నమోదుచేసి, ఆ కేసు పత్రాలను ప్యానల్‌లోని అడ్వొకేట్ ఆన్ రికార్డ్/ కేసును వాదించే న్యాయవాది / సీనియర్ న్యాయవాదికి వారి అభిప్రాయం తెలియజేయడంకోసం పంపుతారు.
- ఫీజు అంచనా వివరాల ఆధారంగా సెక్రెటరీ తెలియజేసే సుంకం మొత్తాన్ని నగదు రూపంలోనో, బ్యాంకు డ్రాఫ్‌ట్ రూపంలోనో చెల్లించవలసి వుంటుంది.
- ప్రారంభంలో, ఫారాల ముద్రణ, తదితరమైన కార్యాలయ ఖర్చులను పథకం ప్రారంభ మూలధనంనుంచి భరిస్తారు
దరఖాస్తుదారులనుంచి కావలసిన పత్రాలు
[మార్చు]- దరఖాస్తుదారులు పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలతోపాటు, కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ఎంఐజి సొసైటీ కార్యదర్శికి సమర్పించవలసి వుంటుంది. ఉదాహరణకు, దరఖాస్తుదారు హైకోర్టు తీర్పుపై అప్పీలు దాఖలుచేయదలచుకుంటే, హైకోర్టు తీర్పు ధ్రువీకరించిన కాపీ, హైకోర్టులో దరఖాస్తుదారు దాఖలుచేసిన పిటిషన్ కాపీ, దిగువకోర్టుల తీర్పులు / ఆదేశాల కాపీలు, ఇతర సంబంధిత పత్రాలను సమర్పించవలసివుంటుంది. ఇవి ఇంగ్లీషులోకాకుండా ఇతర భాషలలో వుంటే, ఇంగ్లీషులోకి తర్జుమాచేసిన కాపీలనే సమర్పించాలి.
- ఫీజుల పట్టికకు అనుగుణంగా, సెక్రెటరీ అంచనావేసిన ప్రకారం అవసరమైన ఫీజు, ఇతర ఖర్చులకు చెల్లింపులు
వనరులు
[మార్చు]http://te.pragatipedia.in/e-governance/online-legal-services/how-do-i-do[permanent dead link]