Jump to content

నూవు కుటుంబము

వికీపీడియా నుండి
తెల్లని నువ్వు గింజలు.

ఈ కుటుంబములో గుల్మములు, చిన్న గుబురు మొక్కలే గాని పెద్ద చెట్లు లేవు. ఆకులు ఒంటరి చేరిక, కొన్ని సమాంచలము కొన్నిటి అంచున రంపపు పండ్లున్నవి. కొన్ని తమ్మెలుగా చీలి యున్నవి. పువ్వులొక్కక కణుపు సందు నొక్కక్కటి యున్నవి. అసరాళము. పుష్ప కోశము సంయుక్తము. నాలుగో అయిదో తమ్మెలు గలవు. దళ వలయము గొట్టము వలె నున్నది దీని తమ్మెలు మొగ్గలో అల్లుకొని యుండును. కింజల్కములు నాలుగు. రెండు పెద్దవి. రెండు చిన్నవి. అండాశయము లుచ్చము రెండు గదులు గలవు. కీలాగ్రమునకు రెండు తమ్మెలు గలవు.

నూవు మొక్క మీది యాకులన్నియు నొక రీతిని లేవు. పై భాగమందున్నవి నిడివి చౌకపాకారము. సమాచలము. అడుగున నున్నవి అండాకారము, వీని యంచున రంపపు పండ్లున్నవి. మన దేశములో నూవులను ఉష్ణ ప్రదేశములలో శీతాకాలమందును, శీతల ప్రదేశములందు వేసవి కాలమందును సేద్యము చేయుదురు. వీనికి మిక్కిలి సార వంతమగు ఒండ్రు మట్తి నేలయు, విస్తారము నీరును కావలయును. నూవు పంట భూసారమును లాగి వేయును గనుక సాధారణ భూములందు వేయరు. వీనిని ప్రత్యేకముగా నైనను ప్రత్తి మొదలగు వానితో గలిపి యైన పండింతురు. కొన్ని చోట్ల తెల్లని నువ్వులు కూడా ఉన్నాయి. చెన్న రాజ్యమందు నూవు పంట గోదావరి విశాఖ పట్టణం, సేలము, కోయంబత్తూరు, ఉత్తరార్కాటు జిల్లాలో మాత్రము గలదు. నూవు పైరు చల్లిన మూడు మాసములకే పంటకు వచ్చును.

నువ్వుల నూనెను మనము విస్థరముగా వాడు చున్నాము. నువ్వులనే గానుగాడి నూనె తీయుచున్నారు గాని నూవు పప్పునూనె మంచిది. వేరు శనగ నూనె యంతకంటె చౌకగుటచే దీనిని మంచి నూనెలో కలుపు చున్నారు. సువాసన నూనెలకును నువ్వుల నూనేనె ఉపయోగించు చున్నారు. ఒక వరుస మల్లి పువ్వులను, దానిపైన నువ్వులను, వీనిపైన మల్లిపువ్వులను ఈ రీతిని పేర్చి మూత వేసి ఒక పూట యుంచినచో మల్లి వాసన నువ్వులకు పట్టును. ఈ నువ్వుల నూనెకును మల్లి పువ్వుల వాసన యుండును. ఈ రీతినే కొన్ని తోట్ల చేస్తున్నారు.

నువ్వుల పైరు వలన మన దేశమున లాభము గలుగు చున్నది. ఇంగ్లాండు ప్రాన్సు జర్మనీ మొదలగు దేశములకు చాల వరకు నెగుమతి చేయు చున్నాము.

నువ్వులను బ్రాహ్మణ కార్యములందు వాడుదురు.

పెద్ద పల్లేరు ఇసుక నేలలో పెరుగును. దీని వేరు నారింజ రంగుగా నుండును ఈ మొక్క ఆరంగుళములు మొదలు రెండడుగు లెత్తు వరకు పెరుగును. ఆకులు అండాకారము, పువ్వులు పచ్చగా నుండును. దీని ఆకులను రొట్తను వేడి నీళ్ళలో నైనను, పాలలోననను వేసి కలియ బెట్టు చున్న యెడల నవి చిక్క బడును, గొల్లలు పెరుగులో నీళ్ళు బోసి గట్టిగా నుండుటకు దీని నుపయోగింతురట.

బగ్గ పట్టి మొక్క చెరువు గట్లమీద నొకటి రెండడులు ఎత్తు మొలచును. వర్ష కాలములోను శీతా కాలములోనుల్నీలపు రంగు పువ్వులను బూసి అందముగా అగుపించును. వుప్పులకు సువాసన గలదు.