నేహాల్ చుడాసమా
అందాల పోటీల విజేత | |
జననము | నేహాల్ చుడాసమా 1996 ఆగస్టు 22 ముంబై, భారతదేశం |
---|---|
విద్య | సెయింట్ రాక్స్ స్కూల్,[1] ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ |
పూర్వవిద్యార్థి | ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్[1] |
వృత్తి | మోడల్, టీవి హోస్ట్ |
బిరుదు (లు) | మిస్ యూనివర్స్ ఇండియా 2018 |
ప్రధానమైన పోటీ (లు) |
|
నేహాల్ చుడాసమా (ఆంగ్లం: Nehal Chudasama; జననం 1996 ఆగస్టు 22) భారతీయ మోడల్, ఫిట్‌నెస్ కన్సల్టెంట్, అందాల పోటీ టైటిల్‌హోల్డర్.[2] ఆమె మిస్ దివా యూనివర్స్ 2018 కిరీటాన్ని పొందింది. అలాగే, ఆమె మిస్ యూనివర్స్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[3] ఆమె గుజరాత్‌లో కనిపించే కోలీ సామాజికి వర్గానికి చెందినది.[4][5]
ప్రస్థానం
[మార్చు]2018లో, ఆమె ఫెమినా మిస్ గుజరాత్ టైటిల్ కోసం ఆడిషన్ చేసింది, అక్కడ ఆమె టాప్ 3 ఫైనలిస్ట్‌లలో ఒకరు.[6] తరువాత, అదే సంవత్సరం, ఆమె మిస్ దివా - 2018 పోటీలో పాల్గొని మిస్ దివా యూనివర్స్ 2018 టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె అవుట్‌గోయింగ్ టైటిల్ హోల్డర్ శ్రద్ధా శశిధర్ చేత కిరీటం పొందింది.[7] ఆమె 'మిస్ బాడీ బ్యూటిఫుల్', 'మిస్ మల్టీమీడియా' అనే ఉపశీర్షికలను కూడా గెలుచుకుంది. 2018 డిసెంబరు 17న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2018 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, కానీ టాప్ 20లో చేరలేదు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Miss Universe 2018: Mumbai girl Nehal Chudasama to represent India". Zee News. 1 September 2018.
- ↑ "Nehal Chudasama's weight loss journey is mind-blowing". 6 September 2018.
- ↑ "Mumbai's Nehal Chudasama is Yamaha Fascino Miss Diva Universe 2018". Times of India. 1 September 2018.
- ↑ "Bollywood Model Nehal Chudasama Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-10-12.
- ↑ AllGlobal.net. "Nehal Chudasama information". Global Information Lookup (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-12.
- ↑ "Femina Miss India 2018: Gujarat Auditions". Indiatimes. 13 May 2018.
- ↑ "Miss Universe 2018: Nehal Chudasama to represent India", Hindustan Times, 1 September 2018