నేత్ర రఘురామన్
స్వరూపం
నేత్ర రఘురామన్ | |
---|---|
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1997–2016 |
జీవిత భాగస్వామి | కునాల్ గుహా (m. 2011) |
నేత్ర రఘురామన్ ఒక భారతీయ టీవి, సినిమా నటి, మోడల్. 1997లో ఫెమినా మ్యాగజైన్ కోసం లుక్ ఆఫ్ ది ఇయర్ పోటీ విజేతగా ఎంపికైంది.[1] 2000లో స్టార్ స్క్రీన్ అవార్డ్స్‌లో ఉత్తమ తొలిచిత్ర నటి టైటిల్‌ను కూడా గెలుచుకుంది.[2] గోవింద్ నిహలానీ రచించిన తక్షక్, డేవిడ్ లించ్ తీసిన భోపాల్ ఎక్స్‌ప్రెస్ సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. 2008లో టీవి రియాలిటీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 1 ని గెలుచుకున్నది.[3]
జననం
[మార్చు]నేత్ర రఘురామన్ తమిళ అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, భారత క్రికెటర్ సుబ్రత గుహ కుమారుడు కునాల్ గుహాను 2011లో వివాహం చేసుకుంది.[5]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
1999 | తక్షక్ | నిషి |
1999 | భోపాల్ ఎక్స్‌ప్రెస్ | తార |
2001 | అవగత్ | సుధ |
2001 | మజును | "మెర్క్యురీ మేలే" పాటలో ప్రత్యేక ప్రదర్శన |
2004 | ఇంతేకం - ది పర్ఫెక్ట్ గేమ్ | డా. మెహక్ |
2004 | చోట్- అజ్ ఇస్కో, కల్ టెరెకో | ఇన్‌స్పెక్టర్ మాల్తీ దేశాయ్ |
2005 | తుమ్...హో నా! | అంజలి జె. వాలియా |
2006 | హుస్న్ - ప్రేమ అండ్ బిట్రేయల్ | త్రిష |
2016 | భాగ్య న జానే కోఈ | బుధియా |
టెలివిజన్
[మార్చు]- 2008: ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 1 (విజేత)
- 1999: కెప్టెన్ వ్యోమ్ (నైనా)
మూలాలు
[మార్చు]- ↑ Rajwade, Gayatri (2005-11-13). "Model lives". The Tribune. Chandigarh, India: The Tribune Trust. Retrieved 2023-01-30.
- ↑ "Personal agenda". The Hindustan Times. Delhi, India: HT Media Limited. 2009-11-28. Archived from the original on 2011-06-05. Retrieved 2023-01-30.
- ↑ Rao, Ashok (2008-08-18). "Nethra Is The Winner Of 'Khatron Ke Khiladi' On Colors". Top News. Retrieved 2023-01-30.
- ↑ "Rediff On The Net, Movies: Meet Nethra Raghuraman, Supermodel and Bollywood wannabe". m.rediff.com. Retrieved 2023-01-30.
- ↑ Pradhan,Bharati S. (4 March 2012). "Two weddings, and one story". The Telegraph. Retrieved 2023-01-30.